సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, రుద్రవీణ ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు. **** జిగురు సత్యనారాయణ గారూ. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి’ భావాన్ని అచ్చంగా చిత్రీకరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ శు మ్రోల బడిన నింతిని ధీటుగా
రిప్లయితొలగించండినంది చూచు చుండ నంది వాహ
నుడట వీణ జేత ను ధరి యిం చిగరుణ
జూపె నామె పైన జూడ్కి తోడ
మురిపించుచు ముచ్చటగా
రిప్లయితొలగించండిపరమేశుడు రుద్రవీణవాయించంగన్
పరవశముగ మక్కువతో
పరమేశ్వరివినుచునుండె పడుకొనియచటన్
పశుపతి గళమున పశువు పరవసించె
రిప్లయితొలగించండిపన్నగధరు పాటకు పాము పరవసించె
శిశువు తానై పరవసించె శిఖరి తనయ
నాద దేహుని సంగీత నాదమందు!!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రుద్రవీణ ప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
జిగురు సత్యనారాయణ గారూ.
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి’ భావాన్ని అచ్చంగా చిత్రీకరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రమథ గణముసాదరముగ పాద దరిని
రిప్లయితొలగించండిరుద్ర వీణియ పలికించె రౌద్ర గీతి
భక్తి మనము నిలచి యున్న భయము లేల
పరమ శివునిమార్గ మ్ములతి భక్తి మయము
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మార్గమ్ము లతి’ అన్నచోట గణదోషం. ‘మార్గము లతి’ అంటే సరి!
గురువర్యా ధన్యవాదములు
రిప్లయితొలగించండి" ము" ని ప, ఫ , బ,భ లకు యతి యోప్పునా ?
ప్రమథ గణముసాదరముగ పాద దరిని
రుద్ర వీణియ పలికించె రౌద్ర గీతి
భక్తి మనము నిలచి యున్న భయము లేల
పరమ శివునిమార్గములతి ముక్తి మయము ..... అన వచ్చునా. దయ చేసి తెలుప గలరు.
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండికేవలం పు,ఫు,బు,భులకు మువర్ణంతో యతి చెల్లుతుంది.
రుద్రుని వీణా నాదము!
రిప్లయితొలగించండిరుద్రాణిని పాపఁ జేయ లుఠనమ్మాడెన్!
భద్రము పరవశ మందెను!
కద్రూజము నాడి జూపె కైలాసకిముల్!
(భద్రము=నంది, కద్రూజము=ఫణి, కైలాసకి=నాట్యవిశేషము)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రుచిరముగను హరుడు రుద్రవీణను మీట
రిప్లయితొలగించండిపరవశించు చుండె పరమ సాధ్వి
నలువు తోడను ఫణి నాట్యమ్ము సలిపెను
భద్ర మపుడు గాంచె భాసురముగ
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండికే*ఈశ్వరప్ప
పలుకగవీణానాదము
కలికియునాట్యంబుజేసికలతగబడగా
పలుకనినందీశ్వరులున్
తిలకించిరిచిత్రసేమదీక్షగనచటన్
2పలుకబోకశివుడుపలికించెవీణతో
రిప్లయితొలగించండినాట్యమాడలేకనలిగెపడతి
నందిచూపులపుడుకందుచుగనిపించె
చిత్రమైనదోవిచిత్రమేగ
భవుడు కైలాస గిరిపైన భవ్యమైన
రిప్లయితొలగించండిపాట మగ్నుడై వీణతో పాడుచుండ
పరవశంబున పార్వతి పరమ శివుని
యెదుట పడుకొని వినుచుండె గుదురగాను
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి
రిప్లయితొలగించండివందనములు
శివుడు రుద్రవీణ సవరించి పాడగా
నటన మాడి సోలి నచ్చెరువున
శైలజాత యతని చరణ సీమను నంది
ప్రమథ గణము సంతసమున గాంచ
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండినా సవరణ కూడా ఎందుకో సంతృప్తికరంగా లేనట్టనిపిస్తున్నది...
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
సర్వం ‘పిచ్చి’మయం చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండుపూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మెచ్చువారు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘మెచ్చువార లిటుల నుచ్చరింతురుగద’ అనండి.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
రెండుచింతల రామకృష్ణ మూర్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘ఫలిత మంద| నజ్ఞులైన...’ అనండి.
మూడవ పూరణలో ‘కతలు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత లనంగ’ అనండి.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాదనిలయుడా రుద్రుడు
రిప్లయితొలగించండిమోదముతో వీణమీట పురలయె మురిసెన్
సీదరము తన్వయ మవగ
నాదంబును వినుచు నంది నతులర్పించెన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.