కవిమిత్రులారా,
మన కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారు
ఈరోజు
నూతన గృహపవేశ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా
వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యము(ల)ను వ్రాయండి.
నూతనగృహప్రవేశవినోదవేళ
సకలదేవతల్ గరుణతో చంద్రమౌళి
సూర్యనారాయణకు పెక్కు శుభము లొసఁగ
గా నపేక్షించు మా శుభాకాంక్ష లివియె.
క్రొత్త దై నట్టి యింటికి కూర్మి తోడ
రిప్లయితొలగించండినేగు సూర్యనా రాయణ ! యిపుడ నీకు
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆ యు రారోగ్య సంపద లన్ని యిడుత
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
గౌరీశంకర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు :
01)
____________________________________
చక్క నైనట్టి నూతన - ఛాయ యందు
సర్వసంపదల్ సమకూర్చు - సర్వకరుడు !
శాంతి సౌఖ్యము లొనగూర్చు - శాశ్వతుండు !
చంద్రమౌళికి శుభమిడున్ - జంద్రమౌళి !
____________________________________
సోదరులు నూతన గృహప్రవేశ శుభ సందర్భముగా శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికలకాలం సుఖంగా ఉండాలని దీవించి అక్క
నూతన గృహప్రవేశ శుభ సందర్భంగా మిత్రులు చంద్ర మౌళి సూర్య నారాయణ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశ్రీ చంద్రమౌళి సూర్య నారాయణ ( సూరి అన్నాను ఏమీ అనుకోకండీ...) గారికి నూత్న గృహప్రవేశ ఉత్సవ శుభాకాంక్షలతో..
రిప్లయితొలగించండిచంద్రమౌళీశు కృపనంది సవ్యముగను
సూర్య నారాయణుని దయ చొప్పడగను
భోగ భాగ్యమ్ములన్నియు పొంది " సూరి "
నూత్న గృహమందు చక్కగా నుండవలయు.
శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి శుభాకాంక్షలతో....
రిప్లయితొలగించండినూతన గృహప్రవేశమునుజరుపుకొను
సూర్యనారాయణకవికి శుభము లొసగి
చంద్రశేఖరుడందించు సంతసమ్ము
కరుణతో,మీకుమాశుభాకాంక్ష లార్య!!!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిగృహప్రవేశమహోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. తప్పకుండా రావాలనే అనుకున్నాను. కాని మూడు రోజులుగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. ప్రయాణం చేయలేను. రాలేకున్నందుకు మన్నించండి.
మీకు, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు!
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
భానువారము కృష్ణ పాడ్యమి భానుబింబపు దీప్తులన్
రిప్లయితొలగించండిశ్రీనివాసము బోలు స్వార్జిత శ్రీకరంబగు నింటిలో
తాను కాలిడు చంద్రమౌళికి తాతయున్ హరిశంకరుల్
పూని సేమము జేయు గావుత భూరి శోభనమూర్తులై.
చిరంజీవి చంద్రమౌళికి శుభాశీస్సులు
రిప్లయితొలగించండికలలు సాకారముగ నిల్లుగట్టినావు
ప్రేమ బంధమ్ములగు భార్యపిల్లలుండ
వలపుతలపులు నీయెద తలుపు దీయ
శాంతి సౌఖ్యము లందుము చంద్రమౌళి
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమిత్రునకు మత్తకోకిలతో శుభాకాంక్షల పాట పాడించి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండిసూర్య నారాయణాఖ్యుడు చొచ్చె నూత్న
రిప్లయితొలగించండిగృహము నీనాడు ముదమున గేహినియును
బంధు మిత్రుల తోడుత, భగవతియును
కలుముల జవరాలు హితుని కాచు గాత
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువర్యులు కంది శంకర య్యగారికి,శుభాకాంక్షలతో పద్యాలువ్రాసిన కవిమిత్రులందరికీపేరుపేరునా ధన్యవాదములు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి శుభాకాంక్షలతో:
రిప్లయితొలగించండిసీతారాముల కృపతో
పోతనవలెపద్యరచనమోదమునీయన్!
నూతన గృహప్రవేశము
ప్రీతిగ నెరవేరి మీకు వేడుకలొసగున్!
(అనివార్యకారణాన ఆలస్యంగా)
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారి పక్షాన ధన్యవాదాలు.