మల్లెల వారి పూరణలు దైవమటుల నమ్మి ధర్మమ్ము పాటించి పాండుసుతులు ధర్మ పరులు నైరి గర్వమత్సరాలు కప్పి చెడిరి గాని ధార్త రాష్ట్రు లెల్ల ధర్మ విదులు 2.ద్రోణ కృపులు కురుల బాణగురువులకు ధర్మ మెదియొ కనెడి దారి తెలిసి కుటిలధర్మ నీతి కోరిన కౌరవుల్ ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు
వసంత కిశోర్ గారూ, మీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. మంచి పూరణ. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఎల్ల + అధర్మపరులు = ఎల్ల నధర్మపరులు’ అవుతుంది కాని ‘ఎల్లధర్మపరులు’ కాదని గమనించ మనవి. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరి పాదాన్ని ‘వాసుదేవు డండ పాండవులకు’ అంటే అన్వయం కుదురుతుంది. **** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు విన్నపం... జనవరి మొదటి వారంలో నేను, మా ఆవిడ సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల యాత్ర చేయాలనుకుంటున్నాము. ఈ యాత్రలో చూడదగిన క్షేత్రా లేమేమి ఉన్నాయో, ప్రయాణానికి ఎలా ప్రణాళిక చేసుకోవాలో సలహా ఇవ్వవలసిందిగా మనవి.
తఱచి చూడ నార్య ! ధర్మ దూ రులుగద
రిప్లయితొలగించండిధార్త రాష్ట్రు లెల్ల ,ధర్మ విదులు
పాం డవులిల మఱియు బలపరాక్రమములు
గలుగు వారు సుమ్ము కాద నృతము
యుద్ధ రంగమందు నుక్కిరి మిగలక
రిప్లయితొలగించండిధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు
పాండు సుతుల జేత - పాడు పనులజేత
యంతమొంది పోయెనంత మంది
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పోయి రంతమంది’ అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
"పరిత్రాణాయ సాధూనాం - వినాశాయచ దుష్కృతాం " - అని గదా - భగవానువాచ
మరలాంటప్పుడు - భగవంతుని పనికి - దోహద పడినవారు - ధర్మ విదులు కారా :
__________________________________________________
ధరణి బరువు పెరుగ - తగ్గించగాబూని
ధరణి కృష్ణు రూపు - ధర్మి పుట్ట
నచ్యుతునకు సాయ - మందించ బూనిన
ధార్తరాష్ట్రులెల్ల ♦ ధర్మ విదులు !
__________________________________________________
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిధర్మ మెరిగి నంత ధర్మవిదులనగ
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విదులు
ధర్మబద్దు డగుచు ధర్మమాచరించు
ధర్మజుండె యగును ధర్మపరుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధర్మ పధము వీడి దర్పమ్ము జేతను
రిప్లయితొలగించండిధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విధులు
పాండు రాజు సుతుల బలిమికి తాళక
మట్టి గలిసిపోయె తుట్ట తుదకు
కృష్ణుడండ నుండ గెలవగ లేమని
రిప్లయితొలగించండియుద్ధ భూమి వీడె డూహ మరచి
పోరు సల్పి వారు పొందనా స్వర్గమ్ము
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మ విదులు!
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండిదైవమటుల నమ్మి ధర్మమ్ము పాటించి
పాండుసుతులు ధర్మ పరులు నైరి
గర్వమత్సరాలు కప్పి చెడిరి గాని
ధార్త రాష్ట్రు లెల్ల ధర్మ విదులు
2.ద్రోణ కృపులు కురుల బాణగురువులకు
ధర్మ మెదియొ కనెడి దారి తెలిసి
కుటిలధర్మ నీతి కోరిన కౌరవుల్
ధార్తరాష్ట్రు లెల్ల ధర్మవిదులు
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఎల్ల,ప్లస్ అధర్మ ఎల్లధర్మయనుచు
నీ సమస్య లోన నిమిడె సంధి
పూరణ మును సేయ బూనగ నేటికి?
ధార్తరాష్ట్రు లెల్లధర్మ విదులు
ధాత్రి బుట్టినట్టి దనుజులే నిజముగా
రిప్లయితొలగించండిధార్త రాష్ట్రులెల్ల, ధర్మవిధులు
ధరణిలోన నాడు దైవాంశ బుట్టిన
పక్కి వాహనుం డు పాండ వులను
ధార్తరాష్టు లెల్ల ధర్మ విదులు కారు
రిప్లయితొలగించండికాన మడసిరంత కదనమందు
పండు సుతులు ధర్మ పరులౌటచే జయం
బొందినారు యుద్ధ మందు కనగ.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలోని ‘లాజిక్కు’ బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఎల్ల + అధర్మపరులు = ఎల్ల నధర్మపరులు’ అవుతుంది కాని ‘ఎల్లధర్మపరులు’ కాదని గమనించ మనవి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదాన్ని ‘వాసుదేవు డండ పాండవులకు’ అంటే అన్వయం కుదురుతుంది.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు విన్నపం...
రిప్లయితొలగించండిజనవరి మొదటి వారంలో నేను, మా ఆవిడ సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల యాత్ర చేయాలనుకుంటున్నాము. ఈ యాత్రలో చూడదగిన క్షేత్రా లేమేమి ఉన్నాయో, ప్రయాణానికి ఎలా ప్రణాళిక చేసుకోవాలో సలహా ఇవ్వవలసిందిగా మనవి.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండిపాండుసుతులచెంతపరమాత్మతత్వాలు
దార్తరాష్ట్రులెల్లధర్మవిదులు
ధర్మదూరులయిరికర్మచెకౌరవుల్
మర్మమెరిగినిలిచెధర్మరాజు
విదులు;త్యజించు
2లెస్సమాటదార్తరాష్ట్రులెల్లధర్మవిదులచే
నిస్సహాయులయిరివినగనిందలందిరెంచగా
బుస్సుమనెడిపాములన్నిబుసలుగొట్టచంపరా
పుస్సివంటిధర్మరాజుపుష్టినింపెనీతికిన్
పుస్సి-పవిత్రమయిన
3దార్తరాష్ట్రులెల్ల-ధర్మవిదులుజూసి
రిప్లయితొలగించండివిధురుడడ్డుబడగవినుటమాని
శకునిమాటచేతశకునములేమారె
మంచిమాటలందెవంచనంబు
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘విదులు’ తెలుగు పదంగా ధర్మ పదంతో సమాసం చేయరాదు కదా.
కెయెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
రిప్లయితొలగించండిశకుని మాటలెల్ల సరియైన వని నమ్మి
మత్సర౦పు ధూళి మదిని గప్ప
కాపథమున చనిరి కాని యరయగను
దార్తరాష్ట్రులెల్లధర్మవిదులు
కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరుణ లేకుండ బాలల కాల్చిచంపి
రిప్లయితొలగించండితీవ్రవాదపు ముసుగులో తిరుగు నేటి
దానవులకన్న యానాటి ధార్తరాష్ట్రు
లెల్ల ధర్మవిదులనుచునెన్నవచ్చు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిన్ననాటినుంచి చెడు చేష్టలను జేసి
రిప్లయితొలగించండిపాండుసుతులచేత భంగపడిరి
ధర్మమెరుగనట్టి కర్మఫలము చేత
దార్తరాష్ట్రృలెల్ల ధర్మవిదులు!