పోచిరాజు సుబ్బారావు గారూ, మీరు చిత్రాన్ని సరిగా పరిశీలించలేదు. రాముణ్ణి యమధర్మరాజుని చేశారు. వ్రాసిన పద్యం బాగున్నది కాని మరో ప్రయత్నం చేయండి. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాత్రి ఒంటి గంట వరకు కుస్తీ పట్టినా దత్తపది పూరించలేక పోయాను . పద్యరచనకు చిత్రము అర్ధం కాలేదు . కానల కేగెద నే మీ యానతి శిరసావహింతు నానందముగా నేనీ యయోధ్య విడిచెద నీనాడే నాకు సెలవు నిడుమా తల్లీ !
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, చిత్రం అర్థం కాలేదంటూనే చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు. **** మిస్సన్న గారూ, చిత్రాన్నికి తగినట్లుగా చక్కని ఖండికను వ్రాసి అలరింపజేశారు. అభినందనలు. మూడవ పద్యంలో సేమమ్ము టైపాటువల్ల సుమమ్ము అయినట్టుంది.
చిత్ర మందున ధర్ముడు చిత్రముగను
రిప్లయితొలగించండిచేతు లొగ్గియు దండముల్సేయు చుండి
సత్య వంతుని బ్రాణాలు సంత సమున
నిచ్చె సావిత్రి కాయన నిచ్చ వొడమె
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
తండ్రి కోరిక పినతల్లి ద్వారా తెలుసుకున్న రాముడు - కైకతో :
01)
____________________________________
చెల్లగ తండ్రి వాంఛితము - చేకొని యాఙ్ఞగ చేతు నిప్పుడే !
తల్లిరొ ! వందనంబు లివె ! - తప్పడు ధర్మము రాముడెన్నడు
న్నిల్లిదె వీడు చుంటి నిక - నేగెద దావము వాసముండగన్
మళ్ళను హద్దు తీరకనె ! - మంచిగ దీవెన లిచ్చి పంపుమా !
____________________________________
దావము = అడవి
తల్లి యాజ్ఞను తలదాల్చు తనయు డనగ
రిప్లయితొలగించండివిపినముల కేగు సమయము వేడ్క మీర
కారణం బైన పినతల్లి కైక దరికి
యరుగు దెంచెను దీవెన లందు కొనగ
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీరు చిత్రాన్ని సరిగా పరిశీలించలేదు. రాముణ్ణి యమధర్మరాజుని చేశారు.
వ్రాసిన పద్యం బాగున్నది కాని మరో ప్రయత్నం చేయండి.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడు వరము లిచ్చె ముద్దుగా కైకకు
రిప్లయితొలగించండికోరి నంత లోనె కూల బడెను
మంది పెరగ గాను మఠమునకేచేటు
రాణు లెక్కు వైన రగులు గుండె !
మాటనిచ్చిన తండ్రియే మలిగిపోయె
రిప్లయితొలగించండిమాటనడిగిన తల్లియే మచ్చబొందె
మాట నిలిపిన పుత్రుడే మాన్యుడయ్యె
మలుపు తిరిగెను రాముని మహిత గతులు.
ఇంతి వలన పోరు ఇంతింత కాదయా !
రిప్లయితొలగించండివందనాలు వంగి వంగి యేల ?
ఒక్క భార్య యున్న ఒదిగి మదిగి యుండు
మనకు రాము డయ్య మార్గ దర్శి !
పడతి కోర్కెల తోపతి పడగ ధాత్రి
రిప్లయితొలగించండిరాము పిలిపించి కైకేయి రయముగాను
విభుడొసంగిన వరముల విశద పరచి
యడవులకు పంపె రాఘవు నర్ధ రాత్రి
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తండ్రి మాటను దీర్చగ దాశరధియె
రిప్లయితొలగించండితల్లి ముచ్చట చెల్లింప దవము బోవ
యానతిమ్మని గోరెనా ప్రాణ సుతుడు
ధర్మ మార్గము వీడని తనయుడతడు!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాత్రి ఒంటి గంట వరకు కుస్తీ పట్టినా దత్తపది పూరించలేక పోయాను . పద్యరచనకు చిత్రము అర్ధం కాలేదు .
రిప్లయితొలగించండికానల కేగెద నే మీ
యానతి శిరసావహింతు నానందముగా
నేనీ యయోధ్య విడిచెద
నీనాడే నాకు సెలవు నిడుమా తల్లీ !
దా శరధి యట పినదల్లి దరికి జేరి
రిప్లయితొలగించండినీదు పంపున నేగుదు నేన డవికి
నమ్మ !పిన్నమ్మ ! యాశిసు లిమ్ము మికను
ననుచు జోడించి చేతులు వినతి జేసె
రామ నీయందు జనకుడు ప్రేమచేత
రిప్లయితొలగించండిచెప్పగాలేక మిక్కిలి చింత నొందె
రెండు వరముల నాకిచ్చె రేడు నాడు
వాని నడిగితి నిప్పుడు వలసి నాకు.
నీవు పదునాల్గు వత్సరాల్ నియతి గడుప
వనములను వెంటనే యేగ వలయు నిపుడు
భరతుడీ మహా సామ్రాజ్య పాలనమ్ము
సలుపు నిది చెప్ప దలచెను చక్రవర్తి.
తండ్రి వృద్ధులు తలపోయ తల్లి నాకు
మీర లానతి నిచ్చిన మీర గలనె
వనమునకు నేడె పోయెద వలదు చింత
తండ్రి సుమమ్ము జూడుడు దయను మీరు.
కొడుకుతో గూడి సోదరా చెడుపు చేసె
తల్లి కాదీమె పాతకి తప్పుకొనుము
చంపి యీమెను నరకాని కంపు వాడ
దారి జేయుదు నీకిక తప్పు కాదు.
తప్పు లక్ష్మణా కోపాన దారి తప్పి
తల్లి జంపగా పూనుట తగదు నీకు
ఆమె తప్పేమి లేదిట యామె యాజ్ఞ
పాడి గాదన మనలకు పాడి గాదు.
మూడవ పద్యం లో సుమమ్ము ను సేమమ్ము గా చదువుకో మనవి.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిచిత్రం అర్థం కాలేదంటూనే చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
చిత్రాన్నికి తగినట్లుగా చక్కని ఖండికను వ్రాసి అలరింపజేశారు. అభినందనలు.
మూడవ పద్యంలో సేమమ్ము టైపాటువల్ల సుమమ్ము అయినట్టుంది.
తల్లీ నీయానతి నా
రిప్లయితొలగించండికిల్లిదె వేదంబు, చనెదనిప్పుడె వని,కే
నొల్లను యధికారంబులు,
కల్లలు మా వంశమందు కనరావమ్మా!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.