18, డిసెంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1565 (మగనిఁ దూలనాడి మాన్య యయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.
(ఆకాశవాణి వారి సమస్య)

33 కామెంట్‌లు:

 1. బలిమి తోడ నన్ను పరిణయ మాడగ
  నెంచి వచ్చినావు నీతిహీన
  యనుచు తాను దూకె నగ్నిలో కన్యక
  మగనిఁ దూలనాడి మాన్య యయ్యె
  (మగడు = రాజు )

  రిప్లయితొలగించండి
 2. పడక గదిని జేరి వలవల యేడ్చెను
  మగని దూల నాడి ,మాన్య యయ్యె
  మగని సేవ యందు మాలతి లగ్నమై
  మంచి దియను నట్లు మసలు కొనుచు

  రిప్లయితొలగించండి
 3. తండ్రి యాగ మనుచు తరలి మోదమలర
  శివుని మాట వినక శీఘ్ర గతిని
  భంగ పడగ తాను భార్గవు జేరక
  మగని దూల నాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  వీధి ప్రేమికుడు(road side romeo) - వీరవనిత :

  01)
  ________________________________

  ఇల్లు, వీధి, బస్సు ♦ నెచ్చోట నున్ననూ
  నిన్ను విడువ లేను ♦ నీరజాక్షి
  కనికరించకున్న ♦ కడతేర్తు నిన్నను
  మగనిఁ దూలనాడి ♦ మాన్య యయ్యె !
  ________________________________
  మగఁడు = మగవాఁడు

  రిప్లయితొలగించండి
 5. ఆంధ్రుల అత్తగారు - సూర్యకాంతం :

  02)
  ________________________________

  అత్త పాత్ర లోన ♦ నాంధ్రుల మెప్పించి
  సూర్యకాంత మిలను ♦ శ్లోక మొందె !
  గడుసు దేరి నట్టి ♦ గయ్యాళి యాలియై
  మగనిఁ దూలనాడి ♦ మాన్య యయ్యె !
  ________________________________
  శ్లోకము = కీర్తి
  మగఁడు = భర్త

  రిప్లయితొలగించండి
 6. చాకలి తిప్పడు - రామాయణమున్నంతవరకూ - ఉంటాడుగా :

  03)
  ________________________________
  పంక్తిశిరుని వద్ద ♦ బందిగా నున్నట్టి
  సీత జేరదీయు ♦ సిగ్గు లేని
  రామువంటి వట్టి ♦ కామి గా ననుచును
  మగనిఁ దూలనాడి ♦ మాన్య యయ్యె !
  ________________________________
  శ్లోకము = కీర్తి
  మగఁడు = రాజు
  మాన్య = గౌరవింపఁదగినవాఁడు

  రిప్లయితొలగించండి
 7. పెండ్లికి నిరాకరించిన భీష్మునితో అంబ :

  04)
  ________________________________

  నాదు జీవితంబు ♦ నాశనం బయె నయ్యొ
  నిన్ను విడువ నేను ♦ నిజము భీష్మ !
  యెన్ని జన్మలైన ♦ నెత్తి చంపుదునని
  మగనిఁ దూలనాడి ♦ మాన్య యయ్యె !
  ________________________________
  మగఁడు = శూరుఁడు

  రిప్లయితొలగించండి
 8. పిన్న మరిదిని కడు ప్రేమతో బెంచగ
  తాగివాడు సతము వాగు చుండ
  మరిది చేష్ట లన్ని మానవతీ లలా
  మగని దూల నాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 9. వైకుంఠమును వీడుచున్న లక్షీదేవి :

  05)
  ________________________________

  నాదు వాసమందు ♦ నా ముని తన్నినా
  శిక్ష నిడక ధూర్తు ♦ సేవ జేయు
  నిన్ను వీడి పోదు ♦ నిశ్చయంబిది యని
  మగనిఁ దూలనాడి ♦ మాన్య యయ్యె !
  ________________________________
  మగఁడు = భర్త

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని సతీదేవి తన మగని నెప్పుడూ తూలనాడలేదే! తండ్రి తన మగని తూలనాడడం సహించలేక ప్రాణత్యాగం చేసింది.
  ****
  వసంత కిశోర్ గారూ,
  ‘మగడు’ శబ్దానికి ఉన్న వివిధార్థాలను వినియోగించుకుంటూ మీరు వ్రాసిన ఐదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. మగడు వనములందు దిరుగుచుండును వాని
  వదల నిన్నుజేతు పట్టమహిషి
  రావె యనెడు మూర్ఖ రావణు, రామభా
  మ, గని దూల నాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 12. నిండు మనసు తోడ నిరతంబు ప్రేమించు
  భర్త మోసగించు వర్తనంబు,
  వేరుకాంత గూడు తీరును గనిన భా
  మ,గని,తూలనాడి, మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని విఱుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  ****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  విఱుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కడుపు నిండ దినగ నడువలేకబడెడు
  పరశుధరుని గనుచు భపతి నవ్వ
  తామసమ్ము తోడ దశభుజ చందమా
  మగని దూల నాడి మాన్య యయ్యె

  మనసు దోచి నావె మానినీ! నీవని
  నీచ బుధ్ధి తోడ కీచకుండు
  దారి కడ్డు రాగ ద్రౌపది కినుకతో
  మగని దూల నాడి మాన్య యయ్యె!!!

  రిప్లయితొలగించండి
 15. శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కనులు గాయ లైన కన్నయ్య కనరాక
  యలక పాన్పు నెక్కు పొలతి గనుచు
  రక్తి తోడ జేరు రాధారమణుని భా
  మ గని దూల నాడి మాన్య యయ్యె!!!

  రిప్లయితొలగించండి
 17. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  మాయ జేసి తెచ్చె మైథిలిన్,లంకకు
  పట్టమహిషి జేతు పడకసుకము
  యిమ్మనంగ సీత పొమ్మనుచు నసుర
  మగని దూల నాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  మరి యొక పూరణ
  భామ కొరకు శౌరి పడక గదికి జేర
  "దివ్యకుసుమ మీవు దేవి కిచ్చి
  మరచి నావు నన్ను కరకు గుండె"యనుచు
  మగని దూలనాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పడకసుకము| నిమ్మనంగ...’ అనండి. ‘అసురమగని’ అని సమసం చేయరాదు. ‘పొమ్మని దైత్యుల| మగని...’ అందాం.

  రిప్లయితొలగించండి
 20. కలతలుండవచ్చుగానికల్మషంబులేకనే
  పలుకుచున్నభర్తచెంతపడతినెంచగొప్పదే
  అలుకలందునర్దనారినన్నమాటలెన్నియో
  నలుపుగాకమగనిదూలనాడిమాన్యయయ్యగా
  2తపముజేయుచున్నతన్విపార్వతికడ
  మారువేషమందుజేరశివుడు
  తగనివాడవనుచునెగతాళిజేసియు
  మగనిదూలనాడిమాన్యయయ్యె

  రిప్లయితొలగించండి
 21. కె.యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ

  "అమ్మతో సమాన మన్య కాంత యెపుడు
  మకురు తోడ నిట్లు మాటలాడ
  ప్రక్కలిరుగు'నంచు ప్రక్కింటి స్త్రీ యొక్క
  మగనిదూలనాడిమాన్యయయ్యె

  రిప్లయితొలగించండి
 22. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  మీసూచనకు ధన్యవాదములు సవరించిన పద్యము

  మాయ జేసి తెచ్చె మైథిలిన్,లంకకు
  పట్టమహిషి జేతు పడకసుకము
  నిమ్మనంగ సీత పొమ్మని దైత్యుల
  మగని దూల నాడి మాన్య యయ్యె

  రిప్లయితొలగించండి
 23. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. భాగవతుల మధ్య పతులోడి తన్నోడ
  జుట్టు బట్టి లాగ చోద్య మనక
  చీర లూడ దీయ చెదరని వారి,లే
  మ, గని దూల నాడి మాన్య యయ్యె!

  రిప్లయితొలగించండి
 25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. మగడు త్రాగుబోతు,మద్యంబు కై,తను
  నింటనున్న సరకు లెల్లనమ్మి
  భార్య బిడ్డగోడు పట్టించు కోనట్టి
  మగని దూలనాడి మాన్యయయ్యె

  ఆటవెలది కొఱకు నాలి నగలనమ్మి
  యాలి,బిడ్డ పోషణరయకున్న
  తనదు యింటి కొఱకు ధైర్యంబు నందియు
  మగని దూలనాడి మాన్యయయ్యె

  ఇంట నీగ మోత,నింపుగా బయటనే
  పల్లకీని నెక్క బాగు గాదు
  యింటి లోని వారి నిబ్బంది పాల్జేయు
  మగని దూలనాడి మాన్య యయ్యె

  తనను జూదమోడ ద్రౌపది యానాడు
  సభను కీడు నందె-సతిగ తనను
  నొడ్డ నేమి హక్కు నున్నది యనుచును
  మగని దూలనాడి మాన్య యయ్యె

  బైట మగని పూజ వైనంబుగా జేసి
  యింటి లోన వాని నెపుడు తిట్టు
  భార్య,సంఘ మందు పదుగుర మెప్పందు
  మగని దూలనాడి మాన్యయయ్యె

  రిప్లయితొలగించండి
 27. సీత నపహరించి చెడు దారి చేపట్టి
  రావణుండు మెదిలె రాక్షసునిగ,
  మంచి మాట దెలిపి మనసును మరలింప
  మగని c దూల నాడి మాన్య యయ్యె
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘పోషణ + అరయకున్న’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని ‘ఆలుబిడ్డల గతి యరయకున్న’ అందామా?

  రిప్లయితొలగించండి
 29. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. మగని దూలనాడు మహిళల పోటీన
  గెలుచుకొనగ దలచి కేశి నొకతె
  వేది కెక్కి యామె విరివిగా ప్రియమైన
  మగని దూల నాడి మాన్య యయ్యె​!

  రిప్లయితొలగించండి
 31. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి