26, డిసెంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1569 (చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్.

37 కామెంట్‌లు:

 1. తన్నులు తినకనె పెరుగుట
  కన్నను శిక్ష విషమంత కఠినమెయైనన్
  వన్నియ నొందుట కొరకై
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 2. కన్నయ్యను వెంబడించి
  వెన్నను తినినంత హాయి వేరేది ఘనంబౌ
  వెన్నుని గాంచక తలచిరి
  చిన్నారులు హాలహలము సేవింప దగున్

  రిప్లయితొలగించండి
 3. ఎన్నడు ద్రాగగ రాదిల
  చిన్నారులు హాలాహలము, సేవింప దగున్
  సన్నని చక్కె ర గలిపిన
  జొన్నలతో జేయుజావ సుఖముగ నుండున్

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది.అభినందనలు.
  మొదటి రెండు పాదాలలో గణదోషం. ‘కన్నయ్య ననుసరించియు| వెన్నను తినినంత హాయి పెఱయది ఘనమా’ అనండి.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మన్ను తిను వార లెవ్వరు?
  మిన్నేరు పతి ప్రజఁ గావ మ్రింగిన దేదో?
  వెన్నుని సన్నుతి తోడను
  చిన్నారులు హాలాహలము సేవింపదగున్

  రిప్లయితొలగించండి
 6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. అన్నా|కల్తీపాలే
  చిన్నారులహాలహలము-సేవింపదగున్
  చిన్నారితల్లిపాలే
  నన్నిటనారోగ్యభాగ్యనాయువునొసగున్

  రిప్లయితొలగించండి
 8. కె. ఈశ్వరప్ప గారూ,
  హాలహలము వంటి కల్తీపాలపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. విన్నావ , ఎదుగుట కొరకె
  తన్నులు తినుచున్ , పొరలిన తప్పులు దిద్దన్
  అన్నా , విష మయిన యెడల
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్.

  డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

  రిప్లయితొలగించండి
 10. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. భిన్నంగా ఎదిగేందుకు
  వన్నెల వాకిట వినూత్న బాటల కొరకై
  పున్నెం పాపం వెతకక
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 12. నాన్నా అమ్మయు గురువులు
  చెన్నుగ సద్బుద్ధి గరపు చేతలు శిక్షల్
  పన్నుగ " విషమని " దలచిన
  చిన్నారులు " హాలహలము " సేవింపఁ దగున్.

  రిప్లయితొలగించండి
 13. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  కాకుంటే వ్యావహారిక పదాలు ఎక్కువయ్యాయి. ‘వినూత్న బాటలు’ దుష్టసమాసం. మీ పద్యానికి నా సవరణ....
  భిన్నముగా నెదుగుటకై
  వన్నెల వాకిట వినూత్నపథముల కొరకై
  పున్నెము పాపము వెదుకక
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. ఉన్నతి సాధన కొరకై
  మిన్నే హద్దుగ నిలపుచు మేధా శక్తిన్
  వెన్నల నీడలు వెతుకక
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 15. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. ఎన్నేళ్ళు-భ్రూణహత్యలె
  చిన్నారులహాలహలము|సేవింపదగున్
  అన్నిటనబలలసౌఖ్యము
  నెన్నంగాసుఖము,శాంతినెలకొల్పనగున్

  రిప్లయితొలగించండి
 17. 2ఎన్నగఈర్ష్యద్వేషము
  చిన్నారులహాలహలము|సేవింపదగున్
  మన్నించెడివగుమమతలు
  అన్నాచెల్లెళ్లుతల్లినాప్యాయతలే|
  3కొన్నేళ్ళమందుగైకొన?
  చిన్నారులహాలహలము|సేవింపదగున్
  ఎన్నికజేయగవైద్యుడు
  సన్నిహితులుదెలుపుటందుసమయునురోగాల్

  రిప్లయితొలగించండి
 18. 4చిన్నారులపెళ్లిల్లే
  చిన్నారులహాలహలము|సేవింపదగున్
  మన్ననమహిమాన్వితమౌ
  చిన్నారులవిద్యనొకటెసిరిసంపదలౌ}

  రిప్లయితొలగించండి

 19. 1.చెన్నుగ కడలి తరచ ను
  త్పన్నమయిన విషము శివుడు త్రాగిన రీతిన్
  ఉన్నతి పొందగ బ్రతుకున
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్
  2.ఎన్నగ పురుషాధిక్యత
  యున్న ఈజగమ్ములోన యువిదలమాన
  మ్మెన్నరు మన్ని౦చరు యిక
  చిన్నారులు హాలహలము సేవింప దగున్

  రిప్లయితొలగించండి
 20. అన్నము లేదని యెంచుచు
  చెన్నుగ సలిలంబు కొరకు చెరువుల జేరన్
  విన్నము విషమది నిండగ
  చిన్నారులు హాలహలము సేవింప c దగున్
  చెన్నుగ రసాయ నంబులు
  వెన్నులు మోకాళ్ళు వంచి విషమును జిమ్మన్
  మిన్నక మన అన్నార్తుల
  చిన్నారులు హాలహలము సేవింప c దగున్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 21. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ

  పన్ననగునె పతితో-పే
  చిన్ నారులు? హాలహలము సేవింపంగన్
  గ్రన్నన జీవిత జలధిని;
  మిన్నగ సౌఖ్యామృతమ్ము మిగులు తదుపరిన్

  రిప్లయితొలగించండి
 22. చిన్నారులైన వయసున
  పన్నుగ కష్టాలు వడిన బడయరె సౌఖ్యం
  బన్నుగ పెద్దౌ వయసున
  చిన్నారులు హాలహలము సేవింపదగున్

  చిన్నారులు చేదు ననువు
  పన్నుగ సేవింపగాను పాయును క్రిములే
  యెన్నగ నారోగ్యమలము
  చిన్నారులు హాలహలము సేవింపదగున్

  ఎన్నగ విద్యలు నేర్వగ
  నెన్నో కష్టాలు పడిన,నేర్పడు సుఖమే
  వన్నెగ నేర్వగ విద్యలు
  చిన్నారులు హాలహలము సేవింపదగున్

  రిప్లయితొలగించండి
 23. అన్నియు విషమయమే!తల
  తన్నెడు రీతిగశరీర తత్వము పెరుగన్
  చిన్ని పరిమా ణమునన్
  చిన్నారులు హాలహలము సేవింపదగున్!

  రిప్లయితొలగించండి
 24. కె.ఈశ్వరప్ప గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  చక్కని విరుపుతో పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. కన్నా అన్నము తినమని
  గిన్నెల నేతన్నముతిని గెంతువయసులో
  ఎన్నో వ్యాధుల నాపగ
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 26. పిరాట్ల ప్రసాద్ గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నేతి + అన్నము’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. కనుక ‘పరమాన్నము తిని...’ అందామా?
  అన్నట్టు.. పిరాట్ల వేంకటేశ్వర రావు గారు మీకు బంధువా? వారు ‘జాగృతి’ పత్రికకు పనిచేశారు. ఎప్పుడో నా చిన్నప్పుడు బందర్ ఆరెస్సెస్ క్యాంపులో వారిని కలిసాను (ఆ క్యాంపులో మాతో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు)

  రిప్లయితొలగించండి
 27. కంది శంకరయ్య గారు మీరు అడిగిన దరిమిలా పద్యాన్ని కొంచెం మర్చి post చేయుచున్నాను దయచేసి చూడగలరు .

  కం. కన్నా అన్నము తినమన
  గిన్నెల పరమాన్నముతిను క్రీడా ప్రాయం
  ఎన్నో వ్యాధుల నాపగ
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 28. మీరు మీ బ్లాగు లో నాకింత చోటు ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడను . ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 29. కం. ఉన్నా రుబుడుతలెందరొ
  మన్నన చెడిపాలుపోక మార్గము లేకన్
  అన్నా ర్తులుతీరునెపము
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్.-2

  రిప్లయితొలగించండి
 30. కం. చిన్నయు పెద్దయు చూడక
  సన్నాసులుతాలిబాను సంరంభములో
  ఖిన్నత వీడని దేశపు
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్.-3

  రిప్లయితొలగించండి
 31. కం. పెన్నుతొ డాక్టరు మందులు
  చిన్నటి చీటీ నరాయచివుకనెమదిలో
  నున్నని గొంతుకు ఛేదులు
  చిన్నారులు హాలహలము సేవింపఁదగున్ - 4

  రిప్లయితొలగించండి
 32. ఎన్నో వ్హాట్సపు మూకల
  నెన్నెన్నో ఫేసుబుక్కు నెందరి తోడ
  న్నెన్నో గంటలు గడపెడు
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్ 😊

  రిప్లయితొలగించండి


 33. అన్నా! యేమంటిరి ! ఓ
  రన్నా ! యిట్లా పలుకుట రవ్వంతయు గా
  దన్నా సరి! అనవలదే
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 34. అన్నార్తులయా కవివర
  చిన్నారులు! హాలహలము సేవింపఁ దగున్
  మిన్నాగున్నాభరణము
  గన్నార్త జనుల విభుండు కామారిగదా!

  రిప్లయితొలగించండి
 35. కన్నా! ఆముదమిది నీ
  కెన్నో రోగములు తీర్చు కీటక విషమే!
  పన్నుగ స్వస్థత కూర్చగ
  చిన్నారులు హాలహలము సేవింపఁ దగున్

  రిప్లయితొలగించండి