9, డిసెంబర్ 2014, మంగళవారం

న్యస్తాక్షరి - 18

అంశం- అయ్యప్ప దీక్ష
ఛందస్సు- తేటగీతి
మొదటిపాదం మొదటిగణం మొదటి అక్షరం ‘ధ’
రెండవపాదం రెండవ గణం రెండవ అక్షరం ‘ర్మ’
మూడవపాదం మూడవగణం మూడవ అక్షరం ‘శా’
నాలుగవపాదం నాలుగవగణం మొదటి అక్షరం ‘స్తా’

18 కామెంట్‌లు:

 1. ధర్మ రక్షకు డయ్యప్ప ధరణి యందు
  వెలసి ధర్మ పాలన జేయు వలన మఱి
  భక్త గణములు దమశా యి శక్తుల దీక్ష
  దా ల్చి సేవించి రతని వి స్తా రముగను

  రిప్లయితొలగించండి
 2. ధరణి రక్షకుండయ్యప్ప శరణు గోరి

  పాప కర్మలు తెగనాడి పరమ నిష్ఠ

  విధిగ యాచ రించినొ శాస్త్ర విధిని వ్రతము

  సలిపి శబరి వత్తురు పంప స్తాన మాడి

  రిప్లయితొలగించండి
 3. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ, మూడవ పాదాలలో గణదోషం. ‘వెలసి ధర్మపాల జేసి ప్రజల గాచె| భక్తగణములు దమ శాయశక్తుల పరి’ అనండి. (పరి = దీక్ష)
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  బి.యస్.యస్.ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘స్తాన’ మన్నారు.అది మాండలికం, గ్రామ్యం. కనుక ‘శబరి వచ్చెదరు విస్తారముగను’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. ధర్మ సంస్థాప నార్థమై ధరను బుట్టె
  బ్రోవ కర్మ భూమి వశించు పుణ్య జనుల
  వేలు పులగుహరియు శాంభ వీ పతికిని
  సంతసముగ నయ్యప్పకు స్తావమిడుదు
  స్తావముః వందనము

  రిప్లయితొలగించండి
 5. ధర్మ మార్గము నయ్యప్ప దాసులంత
  నిత్య నిర్మల దీక్షతో నిరుముడులిడ
  శరణు ఘోషతో తమశాయ శక్తులమల
  తరలి వత్తురుధర్మసా స్తాలయముకు!!!

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  ధర్మయుతముగ నయ్యప్ప ధామమునకు
  విహిత కర్మల జేయుచు వినయ దీక్ష
  నల్లదుస్తులు ధరశాయి,నడచిపోవ
  దైవ మిచ్చును సిరులువి స్తారముగను

  రిప్లయితొలగించండి
 7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ధర్మ గుణముల వెలుగొంది తామసములఁ
  బాపి, నిర్మల చిత్తస్వభావమలరఁ
  నర్చనల జేయఁదగు శాస్త్రమరసి నారె
  స్వామి వరములఁ నొసఁగు విస్తారముగను.

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి రామారావు గారిపూరణ
  ధరను హరిహరతనయుని శరణుగోరి
  వరసుకర్మలమండలవార తరుణ
  ముర్వినిరుముడిదాల్చిశాస్త్రోక్తవిధిని
  సలుపుదురు దీక్షభక్తివిస్తారమతులు

  రిప్లయితొలగించండి
 11. ధర్మ ధీక్షతో నయ్యప్ప దండ దాల్చి
  కాళ్ళ చర్మమ్ము యెండలో కాలుచుండ
  తరలుచుంద్రు భక్తుల్ ప్రశాంత మది తోడ
  దైవపు కృపను పొంద విస్తారముగను

  రిప్లయితొలగించండి

 12. కె.యెస్.గురుమూర్తి ఆచ్గారి గారి పూరణ
  ధరణి బ్రోవ నయ్యప యవతరణ మ౦దె
  నీవు నిర్మల దీక్షతో నిరుముడి నిడి
  పద కనన్ జ్యోతి నేట శారదము నందు
  సార జీవన మి౦క విస్తార మగును

  రిప్లయితొలగించండి
 13. ధరణియె పరుపు! నామమె శరణ మనచు
  సతము నిర్మల భావన! సత్య దీక్ష!
  బ్రహ్మచర్యమంతరశాయిఁ బట్టియుంచ
  శాంతి సౌఖ్యాది సత్వ ముస్తాబు లమరు!

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనచందనాలతో
  కే*ఈశ్వరప్పపంపుసమస్యాపురణం
  ధర్మసంస్తాపనార్తమైదరనువెలిసె
  దేక్షమర్మంబునెలకొనిదిగులుమాన్పు
  మంగళంబగు-తనశనిమాయమగును
  సలుపనయ్యప్పదీక్షవిస్తారమయ్యే

  రిప్లయితొలగించండి
 15. ధర్మ సాధన వలయును ధార్మికులకు ,
  దీక్ష నిర్మల మార్గము దేవునిదన
  వడిగ పడిపూజ సువిశాల భావముగన
  సమత మమతలు బెంచి విస్తార మగుత
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 16. "ధ"ర్మమిల పైని నిలుపంగ తాను వెలిగె
  మహిషు క"ర్మ"లకు కినిసి మాన్యుడు మణి
  కంఠు డెలమిని జవ"శా"క్త లుంఠ నుండు
  చటుల దీక్షను వేమన "స్తా"ప ముడుగు

  "ధ"ర్మ బద్ధుండు హరిహర దైవసుతుడు
  పాప క"ర్మ"ల వీడియు వానిదీక్ష
  గొనగ ముక్తిడు,ఘన "శా"స్త గురువు నాజ్ఞ
  దయను గాచును మెట్లపై "స్తా"వరుండు

  "ధ"ర్మమూర్తగు నయ్యప్ప ధార్మికముగ
  కఠిన క"ర్మ"ల చేబూని కాలినడక
  శబరి గిరినెక్కి గురు"శా"స్త సామికృపను
  స్వామి గాగను పుణ్యంపు "స్తా"వరుండు

  "ధ"రను నలుపును ధరియించి తానువెలిగి
  తనువు క"ర్మ"ల కఠినాన తనువు నుంచి
  భజన చేతను ధీ"శా"లి, విజయులౌచు
  దక్షు లన్నిట(లన్+ఇట)నిల్పు శా"స్తా"నువర్తి

  రిప్లయితొలగించండి
 17. చంద్రమౌళి రామారావు గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  టైపాట్లున్నాయి. మూడవ పాదంలో నియమోల్లంఘన జరిగింది.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదుపూరణలు బాగున్నవి.
  ‘ధర్మమూర్తి + అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. సంధి లేదు.

  రిప్లయితొలగించండి