గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. లక్ష్మి, విభుఁడు విడివిడిగా తత్సమాలనుకుంటే లక్ష్మి విభుఁడు అనడంలో దోషం లేదు. కాని సమాసంగా గ్రహిస్తే ‘లక్ష్మీవిభుఁడు’ అవుతుంది. ఈ సందిగ్ధతకు అవకాశం ఇవ్వకుండా ‘లక్ష్మి మగఁడు, లచ్చిమగఁడు’ అంటే సరి!
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ ఉత్సాహ:వినయ నియతి బవనసుతుడు విమల పదము లంటగా యినకులంపు గురువు ననుజు లెల్ల దివ్య గణములున్ జనకతనయ సరసనుండ జరిగె రామ పట్ట మ౦ తనలఘువు మంగళ ప్రద౦బు గా నయోధ్యలో
శంకరయ్య గారికి టీ కప్పులో తుఫాను మరచి పోదాము గురువు పనుపున యతి కౌశికుని సవనము గావు పెట్టిన రాక్షస గణము నెల్ల లఘువుగా నేల గూల్చిరి రాజ సుతులు రామలక్ష్మణు లస్త్ర శస్త్ర ములనేసి
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘విల్లొంచి’ అనడం గ్రమ్యం. ‘వండడం’ ఉంది కాని ‘ఒంచడం’ లేదు... కనుక ‘విల్వంచి’ అనండి. **** గండూరి లక్ష్మినారాయణ గారూ, దత్తపదాల నన్నిటినీ మొదటిపాదంలోనే ఇమిడ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ, ఉత్సాహంగా మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు. చివరిపాదం ప్రారంభంలో ఒక లఘువు తక్కువయింది. ‘పట్ట మం| త నలఘువుగ మంగళ...’ అనండి. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు మాటలయందున గురిని కుదిరి
రిప్లయితొలగించండినియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచెడు తేజుడతడు
లఘువు కాడులె రాముడా లక్ష్మి విభుడు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లక్ష్మి, విభుఁడు విడివిడిగా తత్సమాలనుకుంటే లక్ష్మి విభుఁడు అనడంలో దోషం లేదు. కాని సమాసంగా గ్రహిస్తే ‘లక్ష్మీవిభుఁడు’ అవుతుంది. ఈ సందిగ్ధతకు అవకాశం ఇవ్వకుండా ‘లక్ష్మి మగఁడు, లచ్చిమగఁడు’ అంటే సరి!
మాస్టరు గారూ ! ధన్యవాదములు. మీరు చూపిన మార్పుతో...
రిప్లయితొలగించండిగురువు మాటలయందున గురిని కుదిరి
నియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచెడు తేజుడతడు
లఘువు కాడులె రాముడా లచ్చి మగడు.
గురువులనిన భక్తి కొలది సేవలఁ జేయు
రిప్లయితొలగించండిటెపుడు లఘువుగ మదినెంచరాద
నుచును నినగణముగ నుడివిరి కాదొకొ
యా కులజులు యతిని యనుసరించి.
గురువు నాజ్ఞ తోడఁ గూల్చెను తాటకిన్
రిప్లయితొలగించండిరామవిభుడు కరము లఘువుగాను
నియతి తోడ నున్న నీరజాక్షుని గాంచి
ముని గణమ్ము లంత మురిసి రపుడు
లఘువు: శీఘ్రము
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘యతిని ననుసరించి’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గురువు" నాజ్ఞ పినాకము గొనియు చేత
రిప్లయితొలగించండి"లఘువు"గా దానినెక్కిడ రాఘవుండు
రాజ "గణము"లు మూర్ఛిల్ల రవముతోడ
విరిగె,ని"యతి"ని సీతను పెండ్లియాడె
"యతి" వర పురోహితులు నాది యజ్ఞవేది
"గురువు" లెల్లర యాశీస్సు గొనుచు,రాజ
"గణము" సేవింప,రాముండు ఘనము సలిపె
"లఘువు" కానట్టి హయమేధ రమ్యహవము
"గురువు"నాజ్ఞను తాటకి కూలనేసి
"యతి"గ యజ్ఞాలు గాచెను నతులగతిని,
"గణము" రాక్షస జాతిని, గణుతికెక్క
"లఘువు" గాగను గూల్చెను రాముడపుడు
"గురువు" లందరి యాశీస్సు గొనుచు వెడలి
"యతి"గ వేషము ధరియించి,యందమడవి
"లఘువు" గాగను గడిపెను,రామవిభుడు
"గణము" లైనట్టి దైత్యుల ఘనము నణచె
స్వరువుఁగాచెను నడువనా గురువుతోటి!
రిప్లయితొలగించండిహరుని విల్లొంచి లఘువుగా తరుణి బట్టె!
వానర గణము గూడంగ వార్ధి గట్టె!
యతియె రాముడై రావణు నంతు జూచె!
( యతి = విష్ణువు )
అలఘు యతి గణము గురువు లెల్ల బొగడ
రిప్లయితొలగించండిరాము డెత్తె శివధనుస్సు రమణి సీత
సంతసముతోడ సభలోని జనుల కనగ
వేసె వరమాల కురిసెను విరుల వాన
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఉత్సాహ:వినయ నియతి బవనసుతుడు
విమల పదము లంటగా
యినకులంపు గురువు ననుజు
లెల్ల దివ్య గణములున్
జనకతనయ సరసనుండ
జరిగె రామ పట్ట మ౦
తనలఘువు మంగళ ప్రద౦బు గా నయోధ్యలో
యతిగణమందరుండగనెయజ్ఞముజేసెనుకౌసికుండు,స
రిప్లయితొలగించండిమ్మతమునసాగగాగణముమానవతత్వమునిల్పుటాయె|తా
హితమునుబంచుగాగురువు|హీనతమాన్పెడిలక్ష్యసిద్ధియే
బ్రతుకన?రాముడాలఘువుబాధ్యతజేకొనికీర్తినొందేగా
2యతిగణముంచగయజ్ఞము
సతి,పతిగురువులునుగలసిసాగించునదే
మతిమంతులలఘువుననుచు
సతతమురఘురాముడనెను|సర్వులకొరకే|
శంకరయ్య గారికి టీ కప్పులో తుఫాను
రిప్లయితొలగించండిమరచి పోదాము
గురువు పనుపున యతి కౌశికుని సవనము
గావు పెట్టిన రాక్షస గణము నెల్ల
లఘువుగా నేల గూల్చిరి రాజ సుతులు
రామలక్ష్మణు లస్త్ర శస్త్ర ములనేసి
శివునిధనువునులఘువును శీఘ్రమెత్తి
రిప్లయితొలగించండిగురువునాజ్ఞచెరాముడుపరువునిలిపె
యతియె-రాముడుగమనించ?గతముజూడ
బంధుగణమునసేతసంబంధుడాయె|
గురువు వెనువెంట తరలెను కూర్మితోడ
రిప్లయితొలగించండిరాక్షసగణము గూల్చగ రాఘవుండు
నియతి దప్పని సౌమిత్రి నీడవోలె
లఘువు గాజనె నగ్ర్యుడు రాము వెంట!!!
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విల్లొంచి’ అనడం గ్రమ్యం. ‘వండడం’ ఉంది కాని ‘ఒంచడం’ లేదు... కనుక ‘విల్వంచి’ అనండి.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
దత్తపదాల నన్నిటినీ మొదటిపాదంలోనే ఇమిడ్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
ఉత్సాహంగా మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదం ప్రారంభంలో ఒక లఘువు తక్కువయింది. ‘పట్ట మం| త నలఘువుగ మంగళ...’ అనండి.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిస్వరువుఁగాచెను నడువనా గురువుతోటి!
హరుని విల్వంచి లఘువుగా తరుణి బట్టె!
వానర గణము గూడంగ వార్ధి గట్టె!
యతియె రాముడై రావణు నంతు జూచె!
( యతి = విష్ణువు )