15, డిసెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 766

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. పల్లెలనానాడాడిన
    బిల్లంగోడాట నేడు వెదకిన గనమే
    యుల్లాసంబుగనాడెడి
    పిల్లలతో నిండినట్టి వీధుల గనమే

    రిప్లయితొలగించండి
  2. చిత్రము నందున జూడగ
    చిత్రమయది యప్పడాలు సేసె డి కర్రే
    చిత్రము మఱి యును గనబడె
    చిత్రము నట రోలు బండ చేరువ గాగన్

    రిప్లయితొలగించండి
  3. చిన్న దనమున నాడి తి మెన్నొ యాట
    లందు లోనన నొకటియీ యాట తేజ !
    గోటి యందున బిళ్ళను గోడు నునిచి
    గూటు దురు కఱ్ఱ తో శక్తి కొలది వారు

    రిప్లయితొలగించండి
  4. బిళ్ళా కర్రా అన్నా
    గిల్లీ డండ యనియన్న కెవ్వున కేకే
    గల్లీపోరల కిదియే
    పైల్లా పచ్చీసులాట పరుగులు పెడుచున్

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులయినకందిశంకరయ్యగురువుగారికివందనం
    ఆటలకివిననుబంధము
    నాటినదీనాడులేకనాగరికంబున్
    చాటగ-చిల్లాకట్టెలు
    చాటాయెగ-కిర్కేటోచ్చిజనులెంచకనే

    రిప్లయితొలగించండి
  6. బిళ్ళంగోడనియందురు
    కళ్ళెములేకుండ నాడు కనగా పల్లెన్
    త్రుళ్ళుచు పిల్లలు, నేడో ?
    కళ్ళకు క్రిక్కెట్టు దప్ప కంబడదయ్యో !


    రిప్లయితొలగించండి
  7. ఆటలనాడుచు దేహపు
    పాటవమునుఁ బెంపుసేయ బంతులు కఱ్ఱల్
    నేటి సమాజమునందున
    నేటికటంచును పలుకుదురెల్లరునకటా!

    రిప్లయితొలగించండి
  8. సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి వెళ్తున్న కారణంగా నేనీరోజు బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి కవిమిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    చక్రికి నేను బాబాయిని అవుతాను. చక్రి తల్లి మా ఆవిడకు అక్కయ్య (పెద్దమ్మ కూతురు).

    రిప్లయితొలగించండి

  9. కళ్ళు పోవునంచు కసరినఁ కొట్టిన
    నాడు చుంటి మపుడు నదురు లేక
    సెలవు దినములందు నలుపు సొలుపు లేక
    కరము తుష్టి నాడు కర్ర బిళ్ళ


    రిప్లయితొలగించండి
  10. బిళ్ళా కర్రానాటను
    కళ్ళారా జూడనొకడు కడుముచ్చటతో
    చెళ్ళున తాకగ బిళ్ళయె
    కళ్లను పోగొట్టుకొనెను కలరూపుగనే!!!

    రిప్లయితొలగించండి
  11. బిళ్ళంగోడనియందురు
    కళ్ళెములేకుండ నాడు కనగా పల్లెన్
    త్రుళ్ళుచు పిల్లలు, నేడో ?
    కళ్ళకు క్రిక్కెట్టు దప్ప కనబడదయ్యో !

    రిప్లయితొలగించండి
  12. ప్రముఖ సంగీత దర్శకులు చక్రి గారి హఠాన్మరణము దిగ్బ్రాంతికి గురి చేసినది..వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొనుచున్నాను..

    రిప్లయితొలగించండి
  13. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ చక్రిగాిరి ఆత్మకు శాంతి చేకూర ప్రార్థన.

    బళ్ళల్లోనుదయమ్మే

    పిల్లల నందడి మొదలిడి బేజారెత్తన్

    సల్లాడము బిగియించుచు

    బిళ్ళంగోడాటఁ లాడు వేడుక కరువే!

    రిప్లయితొలగించండి


  14. sri chakri gariki asru nayanalato....

    చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
    జన్మ లేకుండ జేయను సమ్మతించి
    సకల శుభములు గలిగించు శంక రుండు
    నీదు నాత్మకు శాంతిని నించు గాక !

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా !
    చిన్న వయసులోనే చక్రి మరణం - చాలా బాధగా ఉంది !
    వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన !


    రిప్లయితొలగించండి
  16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మొదటి పద్యంలో పొరపడ్డా రెండవ పద్యంలో సరిగా గుర్తించారు. రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పైలాపచ్చీసు’ సరైన రూపం కదా!
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్చాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    వసంత కిశోర్ గారికి
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి