21, డిసెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 772

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. దంచ బడుచుండె నచ్చట దండి గాను
  రోటి యందున దెల్లగ రోకలినన
  దంచ బడుచుండు నది యేమి టంచు మఱి ని
  బోధ రాకుండె నిపుడు నా బుధ్ధి కకట !

  రిప్లయితొలగించండి
 2. రోలే మన సాధనముగ
  చాలా కాలంబు వరకు చక్కగ నిలచెన్
  కాలమహిమనిది జేరెను
  మూలకు గ్రైండర్లు మనకు ముద్దై పోయెన్

  రిప్లయితొలగించండి
 3. దంచగ పెండిలి పసుపుల
  నెంచిరి యలనాడు మమ్ము నెంతటి ఘనమౌ
  వంచన జేయుచు నేడిల
  పంచన బడవేసె నంట భారీ గ్రైండెర్

  రిప్లయితొలగించండి
 4. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వ్రరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పప్పు,కూర,రసము,పరమాన్నములులేక
  పెరుగు నీళ్ల యినను దొరక కున్న
  నుప్పు,కారములను యుల్లితో దంచిన
  రోటి పచ్చడొకటె మేటి కాదె!

  రిప్లయితొలగించండి
 6. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. రోట దంచువిధము రోసిరక్కట! చూడ
  నేటికి యరుదయ్యె, నిక్కముగను!
  జానపదులు పాడ జంకిరక్కట! నేడు
  వాటికెచట నింక చోటు లేదు!

  రిప్లయితొలగించండి
 8. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. దంపెదరు జనులాహారధాన్యములను
  తలచినంత నల్లము దంపదగును, కాని
  మేటి వ్యాపకమొకటియు మీకు లేదె?
  చేరి యూకదంపనగును చెలగి ధరను

  రిప్లయితొలగించండి
 10. ఊఁకదంపుడు (రామకృష్ణ) గారూ,
  ముద్రాలంకారంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
  రోలెశరీరమైన;పలురోకటిపోటులయీతిబాధలున్
  జాలియులేకదంచినటుధర్మపథంబులు-మానవాళికిన్
  పాలనయందుబంచ?పరిపాటిగభక్తియు,శక్తిజేరు,నీ
  జాలమెరోలు,రోకటగుజాగృతిచిత్రమునూహకుంచెగా;
  2రోలు,రోకటినొకనాడుమేలుగూర్చు
  దంపుదొడ్లచెబియ్యమున్దరికిజేర్చి
  ఆయురారోగ్యమొసగగ/మాయలాగ
  యంత్రతంత్రానరోగాలతంత్రమిపుడు


  రిప్లయితొలగించండి
 12. పచ్చడి,వడ్లుయున్పసుపుపండుగలందునపూర్ణమున్సదా
  నచ్చినరీతిరుబ్బుటకునాణ్యతచేనిడురోలు,రోకలే
  వచ్చియుతిండికండకునువంటకువార్పుకుసాయమయ్యె,మీ
  రిచ్చినచిత్రదర్శనపురీతులుమారెనుచేతగాదనిన్

  రిప్లయితొలగించండి
 13. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. రోటి లోన నూరు ఘాటు పచ్చడి తిన్న
  నమర లోకమె దిగి యవని జేరు
  లేదు దీనికి సరి లేదు విశ్వమందు
  నాంధ్ర గృహముల నిడు యమృతమిదియె

  రిప్లయితొలగించండి
 15. వినరో ! కలికాలమ్మిది
  నను రోకలినే, మరిచిరి నాతోబాటున్
  ఘన రోలును, మా గుండెలు
  గన గ్రైండరు రుబ్బినట్లు గాయములాయెన్.

  రిప్లయితొలగించండి
 16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. కె.యెస్.గురుమూర్తి ఆచార్ప్ గారి పూరణ
  దినము త్రాగుచు౦దువు నీవుతిక్కపుట్టి
  కాఫి,టీ,పాడలవాటుల మాపివైచి
  శొoఠి మిరియాలు నూరిన చూర్ణమి౦క
  పాలలో కలిపి త్రాగుము బాగుపడగ

  రిప్లయితొలగించండి
 18. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘టీ పాడలవాటుల’ అన్నచోట గణదోషం. ఆ పాదాన్ని ‘కాపి టీల పాడలవాటు మాపివైచి’ అందామా?

  రిప్లయితొలగించండి

 19. పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు
  ఎంచగ పప్పు ధాన్యములు ఏలకులన్ మిరియాలు కొబ్బరిన్
  మించిన మిక్సి వైచి నొక మీటను నొక్కిన మెత్తగా నగున్
  దంచుచు నుంద్రు మానవులు దక్కిన చొల్లు కబుర్లు సోదియున్
  కంచుగ మ్రోగు రీతి తన గారవమున్ పరనింద సేయుచున్

  రిప్లయితొలగించండి
 20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి