13, డిసెంబర్ 2014, శనివారం

పద్యరచన - 764

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కరుణ లేదాయె యేరికి కందు నచట
    పండ బెట్టిరి సరుకులు దండి గాను
    నుండు నచ్చోట ,పాపము , నొండు చోట
    కు మఱి నీవుగా గొనిపొమ్ము కోమ లాంగి !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మిఠాయి కొట్టు :

    01)
    __________________________________

    షాపు నందున బిస్కెట్లు - చాల గలవు
    షాపు నందున కేకులు - చాల గలవు
    షాపు నందున స్వీటులు - చాల గలవు
    షాపు జూచిన ష్ఠీవన - మాపలేము !

    విష్ణువైనను భూమిపై - వెలసి నపుడు
    నలువ యైనను యిలపైన - నడచినపుడు
    శంకరుండైన భువిమీద - సంచరించ
    పిండివంటల దినకుండ - నుండ దరమె?
    __________________________________
    ష్ఠీవనము = లాలాజలము, నోటిలో ఊరెడి నీరు

    రిప్లయితొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. కళ్ళ ముందు బిడ్డ చల్లగా నిదురలో

    తిళ్ళ మధ్య మంచి తీపి కలల

    తల్లి నడుపు కొట్టు చల్లగా నడవలో

    పిల్ల లమ్ము వారి లొల్లి లేక

    రిప్లయితొలగించండి
  5. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కే*ఈశ్వరప్పపంపుసమస్యాపురాణం
    అమ్ముదురాడపిల్లను
    నమ్మకమైనట్టిసరుకునాణ్యతలాగా
    సమ్మతితోకొనరండిట
    కమ్మనిబిస్కట్లలాగకనిపించుసుమా

    రిప్లయితొలగించండి
  7. పడుచు జంట దుకాణము నడుపుచుండ
    పసితనూజ బాధ్యతఁ గాంచు వారులేక
    నిదుర బుచ్చిరచ్చోటను కుదురుగాను
    చిన కుటుంబములన్ గల చిక్కులవియె


    రిప్లయితొలగించండి
  8. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘ఆమ్మెదరె యాడపిల్లను’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మాలికనుదెచ్చి తనతో
    వీలుగ నరలోన యుంచి బిడ్డను గనుచున్
    మేలుగ సరకులు నమ్ముచు
    లాలించుచు నిదురబుచ్చె రామయె విపణిన్

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మా సంటోడు..
    ఆటైనన ,పాటైనను,
    నటికి నూటొక్కమార్లు నోటికి తినగన్
    చోటిదె! మార్చిన కునుకను
    మాటైనను రాక గోల మానడె తల్లీ!

    మాపాపడు పుట్టుమొదలుఁ
    దా పెరిగిన చోటు కాన తప్పక యిచటే
    తీపైన గాలి పీల్చుట
    నాపోశనపట్టు కతన యలవడె నిటులో?

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యాలు హాస్యస్ఫోరకంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    ‘ఆటైనను... నూటికి’ అన్నవి టైపాటుకు గురయ్యాయి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనము
    పాపపరమార్థతత్యము ప్రతిమనీషి
    పంచబూనక.లోకమేవంచనగును
    సరుకులట్లుగనమ్మగ.సాకనగున
    అమ్మకర్థంబునిలలోననంతరించు

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యాలు:
    మా సంటోడు. ..
    ఆటైనను, పాటైనను,
    నూటికి నూటొక్కమార్లు నోటికి తినగన్
    చోటిదె! మార్చిన కునుకను
    మాటైనను రాక గోల మానడె తల్లీ!

    మాపాపడు పుట్టుమొదలుఁ
    దా పెరిగిన చోటు కాన తప్పక యిచటే
    తీపైన గాలి పీల్చుట
    నాపోశనపట్టు కతన యలవడె నిటులో?

    రిప్లయితొలగించండి
  15. అచట బిడ్డను సరుకుల నరను మధ్య
    నమ్మవదలెన నెవరికో నమ్మబోగ
    నమ్మకంబున గలుగునా యమ్మకమ్ము
    కన్నప్రేమను మించు ' నా కొన్న' ప్రేమ.
    ( కన్నప్రేమను మించునా కొన్న ప్రేమ ? )

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి