జీవకోటి నెల్ల పుడును పా లించు త్రిమూ ర్తు బ్రహ్మ సృష్టి చేయుచు తల వ్రా తల్ పని లో ను శ్రీ విభుండు పాలకడలి నుండే జనులన్ వల్లకాటిలో తిరుగు, శ్రీ వల్లభుండు
మీ ప్రయత్నం ప్రసంశనీయం. కాని ఇది ఛందోబద్ధంగా లేదు. కాని కొద్దిగా అభ్యాసం చేస్తే మీరు తప్పక మంచి పద్యాలను వ్రాయగలరు. మీ అభ్యాసానికి ఈ బ్లాగు చక్కని వేదిక. స్వస్తి!
క్షీరసాగర మథనముఁ జేయు వేళ
రిప్లయితొలగించండిప్రేమతో స్వీకరించెను "శ్రీ"ని శివుడు
స్వీకరించెఁ గావున "శ్రీ"కి శివుడె ధవుడు
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు!!
శ్రీ = విషము
పూరణలో వైవిధ్యం చూపించారు. బాగుంది. అభినందనలు.
తొలగించండిబూది పూతలు గళమున పునుక ధారి
రిప్లయితొలగించండివల్లకాటిలోఁ దిరుగు,శ్రీవల్లభుండు
ఆది శేషుని పడగల నాద మరచి
లచ్చితో కూడి యుండును లక్ష ణముగ
మీ పూరణ బాగున్నది.
తొలగించండి‘వల్లభుండు+ఆది’ అని విసంధిగా వ్రాశారు. ‘వల్లభుండు| శేషతల్పముఅపై నుండి యాదమరచి’ అనండి.
శాంభవీ ప్రియ నాధుడు సంతతమ్ము
రిప్లయితొలగించండివల్లకాటిలో తిరుగు, శ్రీ వల్లభుండు
శేష తల్పము నందున సిరి తనపద
పద్మములకు సేవసలుప వరలు చుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగట్టువిలుకాడు ముక్కంటి కరిమెడదొర
రిప్లయితొలగించండివల్లకాటిలో దిరుగు, శ్రీ వల్లభుండు
పాల కడలిని శేషుని పాన్పు పైన
విష్ణు లోకమునందున విస్ఫురించు!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరియె నర్చించ మానసమందునుండి
రిప్లయితొలగించండితిరుగు వైకుంఠ వీధుల పరమ శివుడు!
హరుడె గొల్వగ దీరుచున్మురిసి మదిని
వల్లకాటిలో దిరుగు శ్రీవల్లభుండు!
బాగుంది మీ పూరణ. అభినందనలు.‘హరియె యర్చించ’ అనండి.
తొలగించండిశివుని దయయున్న దానౌను చిటికెలోన
రిప్లయితొలగించండివసుధలోపల నరుడు శ్రీ వల్లభుండు
కరుణ దప్పిన నిక్కమ్ము మరునిమిషము
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
తొలగించండిస మ స్య.
రిప్లయితొలగించండి'''''''''''''''' * గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ యనెడు పదమునకు లక్ష్మి యని మరియు
పార్వతి , సరస్వతి యను భావమ్ము కలదు ;
వల్ల కాటిలో దిరుగు శ్రీవల్లభు౦ డ
టన్న వాక్యము = సుకవి ! సమర్థ. మగును
{ సమర్థము = అర్థ వ౦త ము }
పూరణ బాగుంది. కాని శ్రీ శబ్దానికి లక్ష్మి, సరస్వతి అనే తప్ప పార్వతి అనే అర్థం లేదు.
తొలగించండి
రిప్లయితొలగించండిభస్మధారి,యాదిగురువు,పరమశివుడు వల్లకాటిలోదిరుగు,శ్రీవల్లభుండు పాలసంద్రానశేషునిబాన్పుపైన హాయిబవళించియుండునునహరహమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅల్లన మశనమందున నెల్లభూత
రిప్లయితొలగించండిప్రేతతతి.యుండు నయ్యవి భీతిగొలుప
నీయకుండగ రక్షణ నిచ్చుకొరకు
వల్లకాటిలోదిరుగు శ్రీవల్లభుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిహరుఁడు సఖుఁడైన కతన; శ్రీహరియె సఖునిఁ
గలువఁ బోవంగఁ గైలాసకంధరమున
విషధరుఁడు లేఁడు! కానఁ దా వెదుకఁ గోరి
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు!!
శివునికోసం విష్ణువు వల్లకాటిలో తిరిగాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
తొలగించండికాటి కాపరి యయ్యె నిక్ష్వాక వంశ
రిప్లయితొలగించండివర్ధనుండు సద్ధర్మ భూభర్త యకట
దారుణంబుగ నిక శని దాపు రింప
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.
[శ్రీవల్లభుండు= ఐశ్వర్యవంతుడు]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇక్ష్వాకు... టైపాటు వల్ల ఇక్ష్వాక... అయింది.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అవునండి. గమనించ లేదు. ధన్యవాదములు.
తొలగించండి1.పరమ శివుడుపరవశాన పడతితోడ
రిప్లయితొలగించండివల్లకాటిలో దిరుగు శ్రీవల్లభుండు
కమలతో సతతము కరము కరుణ చూపి
వరము లొసగుచు నుండు తాభక్తి గొలువ.
2.పాల సాగరంబు చిలుక ప్రభవ మొంది
నట్టి గరళము ను గళము నందు దాల్చి
వల్లకాటిలో దిరుగు ,శ్రీ వల్లభుండు
సకల లోకములనుతాను చల్లగుంచు.
3.సర్పభూషణుండొసగుచు సగము మేను
వల్ల కాటిలో దిరుగు, శ్రీవల్లభుండు
రమను గూడిజనులనెల్ల రమణతోడ
గాచి సంరక్షణ మొనర్చు కరుణ జూపి.
4.శ్రీని కంఠము నందుంచి చిచ్చికంటి
వల్లకాటిలో దిరుగు ,శ్రీవల్లభుండు
సంతసముతోడ సిరిగూడి సంచరించు
నెంచి చూడనిర్వురిట శ్రీపతులు గారె.
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘కమలతో సతము కరము కరుణ చూపి’ అనండి.
రెండవపూరణలో ‘శ్రీవల్లభుడే గరళపానం చేశా’ డన్నారు.
నాల్గవపూరణలో ‘చిచ్చుకంటి’ అనండి.
విష్ణు శబ్దార్థముం జూడ విశ్వమంత
రిప్లయితొలగించండివ్యాప్తిచెందినవాఁ డగు, నట్టివాఁడు
లేని చోటేది? లోకమ్ములోనఁ గనఁగ
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు.
మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు!
తొలగించండిసర్వవ్యాపియైన విష్ణువు ఎక్కడైన నుండును...ఎక్కడైన దిరుగును. చూడగా వల్లకాటిలో గూడ దిరుగు...నను మీ పూరణ యుక్తిసహముగ నున్నది. శుభాభినందనలు!
ధన్యవాదాలు.
తొలగించండిగరళమును స్వీకరించిన గంగధారి
రిప్లయితొలగించండిబూది ధరియించి మెడలోన పుఱ్ఱెలుంచి
వల్లకాటిలోఁ దిరుగు; శ్రీవల్లభుండు
శేషపాన్పున వెలుగొందు చిత్రముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
దక్ష తనయ సతియె !తరలెను నొంటిగ,
శివుని నొదలి తాను! చిత్ర ముగను,!
సతియె లేని యిల్లు !జక్కగా దనిహరు,!
వల్ల కాటిలో దిరుగు శ్రీ !వల్లభుండు !!
పూరణ బాగున్నది.
తొలగించండి‘వదలి’ని ‘ఒదలి’ అన్నారు. ‘హరు’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘తరలెఁ దా నొంటిగ| శివుని వదలి... యిల్లు సరిగాదని హరుడు’ అనండి.
అంబటిభానుప్రకాశ్.
రిప్లయితొలగించండిగద్వాల.
తే**
తల్లి దండ్రులు లేరులే ,! తాను నొకడె,!
భిక్ష మెత్తుకొని బతుకు ! బీద వాడె!
నుండ యిల్లును లేకను నొంట రిగను,
వల్ల కాటిలో దిరుగు శ్రీ !వల్లభుండు !!
మీ రెండవ పూరణ బాగున్నది.
తొలగించండి‘బీదవాడె| యుండ నిల్లును...’ అనండి.
స మ స్య
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
క్ష మి ౦ చ ౦ డి గు రు వు గా రు !
శ బ్దా ర్థ చ ౦ ద్రి క లో :- శ్రీ అనగా
పా ర్వ తి అను నర్థము కూడా ఉన్న౦దున. నేను అలా వ్రాశాను .
నమస్తే
అలాగైతే ‘పర్యాయపద నిఘంటువు’ లో పార్వతికి శ్రీ అన్న పదాన్ని పేర్కొనాలి కదా! శబ్దరత్నాకరం, బ్రౌన్ మొదలైన నిఘంటువులలో కూడా లేదు.
తొలగించండిఅందునిందను సందేహ మెందు కికను
రిప్లయితొలగించండిసర్వ వ్యాపియై విలసిల్లు చక్రి లేని
ప్రాంత మేదియు లేదీ ధరణితలమ్ము
వల్లకాడున దిరుగు శ్రీ వల్లభుండు.
శ్రీని గళమున దాచిన శివుడు తాను
వల్లకాడున దిరుగు, శ్రీ వల్లభుండు
పడతిలక్ష్మితోడ ను పాలకడలి యందు
శేషతల్సము పై నివ సించియుండు
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండి‘సర్వవ్యాపి’ అన్నపుడు ‘వ్యా’ వల్ల ‘ర్వ’ గురువై గణదోషం.
వేద రక్షణఁ జేయగ వేగిరమ్ము
రిప్లయితొలగించండివదలి వైకుంఠ లోకము నదికిఁ దరలె
చేరఁ దన యంశ మత్స్య వతార మందు
వల్లకాటిలోఁ, దిరుగు శ్రీవల్లభుండు.
*వల్లకాటిలో = వల్లక+ ఆటి +లో
అనగా వల్లక అనే మత్స్య విశేషము నందు అనే భావాన్ని గ్రహించాలని మనవి.
మీ పద విభాగం సమర్థం కాదు. ‘ఆటి’కి బాతు అని అర్థం. దానికి అన్వయం?
తొలగించండిబాతు తో పాటు మత్స్య విశేషమనే నానార్థము ఉన్నది.
తొలగించండిఎవడు వాడన? చెప్పుట కెవరు లేక
తొలగించండినసిగె వల్లకాడున రామనాథ మంటు
తెలుపు కవియైన ఛందమ్ము వెలిగి పోగ
వల్లకాటిలోఁ, దిరుగు శ్రీవల్లభుండు.
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరిహరుండొక్కడేగద?యనుచుతిక్క
రిప్లయితొలగించండినార్యులపలుకు నిజమైన ?అందుశివుడు
వల్లకాటిలో దిరుగు|శ్రీ వల్లభుండు
శేష తల్పాన నిదురించు|దోషమేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నయ్యగారూనమస్తే.
రిప్లయితొలగించండిసవరించిన పద్యమును చూడండి అన్నయ్యగారూ.
పాల సాగరంబు చిలుక ప్రభవ మొంది
నగరళమునుశూలి గళము నందు దాల్చి
వల్లకాటిలో దిరుగు ,శ్రీ వల్లభుండు
సకల లోకములనుతాను చల్లగుంచు.
మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపశుపతిగ జీవులను గాచు పరమ శివుడు
రిప్లయితొలగించండివల్ల కాటిలో దిరుగు శ్రీవల్లభుండు
పాల కడలిపై నుండి కాపాడుచుండు!
విధిని నొసట లిఖించును విశ్వయోని!
పశుపతిగ జీవులను గాచు పరమ శివుడు
రిప్లయితొలగించండివల్ల కాటిలో దిరుగు! శ్రీవల్లభుండు
పాల కడలిపై నుండి కాపాడుచుండు!
విధిని నొసట లిఖించును విశ్వయోని!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్యసంధ హరిశ్చంద్ర చక్రవర్తి
రిప్లయితొలగించండికొశికుని యప్పుదీర్ఛెన౦గడిని వీర
బాహువున కమ్ముడై పోయి బానిసగను
వల్లకాటి లో దిరుగు.శ్రీ వల్లభుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబూడ్ది బూసి దేహమునిండ పురహరుండు
రిప్లయితొలగించండివల్లకాటిలో దిరుగు , శ్రీ వల్లభుండు
వివిధ అవతారముల నెత్తి భువిని తిరుగు
దుష్టులను ద్రుంచ కాపాడ శిష్ట జనుల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి‘వివిధావతారములు’ అనాలి కదా! విసంధిగా వ్రాశారు. ‘వివిధ రూపమ్ముల ధరించి...’ అనండి.
రాముడే హరియైనచో రమణి కొఱకు
రిప్లయితొలగించండిమానవుని వోలె శోకింప మర్మ మేమి ?
చూడు తమ్ముడా! తెలియక జాడ, యెందు
వల్ల కాటిలో దిరుగు శ్రీ వల్లభుండు?
( కాడు = అడవి )
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. చాల బాగుంది. అభినందనలు.
తొలగించండిమీరు చేస్తున్న సాహిత్య సేవ బాగుంది -వడ్డూరి.రామకృష్ణ
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తొలగించండిమీ ప్రొఫైల్, మీ వంశ ప్రాశస్త్యం, మీ తండ్రిగారి కవిత్వపాటవం తెలుసుకున్నాను. సంతోషం!
జీవకోటి నెల్ల పుడును పా లించు త్రిమూ ర్తు
రిప్లయితొలగించండిబ్రహ్మ సృష్టి చేయుచు తల వ్రా తల్ పని లో ను
శ్రీ విభుండు పాలకడలి నుండే జనులన్
వల్లకాటిలో తిరుగు, శ్రీ వల్లభుండు
మీ ప్రయత్నం ప్రసంశనీయం. కాని ఇది ఛందోబద్ధంగా లేదు. కాని కొద్దిగా అభ్యాసం చేస్తే మీరు తప్పక మంచి పద్యాలను వ్రాయగలరు. మీ అభ్యాసానికి ఈ బ్లాగు చక్కని వేదిక. స్వస్తి!
తొలగించండిశివుని వెంటాడె దనుజుడు చేయి సాచి
రిప్లయితొలగించండివిష్ణుతేజ మడ్డుపడియె వేగ వచ్చి
అసురుగూల్చి వెతుకసాగె హరుని కొరకు
వల్లకాటిలో తిరుగు శ్రీవల్లభుడు
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
తొలగించండిజీవకోటి నెల్ల పుడును కాపుగాయు
రిప్లయితొలగించండిబ్రహ్మ సృష్టి చేయు పనిలొ బద్ధు దగును
శ్రీ విభుడు పాలకడలి పై శయనమంద
వల్లకాటిలో తిరుగు, శ్రీ వల్లభుండు
సరదా సరదాగా:
రిప్లయితొలగించండికల్ల గాదుర నిజమిది కలి యుగమ్ము...
వల్ల కాదిక నాకని పద్మవాస...
అన్న గారి స్వగృహమున కరుగు దెంచ...
వల్లకాటిలోఁ దిరుగు శ్రీవల్లభుండు :)