శంకరాభరణం సోదర సోదరీ మణులకు గురువులు శ్రీ శంకరయ్య గారికీ శుభాశ్శీస్సులు 4 నెలలుగా అందరికీ దూరమయ్యను .ఇప్పుడు అందరి పూరణలు చూడగల అదృష్టం కలిగింది చాలా రోజుల తర్వాత వ్రాయడం వలన గురువులకు శ్రమ కలిగిస్తే మన్నించ మనవి
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అక్కయ్యా, చక్కని పద్యంతో మీ పునరాగమనం ఆనందాన్ని కలిగించింది. ఇంతకాలం మీ రేమయ్యారు? గురుదేవులు నేమాని వారి నిర్యాణం నుండి మీ పద్యాలు లేవు. వారి మరణంతో విషాదాన్ని పొంది మీరు సాహిత్యవ్యాసంగ సన్యాసం స్వీకరించారేమో అనుకున్నాను. లేదా ఆరోగ్యసమస్య లేవైనా ఇబ్బందిపెట్టాయేమో అనుకున్నాను. మీ గురించి తెలుసుకొని వివరాలు చెప్పవలసిందిగా ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి కోరాను కూడా. వారినుండి సమాధానం లేదు. ఇంతకాలానికి మీ దర్శనం నాకే కాదు బ్లాగుమిత్రులకు కూడా సంతోషాన్ని కలిగించింది. **** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నమస్కారములు బ్లాగ్ సోదర సోదరీమణుల ఆదరాభి మానములకు కృతజ్ఞతలు . ఆరోగ్యం బాగానే ఉంది . చూపు మందగించడం వలన వ్రాయ లేకపోయాను ఇప్పుడు ఒకకన్ను కేట్రాక్టు మొన్న నవెంబెర్ 25 న చేసారు రెండవ కన్ను జనవరి ఫిబ్రవరిలో చేస్తారు ఇంకా పూర్తిగా తగ్గలేదు .కొంచం నొప్పిగా ఉంది .ఎక్కువగా చూడలేక పోతున్నాను .మరొక వారం రోజులు పట్ట వచ్చును .ప్రస్తుతం అసలే ఏకాక్షిని అదన్నమాట అసల్ సంగతి అందరికీ శుభాకాంక్షలతో
మిస్సన్న గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. **** అక్కయ్యా, మీ గురించిన వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మొన్న కళ్ళపరీక్ష చేయించుకుంటే నాకు కాటరాక్ట్ ప్రాథమిక స్థాయిలో ఉంది. కొంతకాలం తర్వాత ఆపరేషన్ చేయవలసి ఉంటుందన్నారు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
నమస్కారములు ఈ కేట్రాక్టు చాలా సామాన్య మైనదే .ముదిరితే గానీ చేయరు అస్సలు నొప్పిగానీ బాధ గానీ ఏమీ ఉండదు మొదట చేసిన వెంటనే బాండేజ వేసి పంపించేస్తారు మర్నాడు బాండేజ్ తీసేస్తారు కొన్ని డ్రాప్సు వాడ మంటారు .అంతే లోకల్ ఎనస్తీషియా ఇస్తారు ఒక20 నిముషాలు పడుతుంది మనకస్సలు ఏమీ తెలియదు భయం అస్సలు ఉండదు తగ్గడానికి మన ఆరోగ్యాన్ని బట్టి వారం పది రోజులు పడుతుంది బాండేజ్ తీయగానే అన్నీ చక్కగా కనబడతాయి అంతే భయం ఏమి ఉండదు ఆశీర్వదించి అక్క amdari aadaraabhi maanamulaku kRtajnatalu
పసుపుయందుగలవు పలుదివ్య గుణములు
రిప్లయితొలగించండిచర్మసుందరతకు సాధనంబు
వ్యాధిక్రిముల జంప యాంటీ బయొటికిది
వంట యిల్లు కద్దె పసుపు లేక ?
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పసుపునందు’ అనండి.
పసుపు ముద్దను జూడుము భామ ! యచట
రిప్లయితొలగించండిపసుపు ఘాటును దాళ క పారి పోవు
చుండె బురుగులు ,మఱియును శుభము కొఱకు
వంట కొఱకును గూడను వాడుదురుగ
గృహము లందున మనవారు నహరహమ్ము !
పసుపు పారాణి పాదాల పైడి యందె
రిప్లయితొలగించండిఘల్లు మనినంత యెదపొంగి జల్లు మనగ
పడతి కుంకుమ మెరయుచు పలుక రించ
నాకమును మించు గృహమని నలువ జెప్పె
శంకరాభరణం సోదర సోదరీ మణులకు గురువులు
శ్రీ శంకరయ్య గారికీ శుభాశ్శీస్సులు
4 నెలలుగా అందరికీ దూరమయ్యను .ఇప్పుడు అందరి పూరణలు చూడగల అదృష్టం కలిగింది చాలా రోజుల తర్వాత వ్రాయడం వలన గురువులకు శ్రమ కలిగిస్తే మన్నించ మనవి
మీ పునర్దర్శనం - చాలా ఆనందముగా నున్న దక్కయ్యా !
రిప్లయితొలగించండిపసిడి పచ్చ పసుపు పండించ ప్రకృతిగ
రిప్లయితొలగించండిపరిమ ళించు నదియె పాక మందు
పసుపు రంగు కలిపి పాడు జేతురు సుమా
మంచి యౌను కొమ్ము దంచు కొనగ
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అక్కయ్యా,
చక్కని పద్యంతో మీ పునరాగమనం ఆనందాన్ని కలిగించింది.
ఇంతకాలం మీ రేమయ్యారు? గురుదేవులు నేమాని వారి నిర్యాణం నుండి మీ పద్యాలు లేవు. వారి మరణంతో విషాదాన్ని పొంది మీరు సాహిత్యవ్యాసంగ సన్యాసం స్వీకరించారేమో అనుకున్నాను. లేదా ఆరోగ్యసమస్య లేవైనా ఇబ్బందిపెట్టాయేమో అనుకున్నాను. మీ గురించి తెలుసుకొని వివరాలు చెప్పవలసిందిగా ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి కోరాను కూడా. వారినుండి సమాధానం లేదు.
ఇంతకాలానికి మీ దర్శనం నాకే కాదు బ్లాగుమిత్రులకు కూడా సంతోషాన్ని కలిగించింది.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పసుపే క్రిమి సంహారిణి
రిప్లయితొలగించండిపసుపును వాడిన శుభమగు పడతులకెపుడున్
పసుపున్ పాలకు చేర్చిన
నసపెట్టెడి జలుబు దగ్గు నయమై పోవున్
పసగలుగు వంటలందున
పసుపున్ వాడంగచారు పప్పూ పులుసున్
పసుపు పరమౌషధముగద
పసుపును మించినదిలేదు భరతావనిలో
ఈరోజు రాజేశ్వరి అక్కయ్యగారు బ్లాగుకి రావడం వారి పద్యం చూడటం చాలా ఆనందం కలిగింది...
రిప్లయితొలగించండిపసుపుకున్న విలువ భారత దేశమే
రిప్లయితొలగించండితెలిసి కొనియె మొదట తీరుగాను
దేహ కాంతిఁబెంచు దివ్యమౌ యోషది
పెంచు జీర్ణ శక్తి మంచి గాను
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అక్కయ్యగారు, అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించే పద్యము చెప్పినారు. అభినందనలు. ఇన్ని రోజులనుంచీ మీరు రానేలేదు.
రిప్లయితొలగించండిపసుపునుఁ బెంచిన తోటలు
మిసమిస కుంకుమల చేలు మిక్కుటములుగా
దెసదెస పండెడు దేశము
వసియించుట నాకుఁ బెద్ద భాగ్యము సుమ్మా!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఇంటిగడపఁ దీర్చుచుఁ దా
రిప్లయితొలగించండివంటలన్ గాచు చుండి వనితల
మోమున్
కంటికి నింపొన గూర్చుచు
కంఠపు మాంగల్యమౌచు గౌరవమందున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘వంటలనే’ అనండి.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిఇంటిగడపఁ దీర్చుచుఁ దా
వంటలనే గాచు చుండి వనితల
మోమున్
కంటికి నింపొన గూర్చుచు
కంఠపు మాంగల్యమౌచు గౌరవమందున్
పసుపును భారతావనికి భాగ్యముగా వచియింతు రెందరో
రిప్లయితొలగించండిపసుపును, కుంకుమల్ పడతి ప్రాణము భారత ధాత్రి నెన్నగా
పసుపును తెన్గు నేల పయి వంటల వాడుచు స్త్రీలు తీవ్రమై
యుసురుల దీయు రాచకురుపున్ దరిజేరగ నీరు వింటిరా?
రాచకురుపు=cancer
నమస్కారములు
రిప్లయితొలగించండిబ్లాగ్ సోదర సోదరీమణుల ఆదరాభి మానములకు కృతజ్ఞతలు . ఆరోగ్యం బాగానే ఉంది . చూపు మందగించడం వలన వ్రాయ లేకపోయాను ఇప్పుడు ఒకకన్ను కేట్రాక్టు మొన్న నవెంబెర్ 25 న చేసారు రెండవ కన్ను జనవరి ఫిబ్రవరిలో చేస్తారు ఇంకా పూర్తిగా తగ్గలేదు .కొంచం నొప్పిగా ఉంది .ఎక్కువగా చూడలేక పోతున్నాను .మరొక వారం రోజులు పట్ట వచ్చును .ప్రస్తుతం అసలే ఏకాక్షిని అదన్నమాట అసల్ సంగతి అందరికీ శుభాకాంక్షలతో
ఇంటికి గడపల మీదను
రిప్లయితొలగించండివంటికి కళనీయ గోరు వనితలకైనన్
వంటకు, నౌషధములలో
కంటిరె మన పసుపుముద్దె గణపతికైనన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
****
అక్కయ్యా,
మీ గురించిన వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
మొన్న కళ్ళపరీక్ష చేయించుకుంటే నాకు కాటరాక్ట్ ప్రాథమిక స్థాయిలో ఉంది. కొంతకాలం తర్వాత ఆపరేషన్ చేయవలసి ఉంటుందన్నారు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
అక్కయ్య రాజేశ్వరి గారు బ్లాగు కు రావడం సంతోషంగాయున్నది .
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిఈ కేట్రాక్టు చాలా సామాన్య మైనదే .ముదిరితే గానీ చేయరు అస్సలు నొప్పిగానీ బాధ గానీ ఏమీ ఉండదు మొదట చేసిన వెంటనే బాండేజ వేసి పంపించేస్తారు మర్నాడు బాండేజ్ తీసేస్తారు కొన్ని డ్రాప్సు వాడ మంటారు .అంతే లోకల్ ఎనస్తీషియా ఇస్తారు ఒక20 నిముషాలు పడుతుంది మనకస్సలు ఏమీ తెలియదు భయం అస్సలు ఉండదు తగ్గడానికి మన ఆరోగ్యాన్ని బట్టి వారం పది రోజులు పడుతుంది బాండేజ్ తీయగానే అన్నీ చక్కగా కనబడతాయి అంతే భయం ఏమి ఉండదు ఆశీర్వదించి అక్క
amdari aadaraabhi maanamulaku kRtajnatalu
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి