జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ మధ్యాక్కర రార కృష్ణా నీవె కాక రక్షించున దెవరు మమ్ము పోర(దొండపుస్వామితండ్రి పోవు దూరమ్ముగ; నట్టి బీరములు గల నా సుతులు విపిన మేగవలసి వచ్చె వారు బెండ గిలక నుండ వలయుననుచు కోరె కుంతి
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది.అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బీరమే క్రీడి నైజము! వైరి తతులు
రిప్లయితొలగించండిబెండనదగు వాని యెదుట! బెదరిపోవు!
కాక రగిలిన కురునాధ! కావగలరె?
నా పలుకు విను! లేదొండనదగు విథము
లేదు + ఒండు + అనదగు = లేదొండనదగు
బీరము గలయా యర్జును వీర్య మందు
రిప్లయితొలగించండిబెండ యగునట్టి గౌరవ వీరు లతని
కాక రగులుట కతనాన గాలి పోయి
రచట లేదొండ నదగు మా టప్పు డునిక
ధృతరాష్టృనితో పొరుగువారి మాటలు
రిప్లయితొలగించండి"బీర"ములుపల్కి న్యాయంబు పేరు పోవ
నిండు సభలోన నీదు బా"బెండ"గట్టె
దమ్మమున"కాకర"మనుట వమ్ము నేడు
చేయరా"దొండ"తనికింత సాయమెపుడు
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బీరములఁ బల్కితివిపుడు బేలవైతి
రిప్లయితొలగించండిరణము బెండకజ్జురమట్లు రాజపుత్ర,
నాకు; కాకరపుల వైరి నాకు లొంగు
నన్నుఁ దొండపుదేవుని నమ్ముమోయి.
రణభూమిలో బెదరిన విరాటరాజపుత్రునితో అర్జునుని పలుకులు
బెండకజ్జురము =బెండఖర్జూరము (ఎండు ఖర్జూరాన్ని బెండఖర్జూరమని మా ప్రాంతంలో అంటారు.)
కాకరపులు= కారుకూతలు
తొండపుదేవుడు =వినాయకుడు
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండికాక.రగిలించుమర్జునాకర్ణుచెంత
బీరగాడనిజంకకుభీతివలదు
దొండనాతడుకృష్ణునినండనుండ
బెండగునుయుద్ధమందునకండలున్న
విరటు నుత్తర గోగణం"బెండ"దోచ
రిప్లయితొలగించండి"బీర"ములకు నుత్తరుండును,బెక్కు బలికె
శూర వరుల"కాకర"మౌట చోద్య మంది
కరులు "దొండ"ము లెత్తంగ కందు వడియె
వీరులందరి పద్మాన "బీర"మడచి
సేనచీ"కాకర"యగను చేసి,పార్ధు
సుతుడు,నం"దొండ"యియును తా,సోలె తుదకు
వంచనకును "బెండ"యె గాదె వాని శక్తి
"బీర"మెంతయు జూపియు విజయు డయ్యె
కౌరవులల "బెండ"గుచును కనగ మూర్ఛ
కరుల కశ్వాల"కాకర"కదన మందు
కదలి తన"దొండ"యిన పేడి వదనము విడి
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిమధ్యాక్కర
రార కృష్ణా నీవె కాక
రక్షించున దెవరు మమ్ము
పోర(దొండపుస్వామితండ్రి
పోవు దూరమ్ముగ; నట్టి
బీరములు గల నా సుతులు
విపిన మేగవలసి వచ్చె
వారు బెండ గిలక నుండ
వలయుననుచు కోరె కుంతి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
"కౌరవసేన జూచి వడకన్ దొడగెన్ మది "
అంటున్న ఉత్తరకుమారునితో బృహన్నల :
01)
________________________________
బీరమాడిన యువరాజ ♦ కౌరవులను
చూచి బెండగిల పడుట ♦ శుభము గాదు !
కాకరపులు మానుము, లెమ్ము, ♦ కత్తి దూసి
దొండముక్కువడ ముఖము ♦ దొమ్మి సలుపు !
________________________________
బీరమాడు = శౌర్యోక్తులు పలుకు
బెండగిలపడు = నిశ్శక్తుఁడగు
కాకరపులు = వ్యర్థ ప్రలాపములు
దొండముక్కువడు = ఎఱ్ఱనగు
పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిమెండుగ నస్త్ర శస్త్రములు మేలగు కౌశలమున్ పరాక్రమ౦
దొండగు వారు లేరు సరినూగగ,నీకిది భావ్యమౌన నీ
బెండగు రీతి పల్క నని,వీరులకాకరమైన సేన, పా
ర్ధుండని సేయ నంచననగ దూరెను కృష్ణుడు బీరమిచ్చుచున్
2.కొండెగ బీరముల్ పలికి కూరిమి సేయుచు నీదు చెంత న౦
దొండనలేక వల్లెయని ధూర్తత,కాక,రగిల్చి పాండవుల్
బెండగు నట్లు యుద్ధమున వీరత జూపెద నంచు పల్కు క
ర్ణు౦డిక లేడు.రమ్మనెను త్రోపుకు ధర్మజు డా సుయోధనున్
బెండగిల్లుము ఫల్గును నండ తోడ
రిప్లయితొలగించండిబీరమును జూపి గంధర్వ పీచ మడచి
వలవదొండగు పల్కులు వాయు పుత్ర
కా! కరము వేగ విడిపించు కౌరవులను
బెండ గిల్లు: ప్రయాణ మగు
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్తరుని బీరములు గని చిత్తమందు
రిప్లయితొలగించండిధర్మజుడె కాక రణశూర ధనులు కూడ
చిత్రమును జెంది బెండయి చెప్పిరిటుల
నీవె జోదొండవని లేడు నిక్కముగను
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండికాకరవత్తిలావెలిగెకామితమందునకీచకుండు-తా
షోకునవచ్చిద్రోపతిని-సుందరినేనొకబీరగాడినే
నీకిటరక్షగూర్చెదను-నిత్యముబెండగు*లేకయున్నమా
వాకిటనుండజాలవిటవైరపుదొండకునండనుండునా
భీముడు దుశ్శాసనునితో..
రిప్లయితొలగించండిఎందుకాకరములు సభ నీడ్చె సతిని
నిన్ను దొండ మాదిరి చంపి నేను రేపు
భండనమ్మునను హృదయం బెండగడుదు
బీరములివియని తలపకు బీరు బోవు.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్తరునితో బృహన్నల...
రిప్లయితొలగించండిబీరములుబల్కియిప్పుడు
భీరువువలె బెండగిలుట వీరరసమ్మా
పోరుము కాకరపులువిడి
పారక్యుల దొండముక్కువడ గొను జయమున్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరు గారూ ! నమస్కారములు..చిన్న దోష సవరణతో...
రిప్లయితొలగించండిభీముడు దుశ్శాసనునితో..
ఎందుకాకరములు సభ నీడ్చె సతిని
నిన్ను దొండ మాదిరి చంపి నేను రేపు
భండనమ్మునను హృదయం బెండగడుదు
బీరములివని తలపకు బీరు బోవు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది.అభినందనలు.
కౌరవ సేనలజూచిన ఉత్తరుని అంతరంగం:
రిప్లయితొలగించండిబీరము లాడి రణమ్మున
కౌరవ సేనల గనంగ కాకరపుల నే
నేరక బల్కితి, బెండగ
దూరగ నపజయమ దొండక విడునే!