29, డిసెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 780

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

  1. మధువును గ్రోలుచు ముదముగ
    మధుపం బదిమైక మందు మౌనము తోడన్
    అధరములు కంది పోవగ
    పధమం దునసుమము విరిసె భాగ్య మటంచున్

    రిప్లయితొలగించండి
  2. మధువుఁ గ్రోలుచుండ మధుపంబు తుష్టితో
    సుమము సిగ్గు తోడ సొక్కు చుండె
    కనుల విందుఁజేసె కమనీయ దృశ్యము
    చెప్ప తరమె దాని గొప్ప తనము

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పూల తేనెలు గ్రోలుచు పుప్పొడిలను
    చేరవేయు సీతాకోక చిలుక మెదల
    చిత్రకారుని రంజించు చిత్ర మవగ
    కవుల హృదయము కాంక్షించు కవిత వ్రాయ

    రిప్లయితొలగించండి
  5. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘అవగ’ అనడం సాధువు కాదు. ‘చిత్ర మగుట’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. పూవుల రెక్కల వంటివి
    నీ వంటికి నుండె చిలుక నిను జూడగనే
    పూవులు తేనియ చిలుకగ
    త్రావుచు తాకెదవు రెక్క తనివిని దీర్చన్.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తుమ్మెద వాలెను పూవున
    కమ్మని తేనియలవిందు గైకొని బోవన్
    కొమ్మల విరులిది గనుచున్
    రెమ్మల జొంపముల దాగి రెపరెప లాడెన్!!!

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. సీతాకోకచిలుకయే
    పూతేనియ దోచుకొనగ పూవున వ్రాలెన్
    ప్రీతగు రంగుల రెక్కల
    వాతములో నెగురు నిదియె వయ్యారముగన్!!!

    రిప్లయితొలగించండి
  12. సీతగాదుచూడచిత్రముగానుండు
    కొకగట్టుకొనెడికోర్కెలేదు
    చిలుకయనుటతప్పె-పలుకులురావాయె|
    పువ్వునవ్వుచెంతపులకరింత
    2నవ్వెడిపువ్వుచెంతనయనంబులునాట్యముజేయుచిత్రమై|
    రువ్వెడిహావభావములరూపసిగానటసీతకోకలా
    యవ్వనమందుజుఱ్ఱుకొనునాశగవెళ్లేనుకీటకంబు|యే
    మువ్వలులేనినాట్యమునముచ్చటగాగనుపించెదృశ్యమై|

    రిప్లయితొలగించండి
  13. మకరందమ్మునుగ్రోలవచ్చెగదసామ్రాజ్యంబురారాజుగా
    వికటాట్టాసములేకనేమధువుసర్వేశుండుజేకూర్చగా
    నకటాపువ్వులరంగులోనిలిచివిన్యాసాలసంతోషతన్
    నికరంబంతయుసీతకోకజిలుకేనేర్పందుగన్పట్టెగా|

    రిప్లయితొలగించండి
  14. గతంలో వెలువడిన నూతన ఛందం
    'సహకారము' అనే వృత్తములో:
    చెలువము నీదె! సుకుమారమైన చెంపల దానా!
    నిలువఁగ లేక నినుచేర రాగ నిక్కెద వేలా?
    వలపుఁ గొనంగ , సరసాలఁదేల వాలగ నీపై!
    కలగొనె రోహితము నీదు మోముఁ!గాంచతరమ్మే?

    రిప్లయితొలగించండి
  15. శైలజ గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యంలో ‘కీటకంబు + ఏ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కీటకంబె యే’ అనండి.
    మూడవ పద్యంలో ‘వికటాట్టహాసము’ను ‘వికటాట్టాసము’ అనడం దోషమే. ‘వికటంబౌ నవు..’ అనండి.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. రంగులకీటకరాజుగ
    పొంగినభావాలమధువుపొలుపుగ-గ్రోలన్
    చెంగుననెగిరేచిలుకగ
    హంగులుగమనించెపువ్వునాప్యాయతతో|

    రిప్లయితొలగించండి
  17. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    భక్తీ పుస్తకమనెడు పుష్పమ్ముమీద
    భావమను మరందము గ్రోల వ్రాలియుండ
    విమల భక్తుడన తనరె భ్రమరమౌర
    గరుప నెంచుచు మనకు సత్కార్య దీక్ష

    రిప్లయితొలగించండి
  18. ప్రతిఘటించగ లేనిపుష్పమ్ముపైన
    బడిమధువుగ్రోల పాడియా?భ్రమర రాజ!
    మరలివత్తు వ౦చును యాస మాయ మవగ
    పూవు కృశియించి నశియించి పోవునకట

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. పచ్చని యాకుల నడుమన
    మెచ్చదగిన యెఱుపురంగు మిలమిలతో పూ
    విచ్చినదని చూడదలచి
    వచ్చెనె పలురంగులుగల ప్రాణియు నిదియున్.

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి