25, డిసెంబర్ 2014, గురువారం

పద్యరచన - 776

క్రైస్తవ మిత్రులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. పశువుల పాకలో ప్రభువు పంపిన దూతగ మేరి గర్భమున్
    శిశువుగ జన్మనొందెగద జీససు - వెల్గులు జిమ్ము చుక్క ప్రా
    గ్దిశ గని జ్ఞానమూర్తులట దేవుని బిడ్డను జూడ వచ్చి లో
    క శుభకరుండు బుట్టెనని కాన్కలనిచ్చిరి బాలయేసుకున్

    రిప్లయితొలగించండి
  2. మేరి తనయుడు పుట్టిన మేటి రోజు

    విశ్వ మానవ కల్యాణ విభుని రాక

    శాంతి సందేశ వార్తకు శ్వాస నిచ్చె

    నవ్య క్రీస్తు శకమునకు నాంది బలికె

    రిప్లయితొలగించండి
  3. చుక్కను గనుచున్ జ్ఞానులు
    జొక్కపు యేసును కనుగొని సూనృత భక్తిన్
    చక్కని కానుక లొసగుచు
    మొక్కిరి దేవుని సుతునకు మోదము తోడన్!!!

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్యగారూ
    సందేహం కలిగినప్పుడు నివృత్తి చేసుకోకుండా వదిలేస్తే నిద్ర పట్టదు. విశ్వ మానవ కల్యాణ విభుడు అనే ప్రయోగం సాధువేనంటారా?? కల్యాణ విభుడు అనవచ్చునా?? కాస్త చెబుదురూ.

    రిప్లయితొలగించండి
  6. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    విశ్వమానవులకు శుభములనిచ్చే అధిపతి అనే అర్థంలో ఆ ప్రయోగం సాధువనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. తొలుత క్రీస్తు రాకను గూర్చి తెలుసుకున్న
    మూగ జీవాలు ముదముతో ముచ్చ టించె
    మేరి మాతకు జనియించి మేటి సుతుడు
    క్రీస్తు పేరుతో ప్రబలి తా కీర్తిఁ బొందె
    బడుగు వర్గాల సేవకై పాటు పడియె

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మేరీ మాతకు గలిగెను
    పూరి గుడిసె లోన నొక్క పుత్రుం డననా
    యూరూ వాడా గదిలెను
    కూరిమితో దైవ సుతుని గొప్పని జూడన్!

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. 1పుట్టినయేసునుగాంచగ
    తట్టగనూహలకుతలుపుతట్టినరీతే
    పట్టునవచ్చిరిపెద్దలు
    పట్టినసంతోషమందుపరమాత్ముడనిన్|
    2క్రీస్తుశకమునునిలుపంగ|క్రీస్తుబుట్టె
    మరియగర్భానజనియించమంచిదనుచు
    దేవదూతలుదెలుపంగ?దేవుడయిన
    ఏసుజననంబులోకులునెంచఘనము

    రిప్లయితొలగించండి
  12. 3గుడిసెనయేసుజనించగ|
    వడివడిగాచుక్కలెన్నొ-పలుకకదెలుపన్
    సడిజేయుచుదేవునిగన
    నడచిరిమరియమ్మకడకునౌరాయనుచున్

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పుట్టితి వట యీ రోజున
    పుట్టిన యో యేసు ప్రభువ !పూర్ణిమ చంద్రున్
    వట్టున వెలిగితి వయ్యా !
    యట్టులె కరుణిం చు మమ్ము ననవర తమ్మున్

    రిప్లయితొలగించండి
  15. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  16. ముగురు జ్ఞానుల జోస్యము ముగుద మేరి
    గర్భమున పరిశుద్ధాత్మ కరుణ వలన
    పసుల పాకలో ప్రసవించె బాల యేసు
    జూచి దీవింప వచ్చిరి సురలు యతులు

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పుట్టెను మేరి గర్భమున పుట్టెను గొడ్డుల పాకలోన తా
    పుట్టగ తూర్పు దిక్కునను పోసన మొప్పగ నొక్క చుక్కయున్
    బుట్టెను దాని గాంచి జన ముఖ్యులు వచ్చి గ్రహించి రాత్మలో
    పుట్టెను యేసు దైవమని మోదముతో ప్రణిథించి రందరున్

    రిప్లయితొలగించండి
  19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి