29, డిసెంబర్ 2014, సోమవారం

న్యస్తాక్షరి - 21

అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’

29 కామెంట్‌లు:

  1. భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
    సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
    బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
    నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్

    రిప్లయితొలగించండి
  2. భాగవ తామృతా రసము పానము జేయుచు మోదమం దగన్
    వేగము భక్తిభా వమున వీనుల విందగు కావ్యగా నమున్
    వాగులు వంకలై దిరిగి భావిత రాలకు పోతనా ర్యులున్
    రాగల కాలమం దుగన రాజిలు సోముని భాగ్యమ బ్బగన్

    రిప్లయితొలగించండి
  3. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అమృతరసము’ సరియైన ప్రయోగం. ‘భాగవతామృత మ్మెపుడు పానము...’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. భాగవతమ్ము భాగ్యముల పంట తెలుంగు జనాళికిన్, దృతిన్
    భోగములందు భావనలు పూర్తిగ వీడిన రైతుబిడ్డ డా
    వాగధి దేవి సంతతము భాసిల నాతని మానసమ్మునన్
    త్యాగము సల్పి సంపదలు తాను రచించెను భారతీ కృపన్

    రిప్లయితొలగించండి
  5. "భా"గవతంబు తెన్గునను భాసుర రీతిని తీర్చిదిద్దెగా
    వేగమ భక్తి"భా"వమున,విస్తరమట్టుల జేసి మూలమున్
    వాగనుశాసనాదులను "భా"గ్యము గాగను వీడిరంచు,తా
    భోగము లేవి కోరకయె పోతన,సేద్యమె"భా"గ్యమంచు వే!

    "భా"రతదేశమందునను భక్తికి నాకరమైన గాధయున్
    ప్రేరణతోడ "భా"గవత వెల్గుల జూపెను పోతనార్యుడే
    భారము సంపదల్ ననుచు "భా"సుర రామునికంకితమ్ముగా
    సారమునైన సేద్యమున సాగుచు కేవల "భ"క్తియుక్తుడై

    రిప్లయితొలగించండి
  6. భాగవతోత్తముం డయిన బమ్మెర పోతన భక్తి భావమున్
    ప్రోగుగ జేసి భాగవత పుణ్యకథన్ తెనిగించు వేళలో
    భాగవతమ్ము పల్కెదను భారము రాముని పైన వైచి నే
    బాగుగ నాదు ఘంటమును బాయకు మమ్మరొ భారతీ యనెన్.

    రిప్లయితొలగించండి
  7. భాగవతమ్ముతెన్గునను పండిత పామరు లంతమెచ్చగన్
    తీగలు వాఱు భావముల తీయగ వ్రాసెను పోతనార్యుడే
    నాగలి బట్టినాటెనిల భావికి నీయగ భక్తిబీజముల్
    భాగవతమ్మునేర్వకడు భాగ్యము గల్గును భారతీ కృపన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ ! మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో యతి నొకమారు చూడండి.

      తొలగించండి
  8. భాగవతా మృతా ఝరిని బమ్మెర పోతన పద్యధారలన్

    సాగగ భక్తిభావములుసార్ధక చింతయు శోభగూర్చగా

    బాగుగ క్షేమలాభములు భాసురమవ్వగ గుప్పవే ధరిన్

    భోగులు యోగులెల్లరుకు పూజ్యము భోజ్యము భాగ్యమే కదా

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘సంపదల్ + అనుచు = సంపద లనుచు’ అవుతుంది. నుగాగమం రాదు. సవరించండి.
    ****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అమృతఝరి’ సరియైన ప్రయోగం... ‘భాగవతంపు తేనియల బమ్మెర పోతన...’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. భావితరాలకున్వరముభారతదేశపుభక్తిభావనల్
    భావనలందుభాగ్యనిధిపట్టముగట్టెనుపోతనార్యుడే|
    పావనమైనజీవనమెభారముకాదనినెంచబూనియే
    దీవనలివ్వ?రామునిచెదీప్తినిబంచెనుభారతాళికికిన్
    2భారతదేశసంస్కృతినిభావితరాలకుపంచనెంచియే
    చేరగజేసెభాగవతచిత్రమునంతయుపోతనార్యుడే
    భారముగాదుజీవనముభాధ్యతచేతనుదాటవచ్చుగా|
    కారణముల్విధానములు,గాథలెభాగవతానదేల్పెగా|

    రిప్లయితొలగించండి
  11. భాగవతంపు కన్యకను భారతి మెచ్చగ నంకితంబిడన్
    సాగునె నమ్మి భారమును స్వాతిశయమ్మన మోసె గాదె! యే
    బాగులఁ జూడ కున్న సమభావము వీడెనె కష్టమందునన్?
    భోగమెరుంగ నట్టి మన పోతన మంత్రియె? భారతావనిన్!

    రిప్లయితొలగించండి
  12. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘కాదని యెంచ బూని...’ అనండి. ‘రామునిచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. అక్కడ ‘రాఘవుని’ అనండి.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. భారతిభాగ్యమున్నిడగ?భార్యుడు,భక్తుడుపోతనార్యుడే
    కూరిమివంటిభావనలకూర్పులయందునభక్తిశక్తియున్
    భారతదేశమంతటను,భావకవీంద్రుడు-రామనామమే
    దారియటంచుదెల్పెగద|తాత్వికచింతనెసంస్కరించుగా

    రిప్లయితొలగించండి
  14. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
    నాల్గవపాదంలో నియమం తప్పింది. సవరించండి.

    రిప్లయితొలగించండి
  15. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    భాగవతమ్ము వ్రాసెగద బమ్మెర పోతన యా౦ధ్రమందునన్

    బాగుగ,దివ్య భావముల ప౦చెడు పద్యములన్ వసి౦చ,గా

    వాగనురూపయైన యలభారతి
    తత్కృతి నేడు భక్తి వి
    ద్యాగమ పారిజాతవనమై ధరపైణ విభాసిలు౦ గదా


    రిప్లయితొలగించండి
  16. భాసిల ముక్తి నిచ్చునది పావనగ్ర౦థము తెన్గు బాసలో

    జేసెను భక్తి భావనల చిత్తము రంజిల,రామమూర్తి కే

    వాసిగ న౦కితమ్మిడెను భాగవతమ్ము జగద్దితమ్ముగా

    బాసెను కర్మబంధముల బమ్మెర పోతన భాగ్యమేర్పడన్


    డిసెంబర్ 29, 2014 5:39 [PM]

    డిసెంబర్ 29, 2014 6:12 [PM]

    రిప్లయితొలగించండి
  17. భాగవతుండు రాము పదపల్లవ పద్మము లెల్లవేళలన్
    రాగము, భక్తి భావమలరారగ గొల్చెడివాడు శ్రీ మహా
    భాగవతంబు వ్రాసె హిత భావముతో మకరంద మద్దుచున్
    ఆ గురు బ్రహ్మపోతన జనాత్మల నిల్చియు భాసిలు న్సదా .

    రిప్లయితొలగించండి
  18. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రాముణ్ణి భాగవతుణ్ణి చేసారు. భాగవతుడంటే భగవద్భక్తుడు కదా! అక్కడ ‘భాగవతాధిదైవపదపల్లవ...’ అందామా?
    ****
    సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు.
    శైలజ గారి ఆ పద్యపాదాన్ని ‘నాగలి బట్టి నాటె సుజనాళికి నీయగ భక్తిబీజముల్’ అందామా?

    రిప్లయితొలగించండి
  19. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి
    భాగవతుండు, రాము పదపల్లవ పద్మము లెల్లవేళలన్
    భాగావతుండు అనుచోట కామా పెట్టినచో సరిపోతుందేమో అనుకుంటున్నాను. తెలియజేయ మనవి

    రిప్లయితొలగించండి
  20. గండూరి వారూ,
    చక్కగా సరిపోతుంది. సందేహం లేదు. ఆ కోణంలో నేను పరిశీలించలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  21. భారము నీదటంచు తన పల్కుల మూలము నీవెయంచు తా
    మీరిన భక్తి భావమున మేలుగ దల్చుచు రామచంద్రునే
    పారగ పాతకమ్ము విన భాగవతమ్మును వ్రాసినాడుగా
    కోరక రాజభోగములు గొప్పగ పోతన " భాగ్యవంతుడే ".

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. భారతి మాతనున్ కనుల పండుగగా గను భాగ్యమబ్బగా
    కూరిమి తోడ భావమున గొప్పగ భక్తిని నింపి వ్రాసె , తా
    వైరిభయంకరమ్మయిన భాగవతమ్మును భక్తితో, మహా
    కారపు గ్రంథమై వెలయగా, నిలలోపల భారతమ్మునన్.

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఉ.భాగవతోత్తముండుకవిపండితపామరవందనీయుడీ
    యాగమశాస్త్రభాసురుడుఆంధ్రకవిత్వపుకీర్తిచంద్ర,మా
    బాగెము మిమ్ముపోందగనుభాగవతంబునె ఇచ్చినావుగా
    భోగము లిచ్చునీ దుకృతి భూరిజమంతకుభాగ్యరేఖయై

    రిప్లయితొలగించండి
  26. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా !
    వందనములు !

    ప్రతిభ ఎవరి సొత్తూ కాదు
    తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడూ ఉంటాడు
    తప్పులు చెయ్యని వారెవరైనా ఈ భూమి మీద ఉన్నారా
    ఆదికవి నన్నయ్య కన్నా ప్రతిభావంతుడు పుట్టాడే అనుకోండి
    నన్నయ్య కవిత్వంలో కూడా తప్పులు పట్టగలుగుతాడు

    మీరేమీ తెలు గు భాషను ఉద్ధరిస్తున్నానని కానీ
    పద్యరచన నేర్పిస్తానని గానీ
    ఎక్కడా ఎప్పుడూ ఎవరికీ ప్రకటించ లేదు

    మీ మానాన మీ బ్లాగులో మీకు నచ్చిదేదో మీరు ప్రకటించుకొంటున్నారు
    మా అంతట మేము కోరి మీ బ్లాగులో , వచ్చీరాని చెత్తేదో వ్రాస్తుంటే
    ఎంతో ఓపికగా ఆ చెత్తంతా అక్షరం అక్షరం మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి
    సరిదిద్దుతున్నారు - మీకు నచ్చిన - మీకు వచ్చిన పరిధిలో
    దాని వలన ఎంతోమంది నా వంటి వారికి పద్యరచన లోని మెలకువలు తెలుస్తున్నవి
    మమ్మల్ని మేము కొంతవరకైనా సరిదిద్దుకోగలుగుతున్నాము

    నా విషయం తీసుకుంటే నాకు నలభయ్యేళ్ళ క్రితము నుండీ పద్యాలు వ్రాసే అలవాటున్నది
    కానీ దాన్ని చూసి పరిశీలించి తప్పులు చెప్పేవాళ్ళు లేరు
    నేనెవరి దగ్గరకైనా వెళదామంటే ఉదయం 7 గంటలకు బయటకు వెళ్లి
    రాత్రి 12 గంటల తరువాత ఇంటికి జేరే తీరుబాటెరుగని ఉద్యోగం
    ఎవరికి చూపించుకోను ఆ టైములో వెళ్లి
    అందుకే బుద్ధి పుట్టినప్పుడు రాసుకోవడం - దాచుకోవడం - అంతే

    నా పద్యరచన కొక పరిశీలకుని అవసరం మీ బ్లాగు ద్వారా మీ ద్వారా తీరింది
    మీ ఋణమెన్నటికీ తీర్చుకోలేనిది - ఏమిచ్చినా తీరనిది
    ఒక కుసంస్కారి ఏదో అన్నాడని మీరు బ్లాగు మూసేస్తే
    నా లాంటి వాళ్ళ కెందరికో మీరన్యాయం చేసిన వారౌతారు
    ఆ పని ఎన్నటికీ చెయ్యరని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి