పాప గతులను వెదుకక పాండవులకు బాల మునువిడ నాడుచు వారి భాగ ములను నిమ్ము మా యోమామ !ముందు గానె కాని యెడ ల బో రిత ము లు గలుగు సుమ్మ నుచును బిల్లన గ్రోవిని నూ దె జక్రి
వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ిపిల్లగ్రోవిని నూదెడి’ అనండి. **** అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. దత్తపదాలను పరార్థంలో ప్రయోగించాలని నియమం. మీరు ‘బాల, పిల్ల’ పదాలను స్వార్థంలో ప్రయోగించారు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పూరణలో ‘బాలముగ’ అన్నది ఏ అర్థంలో ప్రయోగించారో తెలియలేదు. అలాగే ‘ఐదు + ఊళ్ళు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. (నేను గమనించని ఈ దోషాన్ని నాకు వ్యక్తిగతంగా తెలియజేసిన మిత్రునకు ధన్యవాదాలు.) సవరించండి. ‘బాలముగను నైదూళ్ళైన...’ అన్న సవరణను సూచించవచ్చు కాని ‘బాలము’నకు మూర్ఖమన్న రూఢ్యర్థమున్నది. అది ఇక్కడ అన్వయించదు. **** కె. ఈశ్వరప్ప గారూ, వృత్తరచనకు మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు. కొనసాగించండి. పద్యంలో అన్వయం కుదరలేదు. టైపాట్లు రాకుండా జాగ్రత్త పడండి. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పిల్లపాపలు’ అని స్వార్థంలో ప్రయోగించి నియమోల్లంఘన చేశారు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘లేక + అనిలోన’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘గెల్వలేక యనిలో భ్రూణ...’ అనండి. ‘వాలు..’...?
వాలుమగడ అంటే “శూరుడ” అని ద్రౌపది అర్జునుని సంభోదించి నట్లు వ్రాసాను. మార్చిన పద్యం మరల పంపుచున్నాను. పోరి గెల్వలే కయనిలో భ్రూణ హత్య సలిపి దురపిల్లఁ జేసెను కలుషమదిని పాప ఫలమును తాఁ బొందుఁ బాలసుండు వదలివేయుము గురుసుతు వధ వలవదు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో :
01)
____________________________________
కౌరవాధిపా పగతులు - కారు వారు !
బాలముగ నీదు పుత్రుడు - పలుకు వినక
పిల్లగ్రోవిని యూదెడి - గొల్ల ననుచు
పోరితము పాండవుల తోడ - గోరుచుండె
పోరు నష్టము, లాభము - పొందె, యనుము !
____________________________________
బాలము = మూర్ఖము
పోరితము = యుద్ధము
పాప మనియెంచి చూడక బాల వధకు
రిప్లయితొలగించండిచేతు లెట్లాడెనో గద హేతు వనక
నిదుర లోనున్న పిల్లల యదను జూసి
పోరి వీరుని వలెనేగి కోరి జంపె
అశ్వద్ధామ ఉప పాండవులను చంపు విధము
పాప గతులను వెదుకక పాండవులకు
రిప్లయితొలగించండిబాల మునువిడ నాడుచు వారి భాగ
ములను నిమ్ము మా యోమామ !ముందు గానె
కాని యెడ ల బో రిత ము లు గలుగు సుమ్మ
నుచును బిల్లన గ్రోవిని నూ దె జక్రి
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ిపిల్లగ్రోవిని నూదెడి’ అనండి.
****
అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
దత్తపదాలను పరార్థంలో ప్రయోగించాలని నియమం. మీరు ‘బాల, పిల్ల’ పదాలను స్వార్థంలో ప్రయోగించారు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాపమిట్టి తలపు కురువర్య! వలదు
రిప్లయితొలగించండినీకుఁ బాలనానుభవము నిండుసున్న.
వినుము నాశనమునకు చొ ప్పిల్లవలదు
పాండవులతోడ పోరిట్లు పాడిగాదు.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణుడు సంధి రాయబారంలో....
రిప్లయితొలగించండిపోరిన గెల్వగ లేరులె
మీరిన కాలమ్ము పాపమింతయు దలచన్
జాలరు దురపిల్లగవలె
కోరగ బాలీయకున్న కురుపతి వినుమా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపోరి తమ్ములన్ పాపము పుణ్య మనుట
రిప్లయితొలగించండిమాని కరుణజూపిల్లంట మరచి రమ్ము !
బాలక విధి యోనర్చము పాండు పుత్ర !!
పోరు సల్పుము జూపినీ పౌరుషమ్ము !!!
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణ రాయబారం..
రిప్లయితొలగించండిపిల్ల చేష్టలు చాలింక వృష్ణి తోడ
బాలముగ నైదు యూళ్ళన్న పాండవులకు
పాపమనికూడ నెంచక వదలనైరి
పోరి గెలువగ సాధ్యమే వారితోడ
ధర్మమే జయించు తుదకు ధరణి లోన!!!
కురుక్షేత్రమున శ్రికృష్ణుడు అర్జునునితో......
రిప్లయితొలగించండియేలా పాపము నెంచగఁ ?
బాలన మిచ్చును విజయము! బన్నన మందన్
గాలిడ స్వర్గము! పోరిన
మేలని దురపిల్లక రణ మేగుము నరుడా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
ధన్య వాదములు గురువర్యా!
రిప్లయితొలగించండి1
రిప్లయితొలగించండికే*దేపపుకాంతికేవెడలతీక్షనవేడికిపిల్లనిల్చునా1ccఈశ్వరప్ప
పాపపుభారమెట్లగునుపార్థునిచెంతనకృష్ణుడుండగా
అపనినాదిగాననిటనాజికిపోరిడుమార్గమెవ్వరో
దాపునకౌరవుల్ గనుకదండనవారికెబాలసంబుకేac1
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపిల్లతెమ్మెరల్ గాడ్పులై పెనగు రీతి
బాలభాను డుగ్రుడగుచు గ్రాలు నటుల
పాపకర్ములయిన కౌరవాధములను
పోరి అభిమన్యు పొందెను వీర గతిని
కె. యెస్ . గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిక్రూరు లైనట్టి కౌరవుల్ పోరి తుదకు
పిల్లపాపలు మొత్తము గుల్ల యైరి
జగతి బాలన మొనరించు శౌరి యుండ
ధర్మజాదుల నెవ్వరు తాక గలరు
ద్రౌపది అర్జునునితో
రిప్లయితొలగించండిపోరి గెల్వలే కనిలోన భ్రూణ హత్య
సలిపి దురపిల్లఁ జేసెను కలుషమదిని
పాప ఫలమును తాఁ బొందుఁ బాలసుండు
వదలివేయుము గురుసుతు వాలు మగడ
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలో ‘బాలముగ’ అన్నది ఏ అర్థంలో ప్రయోగించారో తెలియలేదు. అలాగే ‘ఐదు + ఊళ్ళు’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. (నేను గమనించని ఈ దోషాన్ని నాకు వ్యక్తిగతంగా తెలియజేసిన మిత్రునకు ధన్యవాదాలు.) సవరించండి. ‘బాలముగను నైదూళ్ళైన...’ అన్న సవరణను సూచించవచ్చు కాని ‘బాలము’నకు మూర్ఖమన్న రూఢ్యర్థమున్నది. అది ఇక్కడ అన్వయించదు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
వృత్తరచనకు మంచి ప్రయత్నం చేశారు. అభినందనలు. కొనసాగించండి.
పద్యంలో అన్వయం కుదరలేదు. టైపాట్లు రాకుండా జాగ్రత్త పడండి.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పిల్లపాపలు’ అని స్వార్థంలో ప్రయోగించి నియమోల్లంఘన చేశారు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లేక + అనిలోన’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘గెల్వలేక యనిలో భ్రూణ...’ అనండి. ‘వాలు..’...?
గురువుగారూ రెండవపాదంలో సవరణతో:
రిప్లయితొలగించండిఏలా పాపము నెంచగఁ?
బాలన మిచ్చును విజయము! బన్నము నందన్
గాలిడ స్వర్గము! పోరిన
మేలని దురపిల్లక రణ మేగుము నరుడా!
వాలుమగడ అంటే “శూరుడ” అని ద్రౌపది అర్జునుని సంభోదించి నట్లు వ్రాసాను. మార్చిన పద్యం మరల పంపుచున్నాను.
రిప్లయితొలగించండిపోరి గెల్వలే కయనిలో భ్రూణ హత్య
సలిపి దురపిల్లఁ జేసెను కలుషమదిని
పాప ఫలమును తాఁ బొందుఁ బాలసుండు
వదలివేయుము గురుసుతు వధ వలవదు
అన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించండిమన్నించండి. నేను సరిగా పరిశీలించకుండానే వ్యాఖ్యానించాను. మీ మొదటి ప్రయోగమే బాగున్నది. సవరణకూడా బాగుంది.
రాజసూయయాగ సభలో శిశుపాలుని వాచాలతకు బదులుగా మాధవుడు:
రిప్లయితొలగించండిపాపము పండె నీకు శిశుపాల! గతించెను నూరు తప్పులున్,
మోపెను బాలకుండవని మోహముతో భవదీయ మాత నే
సైపెడి బాధ్యతన్, కనగ జాలి యగున్ దురపిల్ల నామెయు-
న్నీపొలి జూచి, సాగవిక నీ దగు పోరిత పుం బ్రలాపముల్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యాన్ని వ్రాసి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
పూజ్యులయినకందిశంకరయ్యగురువర్యులకువందనాలతోపంపుపూరణం
రిప్లయితొలగించండికే*ఈశ్వరప్ప
పాపపరిహారమెంచెడిశాపగతిన
భీష్ముడలిగెనుశయ్యపైపిల్లలట్లు
బాలసంధ్యగకనిపించెకాలగతిన
పోరిమినెరిగిలాభమా/పూర్తిగాను
1.పద్మమందున"పోరి"కి పార్ధ సుతుడు
రిప్లయితొలగించండిసలుప నరుగగ,తా "పాప"సమరమునను
తేరి కం"బాల"చాటుగా దింపి శరము
చంప,దుర"పిల్ల"రే పాండు చయము నపుడు
2.సేన కం"పిల్ల" భీమజు చెలువు యుద్ధ
మందు,కం"బాల"గొట్టగా మడిసిరెల్ల
కర్ణుడే కూల్ప,దుర"పిల్ల"ఘనులనెల్ల
"బాప" గా జూచె పెద్దల శాప వితతి
3."పోరి"సాయంబు కోరగా పోయి పురికి
నావు లం"బాల"యరుపుల నాలకించి
గోపు నా"పాప"హరునట్టె కోరుకొనడె
యరుల కం"పిల్ల" జేసెడి హరిగ నెంచి
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
guruvugaaroo dhanyavaadamulu.
రిప్లయితొలగించండి