4, డిసెంబర్ 2014, గురువారం

పద్యరచన - 755

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28 కామెంట్‌లు:

 1. కరకరలాడు పకోడీ
  యరిటాకున పెట్టెనందునల్లము, పుట్నా
  లిరు చట్నీలను వేసిరి
  మరి యాలస్యమేల మనముభుజించన్

  రిప్లయితొలగించండి
 2. ఆకు నిండప కోడీలు నలరి మిగుల
  రెండు రకముల పచ్చళ్ళు నిండు గాను
  నుండు పళ్ళెము జూడగ నూరె నోరు
  తెచ్చి యీయవ ! మఱి నాకు దేజ ! నీవు

  రిప్లయితొలగించండి
 3. ఉల్లము రంజిల్లు నటుల
  అల్లము మిర్చీలు గలిపి హాహా పకోడీ
  ఎల్లలు లేవట తినగను
  చల్లారిన రుచులు మారు చట్నీ లందున్

  రిప్లయితొలగించండి
 4. గురువు గారికి నమస్సులు. శుక్లం ముదిరితే బ్లేడు ముక్కతో మాల్యువలు గా శస్త్ర చికిత్స చేస్తారు.అది పాత పద్ధతి. లేతగా ఉంటే లేజర్ చికిత్స కు అనువుగా ఉంటుంది. ఫోల్డబుల్ లెన్సు వేస్తారు. మా అమ్మకు అలా రెండు కళ్ళు రెండు రకాలుగా చేశారు. ఎల్.వి.ప్రసాద్ లో గాని మాక్సి విజను లో గాని రెండవ అభిప్రాయం తీసుకోండి.

  రిప్లయితొలగించండి
 5. కవిమిత్రులారా,
  చిత్రంలో నాకేమో చిట్టిగారెలు కనిపిస్తున్నాయి. అందరూ ‘పకోడీ’ అంటున్నారు. నా కళ్ళజబ్బేమైనా ఎక్కువైందా అని అనుమానం వస్తున్నది.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘మరి యిక నాలస్య మేల మనము భుజింపన్’ అనండి.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘హాహ’ టైపాటు వల్ల ‘హాహా’ అయింది. ‘హాహా’ అంటే గణదోషం.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. పెసర పిండి తోటి వేడి పకోడీల
  నారగింప నోరు కోరుచుండె
  వేడి వేడి గాను వేయమంచు పకోడి
  కోరినాను నాదు కూర్మి సతిని

  రిప్లయితొలగించండి
 7. వేడి వేడి పకోడీలు జూడ కనులు
  ఎంత వయసు వారైనను ఎగిరి పడరె !
  దారి ప్రక్క న తిళ్లకు దూర ముండు
  చెత్త తిళ్ళు నీ కడుపున చేర్చు గేసు

  రిప్లయితొలగించండి
 8. అయ్యా ! మీరన్నట్లు అవి చిట్టిగారెలే...పకోడీలు కాదు..మినపపప్పు కనబదుచున్నవి చూడండి,,కవిమిత్రులు మరో వాయి వేయాలేమో...

  రిప్లయితొలగించండి
 9. పెట్టిరిగ చిట్టిగారెల
  నిట్టుల నరిటాకులోన నెదురుగ కన నా
  కట్టును చట్నీలే పద
  పట్టును పట్టెదము నేడు వదలక తినుచున్.

  రిప్లయితొలగించండి
 10. నాకళ్ళకు అవి పెసర వడలు లేక మసాలా వడలు అనిపిస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 11. తినిన గారెల నెప్పుడు తినగ వలయు
  వినిన భారతమ్మును సదా వినగ వలయు
  అనుభవమ్ముతో సతతము మనకు బుధులు
  చెప్పు చున్నట్టి నుడులెప్పు డొప్పు సుమ్మ

  రిప్లయితొలగించండి
 12. వడయో వేడిప కోడియొ
  కడుపున పడగా గుడగుడ ఖాయము హితుడా
  చెడుగుడు తప్పక తప్పదు
  వడిగా వేపుడు తినకుము వైద్యుని పెంచన్

  రిప్లయితొలగించండి
 13. అవి పకోడీలో? చిట్టిగారెలో ? తెేల్చుకోలేక రెండు వాయిలు వేసాను..

  అరిటాకున పెట్టితిరట
  సరియగు చట్నీలతోడ చవులూరిస్తూ
  మురిపించె చిట్టి గారెలు
  మురళీ ధరుడా! ముదముగ భుజియించుమయా!!!

  కరకరలాడు పకోడీ !
  పురహరుడైన నినుజూడ మురియుచు తినుగా
  సరియగు నుల్లిని చేర్చిన
  కరిగెదవే నోటిలోన కమ్మని రుచితో!!!

  రిప్లయితొలగించండి
 14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘కన్ను| లెంత వయసు...’ అనండి.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. అలసంద రుబ్బి బేడలఁ
  గలుపుచు నుల్లీని జేర్చి కరకరలాడన్
  సలసల కాగే నూనెన్
  గాలిన చట్నీలతోటి కలుపి తిన భళీ!

  రిప్లయితొలగించండి
 16. అరటాకు పైన పెట్టిరి
  కరకర లాడే పకోడి కమ్మని చట్నీ
  లరమరలేకను తినుమని
  సరి, జాగొనరించనేల సాగింతు వడిన్.

  రిప్లయితొలగించండి
 17. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. అవి పకోడీలని భ్రమపడటానికి నేనే కారణమేమో (మొదటి పద్యం నాదేగా ) ... అది పకోడీ కాదని ఖచ్చితంగా తెలుసు .. కనీ దానిని ఏమంటారో తెలీక పకోడీ పూరణ చేశాను.

  చిట్టిగారె ప్లేటు చిత్రమున గనగ
  నోటిలోన నాకునూరె జలము
  చక్కనియరిటాకు చట్నీలతో జూడ
  కడుపులోనెలుకలు కదులుచుండె

  రిప్లయితొలగించండి
 19. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. చక్కగ పళ్ళెరమ్మునను సన్నని యీ యరటాకు పై నహా
  చిక్కని పచ్చడి ద్వయము జిహ్వకు తీపులు పెట్ట నల్లదే
  పక్కొడి యన్దగించినది బాపురె తాళగ నాకు శక్యమే
  ఒక్కొక తుంపు నోట నిడి యుర్వినె స్వర్గము నేను చూడనే.

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘చిక్కని రెండు పచ్చడులు...’ అంటే బాగుంటుందేమో?

  రిప్లయితొలగించండి
 22. కోల కోలగ నున్నవి గొన్ని యచట
  పోలె యవి పకో డీలను బూర్తి గాను
  గురువు లంటిరి యవి చిట్టి గారె లెయని
  గురువు జెప్పిన మాటయే గురియ మా

  రిప్లయితొలగించండి
 23. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. కోల కోలగ నున్నవి గొన్ని యచట
  పోలె యవి పకో డీలను బూర్తి గాను
  గురువు లంటిరి యవి చిట్టి గారె లెయని
  గురువు జెప్పిన మాటయే గురియ మాకు

  చిన్న చిన్నగ నుండును చిట్టి గారె
  లవియ ,యోసామి !యిష్టము హరున కెంత
  గా నొ ,నైవేద్య మిడుదురు గ్రామ ప్రజలు
  శివుని కళ్యాణ శుభ వేళ చేరి గుడిని

  రిప్లయితొలగించండి
 25. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ తాజా పద్యాలు బాగున్నవి.అభినందనలు.

  రిప్లయితొలగించండి