19, డిసెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 770

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము

“మల్లెపూవు స్వగతము”

28 కామెంట్‌లు:

 1. పచ్చని యాకుల నడుమను
  విచ్చెను మామల్లె మనసు వేడుక మీరన్
  గుచ్చగ గుండెను సూదుల
  మెచ్చరు దేవతలు మిమ్ము మేలగు భక్తిన్

  రిప్లయితొలగించండి
 2. తెల్లని దేహ కాంతియును తీయని వాసన గల్గియుండి కో
  కొల్లలుగా ప్రశంసలిడు గుమ్మల వాల్జడలందు నిక్కి యే
  చల్లని వేళనో కవుల చక్కని పాటల వర్ణితం బునై
  యుల్లమునందు ప్రేమికుల కోపిక నిచ్చెడి పూవు నేనెగా

  రిప్లయితొలగించండి
 3. పూవు లన్నిటి యందున మురిపెములను
  గలుగ జేతును బ్రతి యొక్క కాంతకు నిల
  మత్తు నిత్తును భర్తల మస్త కములకు
  ననుచు దనలోన మల్లెపూ వది య నుకొనె
  ననున టు లచట గనబడె నార్య ! చూడు

  రిప్లయితొలగించండి
 4. తెల్లని మల్లెలు మేమని
  చల్లని యా చంద మామ సరసన జేరన్
  నుల్లము పొంగిన కలువలు
  కల్లా కపటమ్ము నొంది కలవర పడగన్

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ ఉత్పలమాల బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మస్తకములకు’ అన్నచోట గణదోషం. ‘మస్తకముల| కనుచు..’ అనండి.

  రిప్లయితొలగించండి
 6. విరహము కోరను ఎపుడూ !
  మరువను , సరసపు పరుగుల , మరువపు మావన్ !
  నిరతము నవ్వెద హాయిగ !
  దరహస మెంచగ , మదీయ దరహాస మెగా ( రా )

  ('సిరి మల్లె పూవల్లె నవ్వు '............ డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ . )

  రిప్లయితొలగించండి
 7. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఎపుడూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘విరహమును కోర నెప్పుడు’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. దేవుని పదముల, దేశముఁ
  గావగ ప్రాణములొసగెడు కాయముఁ బైనన్,
  నా వలె నవ్వెడు పాపల
  నే వడి జనకున్న జన్మ నిష్ఫలమకటా!

  రిప్లయితొలగించండి
 9. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. మల్లె పువ్వు వంటి మనసున్న మనిషని
  మల్లె పువ్వు లాంటి పిల్ల యనుచు
  జనులు నాదు రంగు సతతము మదిదల్చి
  పొగడు చుంద్రు నన్ను ముదము తోడ
  పడతుల తలలందు మరియు పడక పైన
  తురిమియు పరచియు కరము తుష్టి తోడ
  గ్రోలు చుంద్రు నా గంధమున్ కోరి కోరి
  పిదప పారవేయుచునుంద్రు పెంట కుప్ప
  పైన మనుజుల ప్రేమను కాన లేము

  రిప్లయితొలగించండి
 11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘లాంటి’ గ్రామ్యం... ‘వంటి’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. విచ్చగ గుండెల గుచ్చుచు
  ముచ్చగా జడను దీర్చ మోదమ్మెటులౌ?
  యచ్చముగా భగవంతుని
  వెచ్చని పాదాలచెంత వేడుక నాకున్!

  రిప్లయితొలగించండి
 13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘మోదమ్మెటులౌ| నచ్చముగా...’ అనండి.

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
  1నావలెనవ్వబోవరిల;ననాగరికంబుననుండలేరు'తా
  జీవనమంతభక్తియనుచింతనపొంతనసాగనీయరే
  భావనభాగ్యమూహలుసభాసదులందునజెప్పలేరు-యే
  కోవకుజెందుమానవులొకొంచమునర్థముగాదు*పువ్వనెన్

  రిప్లయితొలగించండి
 15. పూజకుగుర్తురో,వదలిపూర్తిగశోభనమందుజేర్తురో,
  మోజునకొప్పునుంచెదరో,ముద్దుగవాల్జడకండగూర్తురో
  ఫోజులనాయకుల్మెడకుపొందుగనుంతురొ,దండబేర్చి,రా
  రాజులవంటిధూర్తులిటరాకకువేతురొవేచిచూసెదన్

  రిప్లయితొలగించండి
 16. ఆకులకోకగట్టుకొనినందపుచందపుచందమామగా
  షోకునజూడరమ్మనెడిచూపులుగల్గినభామలాగ,యే
  పోకిరిచెంతజేరుదునొ,పుట్టుకసార్థకమైనదేవునే
  తాకకనుండిపోయెదనొ,తానిటయన్నమనోభిలాషయే

  రిప్లయితొలగించండి
 17. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మూడవ పూరణలో ‘కోక గట్టుకొని యందపు..’ అనండి.

  రిప్లయితొలగించండి
 18. కళ్ళకు హాయిని గూర్చెద
  పళ్ళెర మందున్ననేను పరిమళ మిత్తున్
  గుళ్ళో నిత్యము దేవుని
  మెళ్ళో హారముగ నేను మెరిసిన చాలున్!!!

  నిరతము నాశగ జూసెద
  పరమాత్ముని కొలువుజేరు భాగ్యము కొరకై
  విరిసితి నీకొరకేనని
  హరి నీతో విన్నవించి యర్పిత మౌదున్!!!

  సరసుల చేతికి జిక్కక
  తరలెడి కాయమ్ముపైన తలవాల్చకనే
  పరిమళమున్నంతవరకు
  దరిజేర్చుము నీ పదముల దయతో స్వామీ!!!

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో కళ్ళకు, గుళ్ళో, మెళ్ళో అన్న వ్యావహారిక పదాలను ప్రయోగించారు. భావం చక్కగా ఉంది కనుక ఫరవాలేదు లెండి.

  రిప్లయితొలగించండి
 20. పచ్చని ఆకులలో కడు
  స్వచ్ఛముగా విరిసినట్టి సౌరభ సుమముల్
  నిచ్చము వనితల శిఖలో
  ముచ్చటగా వెలుగు మల్లె పూలివి కావా?

  రిప్లయితొలగించండి
 21. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. కెఎస్ గురుమూర్తి అచారిగారి పద్యము
  అ౦దము గంధమున్ కలసి అందరిడెందములందునన్ మహా
  నందము గల్గ జేసెద మనంగుని చేనిని మానవాళికిన్
  స్పందన నిచ్చి సృష్టికిని సాయ మొనర్తుము బ్రహ్మదేవ ఈ
  చందము నీవు మాకు నతి స్వల్పపు టాయువు నివ్వ
  న్యాయమా

  రిప్లయితొలగించండి
 23. శైలజగారి పద్యాలు మనోరంజకం!

  గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  విచ్చగ గుండెల గుచ్చుచు
  ముచ్చటగా జడను దీర్చ మోదమ్మెటులౌ?
  నచ్చము గాభగవంతుని
  వెచ్చని పాదాలచెంత వేడుక నాకున్!

  రిప్లయితొలగించండి

 24. పూజ్యులు గురుతుల్యులు శంకరయ్య గారికి వందనములు
  మల్లియ పూలు మేము, క్షణమాత్రము మన్నిక మాది,సౌరభ
  మ్మెల్లెడ విస్తరించెదము మెచ్చగ మానవకోటి దేవతల్
  తెల్లదనమ్ము అందముకుదీటగు పూవులు లేనె లేవు పె
  ళ్ళిళ్ళనుపెళ్ళికూతురికి ప్రీతిగమమ్ము నలంకరింతురే

  రిప్లయితొలగించండి
 25. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. భక్తితో ననుస్వామి పాదాల చేర్చెడి
  భక్త జనావళి భక్తి గాంచ
  నామీద మమతతో నాపేరు నేదాల్చి
  "మల్లికా" యన పొంగు మహిళల గన
  నాసువాసనలలో నవ్య భోగములందు
  జవ్వనంబున నున్న జంట లగన
  వేసవి తాపాన వేసారు జనులునా
  పరిమళమ్ములతోడ పరవశింప
  ..
  యెంత యుప్పొంగి పోదునో ఎట్లు తెలుప
  గర్వ మగునెంతొ నాభాగ్య గరిమ తలప
  అమిత ఆనందమగు మది హాయి గొలుప
  పుడమి లోనన్ను మించెడి పువ్వు కలదె!

  రిప్లయితొలగించండి
 27. చల్లా రామలింగ శాస్త్రి గారూ,
  మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  ‘పరవశింప| నెంత..’ అనండి.
  ‘అమిత ఆనంద’మని విసంధిగా వ్రాయరాదు కదా.. ‘అధికమోదమగు మది..’ అనండి.

  రిప్లయితొలగించండి