2, డిసెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 753

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ఎన్నో పుస్తకములచట
    యన్నవి గ్రంధాలయంబునందున చదువన్
    పిన్నలు పెద్దల కెపుడును
    వెన్నంటి నిలుచు జ్ఞానవిత్తము కలుగున్

    రిప్లయితొలగించండి
  2. గ్రంధము లుండిన చోటును
    గ్రంధాలయ మండ్రు బుధులు గావ్యా ! వింటే ?
    గ్రంధాలయము నకుం మఱి
    గ్రంధాదులు జదువ వెళ్ళు కామము గలుగన్
    ( కామము =కోరిక )

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అచట| నున్నవి’ అనండి. నాల్గవపాదంలో గణదోషం. ‘వెన్నంటి నిలుచును జ్ఞాన...’ అంటే సరి!
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘గంధాలయమునకున్ మఱి’ అనండి. ‘కామము గలుగన్’ కంటె ‘జ్ఞానము పెరుగున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. పొత్తమన్నను సంతసమ్మదె పోయి చూడగఁదల్తు, నా
    చిత్తమెల్ల నెదోవిధమ్ముగ చిందువేయగ నెంచు, నే
    మత్తకోకిలనై పదమ్ముల మాలలల్లగ తోచు, మా
    సొత్తులయ్యవి మానవాళికి శుద్ధ జ్ఞానము నియ్యగా.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. కొట్టు యజమాని కూటికై కొంపకేగ
    సలుపు చుండిరి కాపలా షాపు వద్ద
    ముద్దు బిడ్డలు చదువుచూ పుస్తకముల
    విద్య కున్నట్టి విలువను విశ్వసించి

    రిప్లయితొలగించండి
  7. పుస్తక భాండాగారము
    మస్తక పెన్నిధి యటంచు మాన్యులనఁగ నా
    సక్తులు తగ్గె జనపు టం
    తస్తులు బెరిగి'వలఁ'జిక్కి తంటాలు పడన్!

    రిప్లయితొలగించండి
  8. మంచి పుస్తకములు చదువ మనసు హాయి నొందుగా
    పంచి యిచ్చు చెలిమి నవియె పాఠకులకు ఫ్రెండుగా
    పెంచు నంట తెలివి మనకు పేర్మి తోడ మెండుగా
    నించుకైన సమయమున్న యెంచి చదువు పొత్తముల్!!!

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి