8, డిసెంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1560 (అగ్నిజ్వాలలు జనులకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్.

30 కామెంట్‌లు:

  1. అగ్నులు రాపడ నేర్పడు
    న గ్నిజ్వాలలు, జనులకు హాయిని గూర్చు
    న్నగ్నియె చలి కాలంబున
    నగ్నియ మఱి కారణంబు నాహా రింపన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పాకలకు నిప్పుపెట్టి పారిపోయే వాళ్ళు దొరికితే :

    01)
    ____________________________________

    అగ్నికి పూర్తిగ నిండ్లను
    మగ్నము గావించు వారి - మదమడగించన్
    భగ్నహృదయాశ్రితపు కో
    పాగ్నిజ్వాలలు జనులకు - హాయిని గూర్చున్ !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  3. అగ్నులు పరిపరి విధములు
    ఆగ్నేయ స్నానమనగను హరునకు ప్రీతౌ
    అగ్నియె పాచకు డైనను
    అగ్ని జ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    ఆగ్నేయ స్నానము = మహా కాళేశ్వరునకు చితా భస్మముతో చేయు అభుషేకము

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. విఘ్నము గలుగక పెండిలి
    లగ్నము ఘడియలకు ముగియ లాజా హోమం
    పగ్ని వెలుగ కళకళ లా
    డగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  6. మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో ప్రాస తప్పింది. ‘భగ్నము లేకను’ అనండి. ‘హోమంపు టగ్ని’ అని టుగాగమం రావాలి. అందుకని అక్కడ ‘లాజాయుతహో| మాగ్ని వెలుగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. ధన్యవాదములు గురువు గారు. "మాగ్ని" యని దీర్ఘము రావచ్చునా?
    సవరించిన పద్యము.....

    భగ్నము లేకను పెండిలి
    లగ్నము ఘడియలకు ముగియ లాజాయుతహో
    మాగ్నివెలుగ కళకళ లా
    డగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  8. సుమలత గారూ,
    మిగిలిన పాదాల ఆద్యక్షరం గురువులు కనుక ‘మా’ అని దీర్ఘం నిరభ్యంతరంగా ప్రయోగించవచ్చు.

    రిప్లయితొలగించండి
  9. భగ్నమ్ము గాక శుభమగు
    లగ్నమున జరిగిన పెండ్లి రహి గలిగించున్
    మగ్నము నొందిన కామపు
    నగ్ని జ్వాలలు జనులకు హాయిని గూర్చున్
    రహి: ఆనందము

    రిప్లయితొలగించండి
  10. అగ్నియె సాక్షిగ జరిగిన
    లగ్న మహత్వమునెఱుగని రావణుదేహం
    బగ్నికి యాహుతి యగునెడ
    నగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  11. లగ్నము జూచుక యరణిని
    యగ్నిని రగిలించి జేయ యజ్ఞము, నా హో
    మాగ్నిని యాజ్యము నిడ నా
    యగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారు,
    గత రెండు మూడురోజులలోని కొన్ని పద్యాలు. శుభకార్యాలకు పోవడం వల్ల ఆగినవివి.

    వెలుగుల రాయని సభలో
    కలువలు శిలలై నిలువగ కలుముల పీఠం
    బులుగా విరిసిన కమలము
    లొలుకును వయ్యారములిల నోహో యనగా.


    చేమంతుల నవ్వులతో
    హేమంతపు కళలొకింత హెచ్చెను గనుడీ
    శ్రీమంతుల తోట నిటుల
    మోమంతయు నవ్వులలుమ ముచ్చట గొలిపెన్.


    పరుగున వేంచేయు నతని
    కరుణల నాశించువారి కాచెడు వానిన్
    సిరిమా తల్లికి పతియౌ
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే?

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు ఆలస్యంగా అందించిన పద్యాలను ఆయా పోస్టులలోనే సమీక్షించాను.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అగ్నియె సాక్షాత్ దైవము
    అగ్నియె ప్రాదాన్యమగును హవనము జేయన్
    అగ్నియె సాక్షి మనువులన్
    అగ్ని జ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    రిప్లయితొలగించండి
  15. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    భగ్నము గాకను ప్రేమలు
    అగ్నులసాక్షిగ పరిణయ మై మోహాబ్ధిన్
    మగ్నమ్మవ కోర్కె లనెడి
    అగ్ని జ్వాలలు జనులకు హాయిని గూర్చున్



    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. భగ్నము జేయగ బాధలు
    యగ్నిని వెలిగించి జేయు యాగాదులహో
    మాగ్నివెలయు మంగళమౌ
    నగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్!!!

    రిప్లయితొలగించండి
  19. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కె.యెస్ .గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఆగ్నేయ౦బ౦దు పవి
    త్రాగ్ని జ్వాలలు జనులకు హాయిని గూర్చున్
    లగ్నము సేయుము మనసును
    భగ్నము గావి౦ప వలదు వాస్తు విషయముల్

    రిప్లయితొలగించండి
  21. పుజ్యులయినకందిశంకరయ్యగారికివందననాలతోసమస్యాపూరణంపంపుచున్నాను
    కే*ఈశ్వరప్ప
    అగ్నిచెవంటలపంటలు
    బగ్నముగాకుండబెంచుబగవంతుడిలా
    అగ్నియెఐశ్వర్యంబట
    అగ్నిజ్వాలలుజనులకుహాయినిగూర్చున్

    రిప్లయితొలగించండి
  22. అగ్నిని రగిల్చి,ధర్మము
    భగ్నము కాగను,నిలనటు పావన హవిసుల్
    లగ్నము చేయగ లేచెడి
    అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    అగ్నియె రగులును మనమది
    లగ్నము నైనను సతిపయి,లాలిత రీతిన్
    మగ్నము నగుచును ప్రేమను
    అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    మగ్నము నౌగద చలియది
    భగ్నము చేయగ మనలను పట్టక నిదురే
    అగ్నియె చలిమంట రగుల
    అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    అగ్నియె వంటకు చక్కని
    అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్
    అగ్నియె విలయము నిడినను
    అగ్నిజ్వాలలు జనులకు నార్తిని గూర్చున్

    రిప్లయితొలగించండి
  23. భగ్నోత్సాహం బేలర!
    నగ్నంబుగ చలిపులి యిట నాట్యము చేయన్
    లగ్నంబిడు చలి మంటకు
    అగ్నిజ్వాలలు జనులకు హాయిని గూర్చున్

    రిప్లయితొలగించండి
  24. భగ్నము జేయగ యజ్ఞపు
    అగ్నిన రుధి రంపుధార లసురుల వలనన్ ,
    అగ్నిని రక్షింపగ బా
    ణాగ్ని జ్వాలలు జనులకు హాయిని c గూర్చన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  25. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అగ్నిచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘అగ్నిన్’ అనండి. తృతీయార్థంలో ద్వితీయావిభక్తిని వాడవచ్చు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘అగ్నిని’ అనండి.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. భగ్నము జేయగ యజ్ఞపు
    అగ్నిని రుధి రంపుధార లసురుల వలనన్ ,
    అగ్నిని రక్షింపగ బా
    ణాగ్ని జ్వాలలు జనులకు హాయిని c గూర్చన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  27. లగ్నము రాగా భోగికి
    భగ్నమ్మైనట్టివన్ని భగభగమను నా
    యగ్నికల మట్టలిడునవి
    యగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్

    అగ్నిక = తాటి చెట్టు

    రిప్లయితొలగించండి

  28. భగ్నంబవగన్ ప్రేమయు
    లగ్నాష్టకముల కికన్ పొలతి పని లేదే!
    మగ్నమయినట్టి బతుకున
    యగ్నిజ్వాలలు జనులకు హాయినిఁ గూర్చున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి