సుదతి నాదు మాట వినుము సుంత యైననడువగలవె నీవిట్టి కారడవినౌర నీవు నావెంట వచ్చుట నిరయమునక సాధ్యము వలదీ పంతము సాధ్వివిడుము
సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైనవినుము నామాట యోయమ్మ ! వినక ,నౌరయె టుల వత్తువు నాతోడ నిదియ నీకసాధ్యము గద మ ఱి యిక నీ శంక విడుము
సాద్వ్హి మరలుము నీవింక సంత సమున ప్రియుని ప్రాణము కోరుచు ప్రేమ మీర భీక రంబైన యడవుల భీతి లేక మనుజ కాంతలు జొరలేరు మాట వినుము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.****పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.****రాజేశ్వరి అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుద్ధిగా నింటి కేగుము! పో! రయమునచూడలే వెవరిని కనుచూపు మేరవనచరము లుండు నడవిలో పడకు వెనుకకాకులైనను దూరని కఠిన వనము!
ఇటుల నావెంట రాలేవు నిందువదన!నాదు మాటల నాలించు నయము మీరభీకరమ్మైన బిద్దెకు ప్రియుని వెనుకనడువ సాధ్యమా? సావిత్రి నన్ను విడుము!!!
లలన! రావలదిటుపైన ఫలముఁ గానలేవిక, వినుము. నా మాటలింక మీరవలదు, కోపమాగునె యిక పైన శంకవీడి నిన్ను శపించెదన్! వేగఁ జనుము.
బొడ్డు శంకరయ్య గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.****శైలజ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘రాలేవు + ఇందువదన’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘రాకూడ దిందువదన’ అనండి.****లక్ష్మీదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యముని పాశంబు తప్పించ నలవియగునవెంటవచ్చిన నీకును వెతల భారమగును దారి కానవచట అరుగుమింకకలికి ఆత్రోవ రుధిర కంకాలమయము
భైరవభట్ల శివరామ్ గారూ,అద్భుతమైన పూరణతో ‘శంకరాభరణం’ బ్లాగులో అడుగుపట్టారు. అభినందనలు.మీకు మహదానందంతో స్వాగతం పలుకుతున్నాను.
పదును రంపాలు కోసెడు పాపి కతన!కాల్చి పెట్టెడు సూదులు కనుల దూర!మరగఁ గాచిన నూనెలో పొరలు కేక!చూడలేవమ్మపాపుల సోదెఁ !జనుము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వెంటబడకుము సావిత్రి యంటి, వినిన దానవైతివి చూడగా దారి బెదర గొట్టు సాగదు ముందునకు మరి నడక బ్రతకబోడిక పతి, నాదు పలుకు వినుము.
మల్లెలవారి పూరణలు 1.ప్రాణమది వోవ తప్పదే ప్రాణికైన భయము గల్గించు దారియౌ,భార మౌర పాము,తేళ్ళను,రాళ్ళను వలను గాక యుండు,నింకను పతి గొను నూసువిడుము2.వెనుకకునిడను పతిని నే వీరయాన!నాదు వెంటను బడకుము నడకదీర భయముగొల్పును నిటపైన దారి లేక యుండు.పతి ప్రాణ మాసను నుడుగ భయము
పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములుకంటకావృత మగు ఘోర కాననమున ఎలుగు తోడేళ్ళుసి౦హము లేన్గులు వర హశరభములు పులులు తిరుగాడును నిక మరలిపొమ్ము సావిత్రి నామాట వినుము డిసెంబర్ 21, 2014 3:09 [PM]
కెయెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ ఈవు వదలుమా ఆశ ప్రాణేశు పైనమరల ననుసరించితి వేని మద్భయకర పాశబంధము తీయు నీ ప్రాణమునికమాట వినుమిక సావిత్రి మరలి చనుము
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతోకొండగుట్టలుదాటినగుండెనయినమండుసూర్యునిదాటంగమనసుజేరబూడిదౌదువుసావిత్రిపూర్తి;గనుకపట్టువిడనాడివెళ్లుముగుట్టుగాను
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.****మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.****కెంబాయి తిమ్మాజీ రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.****కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.****కె. ఈశ్వరప్ప గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాకులు చొరబడగలేని కారడవినపద్మపత్రనేత్ర వినుము పయనము నరజాతికి నసాధ్యము మరలు సాధ్వి! లతిక కోమలాంగి యొకవరము కోరుకొనుము
2గాలివెలుతురులేనట్టిగమనమైనకళ్ళకగుపించకన్-దారికంటకమె,రజస్సునందేళ్ళసావిత్రిజడ్డు,గనుకయమునినాజ్ఞగమరలుమునాశవిడుము3ఎదురుపడనపడనట్టిబాధలునెంచుటగునచూడలేనట్టివెతలిటచూడు,విసరకష్టనష్టాలబాటలోకలసిరాకవెళ్లిపొమ్మికసావిత్రీవేగవినుము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.****కె.ఈశ్వరప్ప గారూ, మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరణ పతిని కాపాడంచు మంకు తగునప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూరజంతు, కింకర మయము రా జనదు నీకరిష్టము కలుగు మరలిపో నిజము వినుము
మరణ పతినాదు కొమ్మను మంకు తగునప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూరజంతు, కింకర మయము రా జనదు నీకరిష్టము కలుగు మరలిపో నిజము వినుము
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుదతి నాదు మాట వినుము సుంత యైన
రిప్లయితొలగించండినడువగలవె నీవిట్టి కారడవినౌర
నీవు నావెంట వచ్చుట నిరయమునక
సాధ్యము వలదీ పంతము సాధ్వివిడుము
సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైన
రిప్లయితొలగించండివినుము నామాట యోయమ్మ ! వినక ,నౌర
యె టుల వత్తువు నాతోడ నిదియ నీక
సాధ్యము గద మ ఱి యిక నీ శంక విడుము
సాద్వ్హి మరలుము నీవింక సంత సమున
రిప్లయితొలగించండిప్రియుని ప్రాణము కోరుచు ప్రేమ మీర
భీక రంబైన యడవుల భీతి లేక
మనుజ కాంతలు జొరలేరు మాట వినుము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుద్ధిగా నింటి కేగుము! పో! రయమున
రిప్లయితొలగించండిచూడలే వెవరిని కనుచూపు మేర
వనచరము లుండు నడవిలో పడకు వెనుక
కాకులైనను దూరని కఠిన వనము!
ఇటుల నావెంట రాలేవు నిందువదన!
రిప్లయితొలగించండినాదు మాటల నాలించు నయము మీర
భీకరమ్మైన బిద్దెకు ప్రియుని వెనుక
నడువ సాధ్యమా? సావిత్రి నన్ను విడుము!!!
లలన! రావలదిటుపైన ఫలముఁ గాన
రిప్లయితొలగించండిలేవిక, వినుము. నా మాటలింక మీర
వలదు, కోపమాగునె యిక పైన శంక
వీడి నిన్ను శపించెదన్! వేగఁ జనుము.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాలేవు + ఇందువదన’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘రాకూడ దిందువదన’ అనండి.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యముని పాశంబు తప్పించ నలవియగున
రిప్లయితొలగించండివెంటవచ్చిన నీకును వెతల భార
మగును దారి కానవచట అరుగుమింక
కలికి ఆత్రోవ రుధిర కంకాలమయము
భైరవభట్ల శివరామ్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణతో ‘శంకరాభరణం’ బ్లాగులో అడుగుపట్టారు. అభినందనలు.
మీకు మహదానందంతో స్వాగతం పలుకుతున్నాను.
పదును రంపాలు కోసెడు పాపి కతన!
రిప్లయితొలగించండికాల్చి పెట్టెడు సూదులు కనుల దూర!
మరగఁ గాచిన నూనెలో పొరలు కేక!
చూడలేవమ్మపాపుల సోదెఁ !జనుము!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివెంటబడకుము సావిత్రి యంటి, వినిన
రిప్లయితొలగించండిదానవైతివి చూడగా దారి బెదర
గొట్టు సాగదు ముందునకు మరి నడక
బ్రతకబోడిక పతి, నాదు పలుకు వినుము.
మల్లెలవారి పూరణలు
రిప్లయితొలగించండి1.ప్రాణమది వోవ తప్పదే ప్రాణికైన
భయము గల్గించు దారియౌ,భార మౌర
పాము,తేళ్ళను,రాళ్ళను వలను గాక
యుండు,నింకను పతి గొను నూసువిడుము
2.వెనుకకునిడను పతిని నే వీరయాన!
నాదు వెంటను బడకుము నడకదీర
భయముగొల్పును నిటపైన దారి లేక
యుండు.పతి ప్రాణ మాసను నుడుగ భయము
రిప్లయితొలగించండిపూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు
కంటకావృత మగు ఘోర కాననమున
ఎలుగు తోడేళ్ళుసి౦హము లేన్గులు వర
హశరభములు పులులు తిరుగాడును నిక
మరలిపొమ్ము సావిత్రి నామాట వినుము
డిసెంబర్ 21, 2014 3:09 [PM]
కెయెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఈవు వదలుమా ఆశ ప్రాణేశు పైన
మరల ననుసరించితి వేని మద్భయకర
పాశబంధము తీయు నీ ప్రాణమునిక
మాట వినుమిక సావిత్రి మరలి చనుము
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండికొండగుట్టలుదాటినగుండెనయిన
మండుసూర్యునిదాటంగమనసుజేర
బూడిదౌదువుసావిత్రిపూర్తి;గనుక
పట్టువిడనాడివెళ్లుముగుట్టుగాను
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాకులు చొరబడగలేని కారడవిన
రిప్లయితొలగించండిపద్మపత్రనేత్ర వినుము పయనము నర
జాతికి నసాధ్యము మరలు సాధ్వి! లతిక
కోమలాంగి యొకవరము కోరుకొనుము
2గాలివెలుతురులేనట్టిగమనమైన
రిప్లయితొలగించండికళ్ళకగుపించకన్-దారికంటకమె,ర
జస్సునందేళ్ళసావిత్రిజడ్డు,గనుక
యమునినాజ్ఞగమరలుమునాశవిడుము
3ఎదురుపడనపడనట్టిబాధలునెంచుటగున
చూడలేనట్టివెతలిటచూడు,విసర
కష్టనష్టాలబాటలోకలసిరాక
వెళ్లిపొమ్మికసావిత్రీవేగవినుము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె.ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరణ పతిని కాపాడంచు మంకు తగున
రిప్లయితొలగించండిప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూర
జంతు, కింకర మయము రా జనదు నీక
రిష్టము కలుగు మరలిపో నిజము వినుము
మరణ పతినాదు కొమ్మను మంకు తగున
రిప్లయితొలగించండిప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూర
జంతు, కింకర మయము రా జనదు నీక
రిష్టము కలుగు మరలిపో నిజము వినుము
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.