కవిమిత్రులకు నమస్కారములు . గురువర్యులు శంకరయ్య గారు హైదరాబాదు వెళ్ళుట వలన ఈరోజు మిత్రుల పద్యాలను సమీక్షించలేక పోవుచున్నారు. దూరవాణి ద్వారా ఈ సందేశాన్ని తెలియచేయు చున్నారు
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు మన బ్లాగుమిత్రులు గన్నవరపు నరసింహ మూర్తి గారి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరబాద్ వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అక్కడ గన్నవరపువారి ఆతిథ్యం, చింతా రామకృష్ణారావు గారు, వసంత కిశోర్ గారలతో ఆత్మీయవాతావరణంలో గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రయాణపు టలసట (ముఖ్యంగా తిరుగుప్రయాణంలో రైల్లో మూడుగంటలు నిల్చుని ఉండడం) వల్ల మీ పూరణలను, పద్యాలను పరిశీలించలేకపోతున్నాను. మన్నించండి. చక్కని పూరణలను అందించిన మిత్రులు..... జిగురు సత్యనారాయణ గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి, బొడ్డు శంకరయ్య గారికి, శ్రీపతి శాస్త్రి గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, శైలజ గారికి, కె. ఈశ్వరప్ప గారికి, మల్లెల సోమనాథ శాస్త్రి గారికి, కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, లక్ష్మీదేవి గారికి అభినందనలు, ధన్యవాదాలు.
పిరాట్ల ప్రసాద్ గారూ, తేటగీతికి ఆ అవకాశం ఉంది కాని ఆటవెలదికి లేదు. మీరు ఆ రెండు పద్యాలను విడివిడితా వ్రాయవచ్చు. మంచిభావంతో పద్యాలను వ్రాశారు. అభినందనలు. కొన్ని లోపాలున్నవి. నా సవరణలను గమనిస్తే ఆ లోపాలేవో అవగాహన చేసికొనవచ్చు....
పిరాట్ల ప్రసాద్ గారూ, ఆటవెలదిని గీతికగా వ్రాయవచ్చు అని నిపుణు లెవరైనా చెప్తే అది తప్పు. ఈ అవకాశం సమానపాదాలు గల పద్యాలకు మాత్రమే. ద్విపద, తేటగీతి, ఉత్పలమాలాది వృత్తాలకు ఈ అవకాశం ఉంది. ఆటవెలది, కందము మొదలైన పద్యాల నాలుగు పాదాలు ఏకలక్షణాన్ని కలిగి ఉండవు. అందువల్ల వాటిని మాలికవలె వ్రాయడానికి వీలులేదు. గమనించగలరు.
యక్షుడు! దివిజ ధన రక్షకుఁడు! మరి యే
రిప్లయితొలగించండికాక్షుడు! శివుని చెలికాడు వాడు!
త్ర్యక్ష భక్త వరుడు! ధనగణన ఘనుడు!
దక్షుఁడు! శివపాదదాసుఁడు గద!
లంక లోన సతము రహితోడ వసియించు
రిప్లయితొలగించండిరక్కసులకు రాజు రావణుండు
పండితుండు మరియు పరిపాలనంబున
దక్షుడు, శివ పాద దాసుడు గద!
కండ కావరములు గర్వము మించగ
రిప్లయితొలగించండిదక్షు డైన గాని దహన మౌను
పాప ముక్తి కొరకు పరితపించవలయు
దక్షుఁడు శివపాదదాసుఁడు గద
రావణాసురుండు లంకాధిపతి తన
రిప్లయితొలగించండితల్లి కోర్కు దీర్చ తపము జేసె
భక్తిలో మరి పరిపాలన యందున
దక్షుడు! శివ పాదదాసుడు కద!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఎర్రనార్యుని నెన్నగ నీశ్వరుండె
భారతమ్మును పూరించె పరవశమున
శంభుదాసుడు సత్కవి సాధుశీలి
తపసి దక్షుడు శివపాద దాసుడు గద
శివుని భంగ పఱు చ జేసెను యజ్ఞము
రిప్లయితొలగించండిదక్షుడు ,శివ పాద దాసుడు గద
కన్నడు నిల యతని కంటె భక్తి గ లుగు
వారు గాన బడరు వసుధ లోన
సూర్య గతిని మార్చు శూరుండు క్రూరుడు
రిప్లయితొలగించండిలంకనేలు రాజు రావణుండు
పండితుండు బలుడు భవ్యమౌ పాలనా
దక్షుడు శివపాదదాసుడు గద
రావణుండునెంచురాక్షసకృత్యాలు
రిప్లయితొలగించండినెన్నినున్నగాని,తిన్నగాను
మనసునందుదాయుమరువనిభక్తుడౌ
దక్షుడు|శివపాదదాసుడుగద|
2భక్తియెట్టిదయినబాణాసురుడునెంచె
శక్తియుక్తులందురక్తియందు
దక్షుడు|శివపాదదాసుడుగద?చూడ
మూర్ఖతత్వమెంతముసురుకున్న
పాండు పుత్రులందు ఘనుడు పార్ధుడౌను
రిప్లయితొలగించండిసవ్య సాచికి విల్లున సాటి ఎవరు
పాశు పతిని చేగొనినట్టి ఫల్గునుండు
ధర్మ దక్షుఁడు శివపాదదాసుఁడు గద!
దక్షయజ్ఞభంగ తదనంతరంబున
రిప్లయితొలగించండిమేక తలను పొంది మేలునంది
శివుని శక్తి తెలిసి చేసెను నతులనే
దక్షుడు శివపాద దాసుడుకద!
దక్షుడీశు మామ,తలచెను పిన్నగా
భంగమైనయాగ ఫలిత మౌచు
తలయు తెగగ పిదప,తానటు కొలిచెగా
దక్షుడు శివపాద దాసుడుకద!
వెండికొండ నెత్తి పీడితు డయ్యెగా
దక్ష రావణుండు రక్షలేక
శివునిదయను నతడె శివమంద రక్షించె
దక్షుడు శివపాద దాసుడుకద!
అర్జునుండు తాను నాజిని పందికై
దక్షుడౌచు జేసె దారుణముగ
శివుడు పాశుపతము చెలువున నిచ్చెగా
దక్షుడు శివపాద దాసుడుకద!
నమక చమక ములను కమనీయ మగునట్లు
రిప్లయితొలగించండిఉచ్చ రించి మనసు నూర డించి
భక్తి భావములను పలికించ గలిగిన
దక్షు c డు శివ పాద దాసు c డు గద !
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కంది శంకరయ్య కష్టంబునకు నోర్చి
రిప్లయితొలగించండిశంకరా భరణమును శ్రద్ధ తోడ
నిర్వహించు చుండె నిజముగా నతడు
ద్యక్షుడు, శివపాద దాసు గద.
రిప్లయితొలగించండియాగశాలలోన నగ్నిబడగ సతి
వీరభద్రు డపుడు వ్రేసె దక్షు
పగను మరచి శివుడు ప్రాణ మిడె మరల
దక్షుడు శివ పాదదాసు డుగద!!!
డిసెంబర్ 28, 2014 2:24 [PM]
రిప్లయితొలగించండిఘనుడు దక్ష బ్రహ్మ కక్షను బూనుచు
భవుని పరిభవించి పగతు డాయె
వైరమందు గూడ భక్తితో స్మరియించు
దక్షుడు శివ పాద దాసుడు గద
శివునిపూజతెలిసి చేసినాడనరాదు,
రిప్లయితొలగించండిశివుని మహిమతెలిసి చేరలేదు,
భక్తి వలన గొప్ప ఫలమందు కన్నడు
దక్షుఁడు; శివపాదదాసుఁడు గద!
కంది శంకరయ్య కష్టంబునకు నోర్చి
రిప్లయితొలగించండిశంకరా భరణమును శ్రద్ధ తోడ
నిర్వహించు చుండె నిజముగా నతడు
దక్షుడు, శివపాద దాసు గద.
Laxminarayan Ganduri గారు రెండవపాదంలోమూడవ గణం, ముడు / నాలుగవ పాదములలో చివరి గణాలను కూడా సరిచేయండి.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కారములు . గురువర్యులు శంకరయ్య గారు హైదరాబాదు వెళ్ళుట వలన ఈరోజు మిత్రుల పద్యాలను సమీక్షించలేక పోవుచున్నారు. దూరవాణి ద్వారా ఈ సందేశాన్ని తెలియచేయు చున్నారు
రిప్లయితొలగించండిపొరపాటును సూచించన ఎ . సత్యనారాయణ రెడ్డిగారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండికంది శంకరయ్య కష్టంబునకు నోర్చి
శంకరా భరణము శ్రద్ధ తోడ
నిర్వహించు చుండె నిజముగా నతడు
దక్షుడు, శివపాద దాసుడు గద.
ఉత్శాహవృత్తములోపురాణం
రిప్లయితొలగించండిపావనుండుదక్షుడుసివపాదదాసుడుగద|నో
సేవకుండులాగగుడిన-శివునికెదురుబెదరకన్
భావనంబెగాదుమంచిబాధ్యతందునెప్పుడున్
దేవనీవెయనుచునంధితీరికందునుండగా|
Laxminarayan Ganduri గారు మూడవ పాదం లో "నిజముగా" ఒక యింద్ర గణం, "నతడు" సూర్య గణం వాడారు. దాన్ని గూడా యింద్ర గణం గా మార్చండి.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు మన బ్లాగుమిత్రులు గన్నవరపు నరసింహ మూర్తి గారి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరబాద్ వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అక్కడ గన్నవరపువారి ఆతిథ్యం, చింతా రామకృష్ణారావు గారు, వసంత కిశోర్ గారలతో ఆత్మీయవాతావరణంలో గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రయాణపు టలసట (ముఖ్యంగా తిరుగుప్రయాణంలో రైల్లో మూడుగంటలు నిల్చుని ఉండడం) వల్ల మీ పూరణలను, పద్యాలను పరిశీలించలేకపోతున్నాను. మన్నించండి.
చక్కని పూరణలను అందించిన మిత్రులు.....
జిగురు సత్యనారాయణ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
శైలజ గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
లక్ష్మీదేవి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
భిక్షువుతనబిడ్డపెండ్లియాడినదని
రిప్లయితొలగించండికక్షబూనిసోముగాచె నుయని
ఆంక్షలమొదలెట్టె హరులేని యాగము
పక్షముచితి కిసతి భస్మ వవగ
శిక్షకుగురిచేసిశివుడురక్షించిను
తక్షణమజముఖముదయనొసంగి
మోక్షమిడగశాపమోచనచేసెను
దక్షుడుశివ పాద దాసుడుగద
ఆటవెలది లో మాల వలె ప్రాసను కూడా జోడించి వ్రాసినాను.ఇలావ్రాయవచ్చునో లేదో తెలియదు బాగున్న విమర్సించ గలరు.
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండితేటగీతికి ఆ అవకాశం ఉంది కాని ఆటవెలదికి లేదు. మీరు ఆ రెండు పద్యాలను విడివిడితా వ్రాయవచ్చు.
మంచిభావంతో పద్యాలను వ్రాశారు. అభినందనలు.
కొన్ని లోపాలున్నవి. నా సవరణలను గమనిస్తే ఆ లోపాలేవో అవగాహన చేసికొనవచ్చు....
భిక్షువుఁ దనబిడ్డ పెండ్లియాడినదని
కక్షబూని సోము గాచె ననియు
నాంక్ష లెన్నొ బెట్టె హరుడు లేని యజము
వగపున చితికి సతి భస్మ వవగ.
శిక్షకుగురిచేసిశివుడురక్షించెను
తక్షణ మజముఖము దయనొసంగి
మోక్షమిడగ శాపమోచన చేసెను
దక్షుడు శివపాద దాసుడుగద.
అంటే కొంతమంది నిపుణులకి చూపించాను రాయొచ్చు అన్నారు . సరే మీ సూచన కుడా పరిశీలిస్తాను . ధన్యోస్మి.
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఆటవెలదిని గీతికగా వ్రాయవచ్చు అని నిపుణు లెవరైనా చెప్తే అది తప్పు.
ఈ అవకాశం సమానపాదాలు గల పద్యాలకు మాత్రమే.
ద్విపద, తేటగీతి, ఉత్పలమాలాది వృత్తాలకు ఈ అవకాశం ఉంది.
ఆటవెలది, కందము మొదలైన పద్యాల నాలుగు పాదాలు ఏకలక్షణాన్ని కలిగి ఉండవు. అందువల్ల వాటిని మాలికవలె వ్రాయడానికి వీలులేదు. గమనించగలరు.