14, డిసెంబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1563 (విష్ణుశర్మ చెప్పె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విష్ణుశర్మ చెప్పెఁ బిచ్చికతలు.

40 కామెంట్‌లు:

  1. మంచి నీతి కధలు సంచిత మైనవి
    విష్ణు శర్మ చెప్పె, బిచ్చి కతలు
    చెప్పు దురట కధలు సెప్పుట నేర్వని
    వారు మనకు నెపుడు భామ ! వినుము

    రిప్లయితొలగించండి
  2. పంచతంత్రమందు మంచినీతికథల
    విష్ణుశర్మజెప్పె-బిచ్చికతలు
    కావు మందబుద్ధిగల శిష్యులకువిద్య
    నేర్పు సాధనముగనెంచెనతడు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పంచతంత్రము :

    01)
    __________________________________

    విష్ణుశర్మ చెప్పె - బిచ్చి కతలు కాదు
    విద్య నేర్పునట్టి - వింతకథలు
    రాజపుత్రులకును - రాజనీతిని నేర్ప
    పంచతంత్ర కథల - పలికె నతడు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  4. వింత వింత కథల - పంచతంత్రము :

    02)
    __________________________________

    విష్ణుశర్మ చెప్పె ♦ బిచ్చి కతలు కాదు !
    విజయ పథము జూప ♦ వీరులకును
    వేల వత్సరములు ♦ విబుధులు మెచ్చిన
    వింత వింత వింత ♦ వింత కథలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  5. పంచతంత్రము - మిత్రలాభము :

    03)
    __________________________________

    విష్ణుశర్మ చెప్పె - బిచ్చి కతలు కాదు !
    మార్పు తేగలట్టి - మంచికథలు !
    బుద్ధి గరప గల్గు - మూర్ఖుని కైనను
    మిత్రలాభమనెడి - మేటి కథలు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  6. పంచతంత్ర (IAST: Pañcatantra, సంస్కృతం: पञ्चतन्त्र, 'ఐదు సూత్రాలు') పద్యం మరియు గద్యాల్లో యదార్ధ భారతీయ జంతువుల కల్పితకథల సంగ్రహం. కొంతమంది విద్వాంసులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రచించినట్లు భావించే[1] యదార్ధ సంస్కృత రచనను విష్ణు శర్మ రచించాడు. అయితే, ఇది "మనం ఊహించడానికి కూడా సాధ్యం కాని జంతువుల కల్పిత కథలతో" సహా పురాతన మౌఖిక సాంప్రదాయాల ఆధారంగా రచించబడినవి.[2] ఇది "ఖచ్చితంగా భారతదేశంలో చాలా ఎక్కువగా అనువదించబడిన సాహిత్య అంశం"గా చెప్పవచ్చు[3] మరియు ఈ కథలు ప్రపంచంలో మంచి ప్రాచుర్యాన్ని పొందాయి

    కనుక ఇది పలు సంస్కృతుల్లో పలు పేర్లుతో పేరు గాంచింది. భారతదేశంలోనే, ఇది సంస్కృత తంత్రఖ్యాయికా [6] (సంస్కృతం: तन्त्राख्यायिका)తో సహా కనీసం 25 పాఠాంతరాలను కలిగి ఉంది మరియు ఇది హితోపేదశానికి ప్రేరణగా చెప్పవచ్చు. ఇది 570 CEలో బోర్జుయాచే పహ్లావీలో అనువదించబడింది. ఇది కళింగ మరియు దమంగ్‌లు వలె ఒక సైరియాక్ అనువాదానికి ఆధారంగా మారింది[7] మరియు 750 CEలో పర్షియన్ విద్వాంసుడు అబ్దుల్లా ఇబ్న్ ఆల్-ముక్వాఫాచే అరబిక్‌లోకి Kalīlah wa Dimnah వలె అనువదించబడింది[8] (అరబ్బీ: كليلة و دمنة‎). 12వ శతాబ్దం నుండి ఒక పర్షియన్ వెర్షన్ కలీలా మరియు డిమ్నా [9] (Persian: کلیله و دمنه‎) వలె పేరు పొందింది. ఇతర పేర్లల్లో Kalīleh o Demneh లేదా Anvār-e Soheylī [10] (Persian: انوار سهیلی‎, 'ది లైట్స్ ఆఫ్ కానోపుస్') లేదా ది ప్యాబ్లెస్ ఆఫ్ బిడ్పాయి [11][12] (లేదా పిల్పాయి, పలు యూరోపియన్ భాషల్లో) లేదా ది మోరాల్ ఫిలాసాపియే ఆఫ్ డోనీ (ఆంగ్లం, 1570) ఉన్నాయి.

    పంచతంత్రం అనేది ఒక అద్భుతమైన కల్పిత కథల సంకలనం. వీటిలో ఎక్కువ కథల్లో జంతువుల మూసపోత పద్ధతిని ప్రదర్శించే జంతువులు ఉంటాయి.[13] దాని స్వంత కథాంశం ప్రకారం, ఇది ముగ్గురు అవివేకులైన రాజకుమారులకు నీతి యొక్క ముఖ్య నియమాలను బోధిస్తుంది.[14] నీతి అనేది అనువదించడానికి కష్టమైనప్పటికీ, దీని అర్థం వివేకంగల ఐహికమైన ప్రవర్తన లేదా "జీవితంలో వివేకవంతమైన ప్రవర్తన".[15]

    ఒక చిన్న పరిచయం మినహా - దీనిలో మిగిలిన కథ రచయిత విష్ణు శర్మ రాకుమారులకు వివరిస్తున్నట్లు పేర్కొనబడింది - దీనిలో ఐదు భాగాలు ఉన్నాయి. ప్రతి భాగం చక్కీ కథ అని పిలిచే ఒక ప్రధాన కథను కలిగి ఉంటుంది, దీనిలో మళ్లీ ఒక పాత్ర, మరొక పాత్రతో కథ చెబుతున్నట్లు పలు కథలు "చొప్పించబడ్డాయి". తరచూ ఈ కథల్లో మరిన్ని కథలు చొప్పించబడి ఉంటాయి.[16] ఈ కథలు రష్యన్ బొమ్మలు వలె ఒకదానిలో ఒకటి ఉంటాయి, ఒక కథాంశం వేరొకదానిలో ప్రారంభమవుతుంది, కొన్నిసార్లు మూడు లేదా నాలుగు కథలు ప్రారంభమవుతాయి. ఈ కథలు కాకుండా, ఈ పాత్రలు కూడా వాటి ఉద్దేశ్యాన్ని వివరించడానికి పలు సంక్షిప్తరచనలు పేర్కొంటాయి.[17]

    http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82



    రిప్లయితొలగించండి
  7. మూర్ఖులైన రాజపుత్రులకున్ విద్యఁ
    జెప్పెద నని పల్కి చేరదీసి
    విష్ణుశర్మ చెప్పె పిచ్చికత లటంచు
    నమరశర్మ సభికు లనుకొనిరట!

    (ఆరునెలలలో విద్య నేర్పుతానని ప్రతిన చేసిన విష్ణుశర్మ మూర్ఖరాజకుమారులకు చదువు చెప్పక ఎప్పుడూ కథలు చెప్పడం గమనించిన అమరశర్మ మహారాజు సభలోని పండితుల అభిప్రాయము)

    రిప్లయితొలగించండి
  8. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    పంచతంత్ర ప్రాశస్త్యాన్ని తెలియజేసే వికివ్యాసాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. గురువులకు మిత్రులకు వందనములు !

    చదివి సరస మాడె సద్గురు డిప్పుడు
    చదువక నుడివె నొక కొదమ భ్రాంతి
    పాలసుండు పలికె వంచకత్వము మీఱ
    " విష్ణుశర్మ చెప్పెఁ బిచ్చికతలు."

    రిప్లయితొలగించండి
  10. పంచతంత్ర మొసగ ప్రాకట జ్ఞానమ్ము
    మూఢ రాజసుతులు ప్రౌఢు లైరి
    గురువు లేమి పలికె కుమతి యొక్కడు నప్డు
    " విష్ణుశర్మ చెప్పెఁ బిచ్చికతలు."

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చక్కని రెండు పూరణలతో మీ పునర్దర్శనం ఆనందాన్ని కలిగించింది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పంచ తంత్ర మందు మంచిని భోధించి
    గొప్ప నీతి కధల నొప్పుగాను
    విష్ణు శర్మ చెప్పె, బిచ్చి కతలు కావు
    మూఢు లివియె వినగ ఫ్రోఢ లాయె

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ ! ఔచిత్యమైన పూరణ చేశారు.. బాగుందండీ..

    లోతుదెలియకుండ లోకాననొక్కడు
    కథల సాగరాన గట్టునుండి
    పెదవి విరిచి జెప్పె పెడ బుద్ధి తలకెక్కి
    " విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు "

    రిప్లయితొలగించండి
  15. శ్రద్ధ తో వినుమని విష్ణు శర్మ చెప్పె
    బిచ్చికతలుకా వెల్లరు మెచ్చు కతలు
    పంచ తంత్ర కథలకవి ప్రథమ సూక్తి
    నేటి తరమెల్ల వినదగు నీతి కతలు

    రిప్లయితొలగించండి
  16. కల్ల లెరుగనట్టి పిల్లవాండ్రను జేర్చి
    విష్ణుశర్మ చెప్పెబిచ్చి కతలు
    యనుచు పల్కు వారు నాశ్చర్యపడునట్లు
    విన్నబాల లైరి మిన్నగాను

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    పంచతంత్రం నిజంగా లోతైన సముద్రమే! నీతిముత్యాలందులో కోకొల్లలు. ఒడ్డున ఉన్నవానికి ఆముత్యాలు చేజిక్కవు. చక్కని పూరణ నందించారు. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కతలు + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత ల|టంచు...’ అనండి. చివరిపాదాన్నిి ‘విన్న బాల లపుడు విజ్ఞులైరి’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  18. విజ్ఞు లైన వారి వినతి పెంచు కథల
    విష్ణు శర్మ చెప్పె, పిచ్చి కథల
    వ్రాయు చుండి రిపుడు వనితామణుల సదా
    పాడు చేయు నట్టి పథము తోడ

    రిప్లయితొలగించండి
  19. విశ్వ మందు వెలిగె విష్ణుశర్మ కథలు
    మంచి నడక నేర్పు మనుజ తతికి
    అంతరార్థ మెరుగకందురు కొందరు
    "విష్ణుశర్మ చెప్పెఁ బిచ్చికతలు."

    రిప్లయితొలగించండి
  20. A.Satyanarayana Reddy గారు మన్నించాలి.
    వనితలే పాడు కథలు వ్రాతురనుట భావ్యము కాదు.

    రిప్లయితొలగించండి
  21. విష్ణు శర్మ జెప్పె విజ్ఞాన దయక
    పిచ్చి కుదురు నట్టి వేల కథల
    నోళ్ల నాని నాని పెళ్లుబుకెనదిట్లు
    'విష్ణు శర్మ జెప్పె పిచ్చి కతల'

    రిప్లయితొలగించండి
  22. నీతికథలను కడు నేర్పగు విధముతో
    విష్ణు శర్మ చెప్పె, పిచ్చి కతలు
    గావు, పుడమి ప్రజకు కరము మేలు సలుపు
    మంచి కథలు సుమ్మ యెంచి చూడ

    రిప్లయితొలగించండి
  23. ప్రసాద్ గారు మన్నించండి - దయచేసి పూర్తిగా చదివి తమ అభి ప్రాయం తెలిజేయండి. పద్యం లోని విరుపును గమనించండి.

