మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ సవరణ బాగుంది.సంతోషం!
యెదను కదలించు కవనము మదిని పొదిగి
రిప్లయితొలగించుగబ్బి లమ్మును రచియించి గణన కెక్కె
చిన్న కులమున బుట్టియు మిన్న గాను
మకుట మైనట్టి కవియగు మాన్యు డనగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగబ్బిలమును రచించిన ఘనుడతండు
రిప్లయితొలగించుకరుణ జిమ్ము మృదు మధుర కవిత లల్లి
కరుడు గట్టిన యెదలను కదిపి లేపి
వర్ణ ధర్మమ్ము నెదిరించి వాడి జూపి
నవ్య ధర్మ ప్రవచనకు నడుము కట్టె
కాకిగ తలచిన వారికి
రిప్లయితొలగించుకాకను తాజూపినాడు గబ్బిల కవితన్
లోకంబంతయు నన కవి
కోకిలగా నిలచి నాడు గొప్పగనితడే.
కలము|కదిలెడిగుర్రమై,కాలగమన
రిప్లయితొలగించుమందుపరుగెత్తెపద్యాలుమనసునందె
ముందుతరములవారికివిందులాగ
పంచగలిగినకవివర|వందనాలు
పరుగుదీసెడిగుర్రమేపద్యమనగ
గబ్బిలాలనుదేవునికడకునంపి
రాయబారమునడిపినరచనలన్ని
కవులమదిలోనపండెనుకలముపంట
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ‘ఎదను’ అంటే సరిపోయేదికదా!
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గబ్బిల కవితన్’ దుష్టసమాసం. ఇక్కడ సవరణను సూచించలేకపోతున్నాను.
****
కె.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘విందువోలె’ అనండి.
తెలుగు పద్య వైభవమును తెలియజెప్పి
రిప్లయితొలగించుకులమతమ్ముల గోడలు గూలు నటుల
ఖండ కావ్యముల్ రచియించి మెండుగాను
పదము పదమున మధురిమ పదిల పరచి
కవిత తూటాల నొదిలిన కవికి నతులు!!!
కె.యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించువెంకటావధాని తొడుగ పెండెరమును
కుదిరె కవిచక్రవర్తి బిరుదముమతనికి
వ్రేల్చెకులపు మైల యను గబ్బిలము నెంతొ ఆమహాకవి నుతియింప నగునె తరము
శైలజ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒదిలిన’ అనడం గ్రామ్యం. ‘తూటల వదలిన’ అనండి.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బిరుదము మతనికి’ అన్నచోట ‘బిరుదమె యతనికి’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగబ్బిలంబును గుర్తించె ఘనముగాను
రిప్లయితొలగించువల్లకాడున నైక్యంబు బాగజూపె
కవికి విఖ్యాతి గల్పించు కావ్యమల్లె
కరుణ వెలయించి కావ్యాల ఘనుడు నయ్యె
దళితుడైనట్టి యాతడు ధన్య కవియు
నార్తి కావ్యాల నిండియు నమరుడయ్యె
మానవత్వంబు మేల్కొల్పె మాన్యమూర్తి
ఖండకావ్యాల గుఱ్ఱంబు కదనుదొక్కె
తెలుగు కైతల దీనులతీర్చి,తాను
వల్లకాటను ఘనమైన వారులేరు
నంచు,బాలలె దైవాలు ననగ పలికె
పంచముడునైన నందె ప్రపంచ ఖ్యాతి
ఇంటగెలుపు,నేను,చదువు,ఇంటిగుట్టు
రిప్లయితొలగించుపంచముడు,ధర్మహింధూర,పత్రికలును
భరతవీరుడు,రచయుతభారతాన
పద్యభావనపండించెభాగ్యమటుల|
రిప్లయితొలగించుకవితలల్లెను గుఱ్ఱము కవివరుండు
పవనజవమున నత్యంత ప్రతిభ మెరయ
నవ కవుల్ జనుల్ మెచ్చుచు "నవయుగ కవి
చక్రవర్తి"గా పట్టము చక్క నిడిరి
గబ్బి లమ్మును రచియించి కవుల యందు
రిప్లయితొలగించుఅగ్ర గణ్యు డ వైతివి యార్య ! నీవు
దళిత కులమున బుట్టిన ధరణి పుత్ర !
అందు కొనుమయ్య వందనా లందుకొ నుము
మాస్టరుగారూ ! ధన్యవాదములు...చిన్నమార్పు చేశాను..
రిప్లయితొలగించుకాకిగ తలచిన వారికి
కాకను తాజ్మహలు జూపె గబ్బిలమున, నీ
లోకము మెచ్చునటుల కవి
కోకిలగా నిలచి నాడు గొప్పగనితడే.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ సవరణ బాగుంది.సంతోషం!
అతడు వీరయ్య కాలింగ మాంబ గర్భ
రిప్లయితొలగించుమందున జనియించెను కడు మధుర కృతుల
నేకము రచించె బిరుదుల నేకము కొనె
భూరి కృతి గబ్బిలము దాని సూరి యతడె
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని... ‘సూరి’ అని నియమోల్లంఘన చేసారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగుఱ్ఱముజాష్వనో"కవిగగుర్తేరిగించెనుకావ్యబంధు"వై
రిప్లయితొలగించుఅర్రులుజాచుగా"భవితనాదరనంబునుపంచబూన"గా
సర్రునపద్యముల్"రచనజాగృతినింపెనురాజువోలె"తా
ఉత్పలమర్రియువృక్షమై"మసలెమనవతత్వముమార్పుచేర్పు
"నన్
ఉత్పలమాలలోతేటగీతి
కాటిలో హరిశ్చంద్రుని పాటులన్ని
రిప్లయితొలగించుకన్నులకు గట్టినట్టుల కవితలల్లి
తెలుగు వారి హృదయముల వెలిగె నతడు
యిట్టి కవిచంద్రుడిలమరి పుట్టబోడు
లలితంపు పదములెల్లను
రిప్లయితొలగించుజలజల మల్లియలు రాలు చందమునందున్
పులకలు రేకెత్తు గతిని
సులువుగఁ గూర్చుచును వ్రాయు సొబగీతనిదే.
మన్నించండి. నిషిద్ధమన్నది గమనించలేదు.
రిప్లయితొలగించులలితంపు పదములెల్లను
జలజల మల్లియలు రాలు చందమునందున్
పులకలు రేకెత్తు గతిని
పలు కవితల వ్రాయునితడు, పండితుడు గదా!