అమ్మ పాలు లేక ♦ నాకలికిని చిక్కి యావు పాలు గుడిచె ♦ నర్భకుండు అమ్మ లేని వారి ♦ కమ్మయే యావౌను నమ్మ పాల సాటి ♦ యావు పాలె ! _______________________________________
కె.ఈశ్వరప్ప గారూ, మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది.అభినందనలు. చివరిపాదంలో‘శయ’ అక్షరాలు అదనంగా టైపయ్యాయి. ‘వోర్పగు’ అనడం దోషమే. చివరి పాదాన్ని సవరించండి.
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ మింగుటకు తమ యింటిలో మెతుకు లేక పొదివి పట్టు కొనుచు నావుపొదుగు నోట చూషణము జేసె బాలుడు చోద్యముగను కనికరమున యా వతని యాకలిని దీర్చె మమత యించుక లేనట్టి మనిషి కంటె సాధువైన గోమాతయె చాల మేలు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాలు డ చ్చట జూడుడు వహ్వ యనగ
రిప్లయితొలగించండిపొదుగు పాలను ద్రాగుట పొందికగను
సాధు జంతువు గదమ ఱి చక్క గాను
నిచ్చు చుండెను వానికి నిష్ట ముగను
పాలను గుడుచుటకై యా
రిప్లయితొలగించండిబాలకుడు పొదుగును నోట బట్టుకు నిలిచెన్
మేలౌను గదా తిన్నగ
పాలను తన బొజ్జలోన పంపించినచో
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వత్సా ! బాగుందీ సం
రిప్లయితొలగించండివత్సరమే లాగుపైన వ్రాసినదాయెన్
వాత్సల్యము నావు జూపగ
వత్సను మరపించి పొదుగు పట్టితివి బలే !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘వాత్సల్య మావు చూపగ’ అనండి.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండిఅమ్మపాలవంటిఆవుపాలనువాడ
మంచిదనగతల్లిమగువవినియు
పాలుత్రాగనెంచెమేలనిభావించి
గోవుకెంతనోర్పుకూర్పుజూడ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘గోవు కెంత యోర్పు..’ అనండి.
మాస్టరు గారూ ! దోష సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివత్సా ! బాగుందీ సం
వత్సరమే లాగుపైన వ్రాసినదాయెన్
వాత్సల్య మావు జూపగ
వత్సను మరపించి పొదుగు పట్టితివి బలే !
అమ్మపాలు లేక నలమటించుచు నావు
రిప్లయితొలగించండిపాలు గ్రోలు చుండె బాలకుండు
మాత పిదప గోవు మాతయే ధాత్రిలో
నన్న బుధుల మాట లున్నతములు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
అమ్మ సాటి - ఆవే గదా :
01)
_______________________________________
అమ్మ పాలు లేక ♦ నాకలికిని చిక్కి
యావు పాలు గుడిచె ♦ నర్భకుండు
అమ్మ లేని వారి ♦ కమ్మయే యావౌను
నమ్మ పాల సాటి ♦ యావు పాలె !
_______________________________________
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది.అభినందనలు.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండిపొదుగునపాలు-ద్రాగుచునుపొందికలందునపిల్లవాడుయే
కొదవలులేనిహాయిగనకోర్కెలుదీర్చెడి-గోవుమాతగా
మదిదలపోసెనా/యనగమౌనముగా-గనుపించసంతసం
బొదిగినదృశయశ్యమాలికిదివోర్పగుకూర్పుకునేర్పుజూడుమా
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది.అభినందనలు.
చివరిపాదంలో‘శయ’ అక్షరాలు అదనంగా టైపయ్యాయి. ‘వోర్పగు’ అనడం దోషమే. చివరి పాదాన్ని సవరించండి.
బాలకృష్ణునిబాల్యముతలచినట్లు
రిప్లయితొలగించండిమెలగజేసినదృశ్యమేమేటిజూడ
పొదుగుపాలను-త్రాగెడిబుడతజూడ
బాలచేష్టలుదైవపులీలలేగ
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ తేటగీతి బాగున్నది. అభినందనలు.
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిమింగుటకు తమ యింటిలో మెతుకు లేక
పొదివి పట్టు కొనుచు నావుపొదుగు నోట
చూషణము జేసె బాలుడు చోద్యముగను
కనికరమున యా వతని యాకలిని దీర్చె
మమత యించుక లేనట్టి మనిషి కంటె
సాధువైన గోమాతయె చాల మేలు
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులుగురుదేవులుశంకరయ్యగారికివందనములు
రిప్లయితొలగించండిపద్య రచన:చిలిపి కృష్ణుని వలె చిన్నిపాపడొకడు
గోవు పొదుగు నుండి గ్రోలె పాలు
ఆత డాసురులకు హ౦తయై విలసిల్లె
యితని ప్రతిభ యేదొ యెరుగ వలెను
దూడకు పాలిచ్చునటుల
రిప్లయితొలగించండిపోడిమితో ధేనువచట పొదుగును గుడిపెన్
బోడిక నాకలి దీర్చగ
పాడిని కడుపారనిచ్చె వాత్యల్యముతో
తల్లి యొడిని చన్గుడిసెడు
రిప్లయితొలగించండిపిల్లాడికి బుడ్డి పాలు వెగటై పోవన్
కల్లాకపటము లేకను
తల్లిని మరపించె డావు దరి చవిచూచెన్!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.