11, డిసెంబర్ 2014, గురువారం

పద్యరచన - 762

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. శీత లీక ర ణి మొదట జి న్ని బాల
    కుండు "ఛాకు లై ట్లను వెద కుకొను చుండ
    చూచు చుండెను గ్రిందన చోద్య మతని
    యక్క ,గనబడు చుండెనా నార్య !మీకు ?

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఫ్రిజ్జులో పిల్ల :

    01)
    _______________________________

    ఐసు ముద్దల దినగోరి - యాత్రపడుచు
    ఫ్రిజ్జు లోనికి జొరబడు - పిల్లగాంచి
    తల్లడిల్లగ యందరు - తల్లి వచ్చి
    యైసు ముద్దల దినిపింప - నామె మురిసె !
    _______________________________
    ఐసుముద్ద = ice cream

    రిప్లయితొలగించండి
  3. చల్లగ తినగను వెదకుచు
    పిల్లడు జొరబడెను గాన ప్రిజి లోపలకున్
    మెల్లగ గాంచిన యక్కయె
    తల్లికి చూపించ దలచె తమ్ముని చేస్టల్

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అమ్మ లేని సమయమింట ఆటవిడుపె
      అక్క తమ్ములిద్దరుచేరు  యొక్క మాట
      తోడు దొంగలౌదురు మరి జోడు కట్టి
      ఎత్తు లెక్కగలరువారు కొత్త లేక 

    రిప్లయితొలగించండి
  6. చల్లని యంత్రపు పేటిక
    నల్లన తానెక్కె లోన నల్లరి పిడుగే
    మెల్లన నేదో వెదకగ
    ఝల్లనె నక్కయ్య మేను జాగ్రత్తనియెన్.

    రిప్లయితొలగించండి
  7. పిల్లలు చేసెదరిటులే
    యల్లరి కనువిందుగ విననచ్చెరువగుచున్.
    కల్లాకపటములెఱుగని
    చల్లని మనసుల సదా ప్రసన్నత సొబగౌ.

    రిప్లయితొలగించండి
  8. పిల్లలు చేసెదరిటులే
    యల్లరి కనువిందుగ విననచ్చెరువగుచున్.
    కల్లాకపటములెఱుగని
    చల్లని మనసుల సదా ప్రసన్నతఁ గనుమా.

    రిప్లయితొలగించండి
  9. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘జాగ్రత్త యనెన్’ అనండి.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పసి తనమున వలయు పరిశోధ నాశక్తి
    సైన్సు జదువ వలయు శాస్త్ర దృష్టి
    ఊహ లున్న కొలది ఉత్సుకతపెరుగు
    కోరు కొనుము బిడ్డ కొంటె తనము

    రిప్లయితొలగించండి
  11. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీరు చూపిన సవరణతో...

    చల్లని యంత్రపు పేటిక
    నల్లన తానెక్కె లోన నల్లరి పిడుగే
    మెల్లన నేదో వెదకగ
    ఝల్లనె నక్కయ్య మేను జాగ్రత్తయనెన్. .

    రిప్లయితొలగించండి
  13. ఈ ఫోటో తీయడానికి మూడో మనిషి ఉండి తీరాలి మరి ! !
    సీసి టీవి వలయు సిత్రాలు జూడగ
    తల్లి తండ్రి గూడి యిల్లు విడిచి
    పోవ పొగలు రాత్రి పొట్టనింపుకొరకు
    నేటి తరపు వారి ఫీట్లు జూడ

    రిప్లయితొలగించండి
  14. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తెమ్మన్నానని బర్గరు
    నమ్మే కొనితెచ్చి పెట్టె నాఫ్రిజ్ పైనన్
    నమ్ముము యిదెనా నిచ్చెన
    ముమ్మాటికి నందు కొనెదఁ బోవే యక్కా!

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఆక లడరగ బొజ్జలో నర్భకుండు
    తల్లి కనుపించ కనుకడు తల్ల డిల్లి
    ప్రిడ్జి డోరును తెరచితా వెదకు చుండె
    చాకు లేటులు కోసమై సత్వరముగ

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. తల్లిని గానక బాలుడు
    అల్లన తాదూరె ఫ్రిజ్జు నరలను వెదకన్
    చల్లని కుల్ఫీ నిమ్మని
    యల్లరి వలదంచు నక్క నదితీసిచ్చెన్

    రిప్లయితొలగించండి
  20. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘బాలుడు అల్లన’ అని విసంధిగా వ్రాయరాదు కదా! ‘బాలుం| డల్లన...’ అనండి. అలాగే ‘అక్క యది తీసి యిడెన్’ అనండి.

    రిప్లయితొలగించండి