    “ /వనితామణుల సదా
    పాడు చేయు నట్టి పథము తోడ”
    కథలను, సీరియళ్ళను చూస్తూ కాలాన్ని వృధా చేస్తున్న మహిళలను దృష్టిలో పెట్టుకుని నాపద్యమును వ్రాశాను. మహిళలంటే నాకు అమితమైన గౌరవం ఉన్నది. తప్పని యింకా ఎవరికైనా అనిపిస్తే పద్యమును తొలగిస్తాను.

    రిప్లయితొలగించండి
  24. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విజ్ఞానదాయక’ అని అసంపూర్ణంగా ఉంది. అక్కడ ‘విజ్ఞాన మొసగెడి’ అనండి.
    ****

    రిప్లయితొలగించండి
  25. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    విష్ణు శర్మ చెప్పె విజ్ఞాన మొసగెడు
    పిచ్చి కుదురు నట్టి వేల కథల
    నోళ్ల నాని నాని పెళ్లుబుకెనదిట్లు
    ' విష్ణు శర్మ చెప్పె పిచ్చి కతల '

    రిప్లయితొలగించండి
  26. విషయం ఏదైనా స్త్రీ లనే ఎందుకు ప్రత్యేకంగా నొక్కి జెప్పాలి.

    సమాజంలో పాడుకి. కీడుకి , లింగ , జాతి, మత , రంగు రూపు బేధాలు కల్పించడం ఒప్పరానివే !

    రిప్లయితొలగించండి
  27. నాట కాల పిచ్చి నాట్యంబు ఒక పిచ్చి
    కాళి దాసు పిచ్చి "కాళి " పిచ్చి
    నీతి కథల పిచ్చి నేస్తపు పిచ్చిగా
    విష్ణు శర్మ చెప్పె C బిచ్చి కతలు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  28. పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు

    పిచ్చి గంతులిడుచు వికటముగను నవ్వి
    స్త్రీల హి౦సపెట్టు సెక్సు కథలు
    మెచ్చువారు యిటుల యుచ్చరింతురుగద
    విష్ణు శర్మ జెప్పె పిచ్చి కథలు

    మిత్రలాభమనుచు శత్రుల పూజించి
    మిత్రులందు భేద మిపుడొనర్చు
    నేత జేయు రాజ నీతి జూడ౦గను
    విష్ణు శర్మ జెప్పె పిచ్చి కథలు

    రిప్లయితొలగించండి
  29. కల్లు పాకలలో జంటలు కల్లు త్రాగుతుంటాయి. పబ్బులలో కూడా మహిళలు మద్యమును తీసుకుంటారు. ఒక త్రాగుబోతును గురించి పద్యం వ్రాయమంటే మగవారిని గురించే పద్యం వ్రాస్తారు గాని, ఆడు వారిని గురించి వ్రాయరు.
    ఎవరు ఎక్కువగ వ్యసనానికి బానిస అవుతారో వారిని గురించి వ్రాస్తారు. వివక్షతో కాదు. పరిస్థితిని బట్టి అన్వ యించుకోవాలి.
    పూర్వపు మహా కవుల స్త్రీలను అంగాంగ వర్ణన చేశారు. వాళ్ళు బూతులు వ్రాశారు అని విమర్చించే వారిని చూస్తుంటాము. కవి హృదయాములోని భావాన్ని తీసుకోవాలి. స్వస్తి.



    రిప్లయితొలగించండి
  30. పంచ తంత్రములవి పర్వెడి కధలనే
    రాజ సుతులదెల్పె రాజనీతి
    బుధులు దలప నదియె మూర్ఖంబు ననగను
    విష్ణుశర్మజెప్పె బిచ్చికతలు

    పిట్టకధలు నవియు పిల్లల,పెద్దల
    కిష్టమౌను గాన నింపు మీర
    పక్షి జంతువులను పాత్రలుగా గూర్చి
    విష్ణుశర్మ జెప్పె బిచ్చి కతలు

    పిట్ట కధలు గాను పెద్దైన నీతులన్
    పరగ జెప్పినంత బాగు నీతి
    వరలు లోకమెల్ల,బాలల కింపుగా
    విష్ణు శర్మ జెప్పె బిచ్చికతలు

    కాకి,మృగము,నెలుక,కపులాది పాత్రలన్
    కధలు చెల్లు గాదె కనగ శిశులు
    దాన నేర్తు రవని ధార్మిక నీతులన్
    విష్ణుశర్మజెప్పె బిచ్చి కతలు

    నేడు భాష పెరుగ నేర్పున చిన్నయ్య
    కధలు వ్రాసె నింపు,కాన నందు
    భాష పెరుగు నటుల బాలలు చదువగా
    విష్ణు శర్మ చెప్పె బిచ్చికతలు

    రిప్లయితొలగించండి
  31. విష్ణుశర్మ కధలు విజ్ఞాన సుధ లౌను
    బాలలంత చదివి ఫలిత మంద
    యజ్ఞులైన వారి యాంతర్య మిటులుండు
    విష్ణుశర్మ జెప్పెబిచ్చి కతలు

    కాకి,యెలుక,జింక, కమఠంబు లాదిగా
    విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు
    మనుజ సంఘమిట్లు మసలును జూడను
    కధలు గావు నవియె కావ్య సుధలు

    రిప్లయితొలగించండి
  32. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కే*ఈశ్వరప్పపంపుసమస్యాపూరణ
    పాకశాస్త్రమట్లునున్నపంచతంత్రబోధనల్
    ఆకతాయిరాజసుతులకర్థమవ్వుపద్ధతుల్
    శేకరించివిష్ణుశర్మచెప్పే*బిచ్చికథలుగా
    లోకరీతులుంచిజంతులోకమెంచిదెల్పెగా

    రిప్లయితొలగించండి
  33. 2పంచతంత్రవిషయప్రాభల్యమూహించి
    విష్ణుశర్మచెప్పే-పిచ్చికతలు
    గాదుజంతుజాలకథలువిజ్ఞతలుంచి
    రాజసుతులకపుడురాజసాన

    రిప్లయితొలగించండి
  34. విష్ణుశర్మ జూడ విజ్ఞాన ఖనియౌను
    బిచ్చికతలు యనగ నచ్చుతప్పు
    పిల్చికతలు చెప్ప పెరుగు నాసక్తియే
    పిల్ల,పెద్దలకును యుల్లమలర

    రిప్లయితొలగించండి
  35. కె.యెస్.గురుమూర్తి ఆచారిగారిపూరణ

    పంచతంత్రములను పరమోప యుక్తమై
    విష్ణు శర్మజెప్పె. పిచ్చికథలు
    కానె కావట౦చు గమని౦చి రార్యులు
    నన్ని భాషలందు ననువదించి

    రిప్లయితొలగించండి
  36. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నా సవరణ కూడా ఎందుకో సంతృప్తికరంగా లేనట్టనిపిస్తున్నది...
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    సర్వం ‘పిచ్చి’మయం చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండుపూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘మెచ్చువారు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘మెచ్చువార లిటుల నుచ్చరింతురుగద’ అనండి.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘ఫలిత మంద| నజ్ఞులైన...’ అనండి.
    మూడవ పూరణలో ‘కతలు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత లనంగ’ అనండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. సమస్యా పూరణ విశ్లేషనే పద్యమునకు కూడా పోస్టు అయ్యింది. దయచేసి గమనించండి.

    రిప్లయితొలగించండి
  38. అన్నపరెడ్డి వారూ,
    గమనించాను. దాని గురించిన చర్చలో పాల్గొనలేక (ఛందోవ్యాకరణాదుల చర్చ కాదు కనుక) కేవలం బాగుందన్నాను.

    రిప్లయితొలగించండి
  39. నేను కూడా సమర్థించుకో బోయి సవరించాను ,గురువుగారూ!

    రిప్లయితొలగించండి