10, డిసెంబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1561 (పసిబాలునిఁ బెండ్లియాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పసిబాలునిఁ బెండ్లియాడెఁ బడఁతి ముదమునన్.

26 కామెంట్‌లు:

  1. కసరక పెం చగ వలయును
    పసి బాలుని, బెండ్లి యా డె బడతి ముదమునన్
    దెస లెల్ల గీర్తి నొందిన
    నసదృ శుడగు రా మునిలను నమరులు వొగడన్

    రిప్లయితొలగించండి
  2. పసిబాల యాటలో నొక
    పసిబాలునిఁ బెండ్లియాడెఁ, బడఁతి ముదమునన్
    పసితనపు ముగ్ధత గనుచు
    ముసిముసి నగవుల మురియుచు ముద్దిడె వారిన్

    రిప్లయితొలగించండి
  3. దెస మారిన సూరీడట
    వసివాడగ యలుక చెందె పాపడి వోలెన్
    గుసగుస లాడిన సంధ్యయె
    పసిబాలుని పెండ్లి యాడె బడతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  4. బాలు అనే పేరు గలవానిని...

    రుసరుస లాడుచు బెద్దలు
    గసిరిన పెడచెవినబెట్టి కడు ప్రేమముతో
    పసితనమున సఖుడగు రూ
    పసి బాలు, ని బెండ్లియాడె పడతి ముదమునన్!!!

    రిప్లయితొలగించండి
  5. అసువులు బాయగ సోదరి
    కసుగందును పెంచ బావ కలవరపడగన్
    వసిగొని, బావను, పెంచగ
    పసిబాలుని, పెండ్లి యాడెఁ బడతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    మాజేటి సుమలత గారూ,
    పిల్లల పెండ్లి యాటతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాలసూర్యుని పెండ్లాడిన సంధ్య.. ఓహ్! అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    ‘రూపసి యైన బాలు’కు పెండ్లి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పసివాని గనిన యక్కకు
    ముసిరిన రోగాన మరణ మొదవను బావన్
    కసరక నే పెంచగ నా
    పసిబాలుని, పెండ్లి యాడెఁ బడతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పూర్వం రాజులలో ఈ ఆచారం ఉందని విన్నాను.సరియైన కథ తెలియదు.
    మిసమిస లాడెడు వయసున
    పసగల పతిసమయ రాణి పదవిని నిలుపన్
    వెస రాజు చిన్న తమ్ముని
    పసి బాలుని పెండ్లి యాడెఁ బడతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  10. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఒసగి తన మొదటి భర్తకు
    పసిబాలునిఁ- బెండ్లియాడెఁ బడఁతి ముదమునన్
    రసికుని మరియొక యువకుని
    ఇసిరో యువతులు విడాకు లిటులిడ తగునా

    రిప్లయితొలగించండి
  11. హసియాఁడు మొగము ముదమున
    వెసఁ గాంభీర్యమునుఁ వొందు వీరత్వమునన్
    ముసి నగవుల వెల్గెడు తా
    పసి బాలునిఁ బెండ్లియాడెఁ బడఁతి ముదమునన్.
    4

    రిప్లయితొలగించండి
  12. ముసునూరి వారి యింటను
    పసితనమునె పెండ్లి యగుట పరిపాటి కదా!
    ముసిముసి నవ్వుల బాలిక
    పసిబాలునిఁ బెండ్లియాడెఁ బడఁతి! ముదమునన్.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    వసుమతి దివియేకమవగ
    మసగిన ప్రళయమ్ము నందు మఱ్ఱాకు పయిన్
    హసదుగ నిదురించిన యా
    పసి బాలుని బెండ్లి యాడె బడతి ముదమునన్

    రిప్లయితొలగించండి

  14. కే ఈశ్వరప్ప గారి పూరణ
    విసుగున నిదురించగ కల
    కసురున కానుకల నాశ కల్మష నాధున్
    పొసగును విడివడి ముద్దుగ
    పసిబాలునిఁ బెండ్లియాడెఁ, బడఁతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కొసరి కొసరి తినిపించుచు
    పసితనమున నాడి పాడు బావే వరుడై
    కసిరేపగ మారని తన
    పసి 'బాలు' ని పెండ్లియాడె పడతి ముదమునన్!

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కే*ఈశ్వరప్పపురాణం
    పసగలరూపసికొరకో
    నసురుడువోబాలుడయ్యునంకముజేరన్
    ముసిముసినవ్వునముద్దిడు
    పసిబాలునిబెండ్లియాడిపడతిముదమునన్

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘హృదయమ్’ అని హలంతంగా వ్రాయడం తెలుగు సంప్రదాయం కాదు. కనుక అక్కడ ‘పంచు నెడఁదనే’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. పసి వాడన నిస్వార్ధుడు
    పసివాడటు నాదియనక పంచు నెడ c దనే
    వసి వాడని హృదయముగల
    పసి బాలుని c బెండ్లి యాడె c బడ c తి ముదమునన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు 10/12/14

    రిప్లయితొలగించండి
  21. 1.వెస ముని శాపమున నొకడు
    పసివాడయ్యెను,నతడు వివాహము జరుగన్
    వెస తొలగు శాపమనగను
    పసిబాలుని పెండ్లియాడె పడతి ముదమునన్
    2.అసమమునగు ప్రేమికులకు
    వెసను ప్రమాదమున వరుడు పిచ్చిని పొందన్
    పసివాని మాదిరగు నా
    పసి బాలుని పెండ్లియాడె పడతి ముదమునన్
    3.పసి బాలుగ తెలివెరుగని
    దొసగును గలవాని సిరిని తుష్టిగ పొందన్
    వెసనొక పేదవనిత తా
    పసిబాలుని పెండ్లియాడె పడతిముదమునన్
    4.కసితో నొకరుడొక వనిత
    వెస బలిమిని తా సుతుడగు వెర్రికి నిడగా
    దొసగుగ,-విధియని యనుచున్
    పసిబాలుని పెండ్లియాడె పడతిముదమునన్
    5.వెస ప్రేమ వలన నందెను
    పసిబాలుని-పెండ్లియాడె పడతిముదమునన్
    వెస పెద్దలు వానికి నే
    దొసగును తెలిసియును పెండ్లి తొందర జరుపన్

    రిప్లయితొలగించండి
  22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గుసగుస లాడుచు చెవిలో
    నసగక నిదురింపునపుడు నందము తోడన్
    పసిపాపకు చెప్పు కథన
    పసిబాలునిఁ బెండ్లియాడెఁ బడఁతి ముదమునన్

    రిప్లయితొలగించండి
  24. అసలౌ బ్యూటీ క్వీనుర
    తసదియ మూవీల జేరి తైతకలాడెన్
    ముసిముసి ప్రియంక చోప్రా
    పసిబాలునిఁ బెండ్లియాడెఁ బడఁతి ముదమునన్

    రిప్లయితొలగించండి