22, డిసెంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1567 (యాయవారముఁ జేసె లక్షాధికారి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యాయవారముఁ జేసె లక్షాధికారి.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

44 కామెంట్‌లు:

  1. మధుకరంబె ఛాత్రులకును మంచిదనుచు
    గురువు నియమంబు బెట్టిన తరుణమందు
    తండ్రి ధనవంతుడైనను తప్పదనుచు
    యాయవారముఁ జేసె లక్షాధికారి!!

    రిప్లయితొలగించండి
  2. బ్రహ్మ లిఖితము బాగుగ బఱగు కతన
    బీద దనమున నుండిన వీరమణిని
    యాయవారము జేసె లక్షాధి కారి
    యెవరి యదృష్ట మెట్టిదో యెవరి కెఱు క !

    రిప్లయితొలగించండి
  3. శర్వు డంతటి వాడట శనికి జడిసి
    చెట్టు తొఱ్ఱను దాగుండె బెట్టు తోన
    విధి విలాసము తప్పదు వేల్పు కైన
    యాయ వారము జేసె లక్షాధి కారి

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్య పద్యం చదువగానే, ఆ స్ఫూర్తితో ఆశువుగా ఉబికిన నా పద్యం ...

    శ్రీనివాసుడే దూరమై 'శ్రీ'కి, భువిని
    పుట్ట తొర్ర నొదిగి త్రాగె పొదుగు పాలు
    బ్రహ్మ శంకరుల్ పశువులై పాల నొసగ -
    యాయవారముఁ జేసె లక్షాధికారి.

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు ఫణీంద్ర గారూ
    ధన్య వాదనుము బాగుంది మీపద్యం

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    డా. ఆచార్య ఫణీంద్ర గారికే స్ఫూర్తినిచ్చే పూరణ వ్రాశారు. బాగుంది. అభినందనలు.
    ****
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    చాన్నాళ్ళకు శంకరాభరణంలో మీ చక్కని పూరణ చూసే భాగ్యం లభించింది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  7. ఓటు బ్యాంకు కోసమై చేతులు జాచి
    చేగుడ్డ పట్టి ఇంటింట తిరుగాడి
    'నమో'స్ 'కరములతో వంగి వంగి
    యాయవారము జేసె లక్షాధికారి !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. ఆడి తప్పని భూపాలు డాలి నమ్మె
    పరుల పంచన జేరెను పాండు సుతులు
    నుదుటి వ్రాతను మార్చంగ నొరుల తరమె
    యాయవారము జేసె లక్షాధికారి

    రిప్లయితొలగించండి
  10. జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....
    ఓటు బ్యాంకుకై చేతుల నొనరఁ జాచి
    జోలెపట్టి యింటింట బేలతనము
    పరగ ‘నమో’స్కరములతో వంగి వంగి
    యాయవారము జేసె లక్షాధికారి!
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చేరిరి పాండుసుతులు’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. మాష్టారు బ్లాగ్ లో పోస్ట్ లు మాయమై పోతున్నాయి .... ఈరోజు నా పోస్ట్ కనపడుటలేదు ... డిసెంబర్ 19 రోజు నిషిద్ధాక్షరి లో నాపోస్ట్ పై మీరు పెట్టిన కామెంట్ కనబడుట లేదు ... సెట్టింగ్స్ మార్చాలేమో

    రిప్లయితొలగించండి
  12. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణను చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణగా పొరబడ్డాను. మన్నించండి.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి సూర్యనారాయణ గారి పూరణ....

    కడుపుకింత తిండికొరకు కటికపేద
    యాయవారముఁ జేసె - లక్షాధికారి
    యింట విందుజేయ మిగిలెనింతకూడు
    దైవమునకింత పక్షపాతంబు తగునె ?

    రిప్లయితొలగించండి
  14. తండ్రి సంపద నంతయు త్రాగి తినుచు
    ఖర్చు జేయుచు గడిపెను కాలమంత
    కష్ట పడకున్న నిలచునా అష్టలక్ష్మి
    యాయవారము జేసె లక్షాధి కారి

    రిప్లయితొలగించండి
  15. మ్రొక్కుఁ దీర్చగ తిరుమలపోయె నతఁడు
    ముడుపు వేయగఁ దడబడ మొత్త మంత
    వేంకటేశు హుండీ లోన విడచి నంత
    యాయవారముఁ జేసె లక్షాధికారి!

    రిప్లయితొలగించండి
  16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ?పూజ్యులయినకందిశంకరయ్యగారికివండనం
    యాయవారముజేసెలక్షాధికారి?
    వారమెంచకలక్ష్మికైవారముండి
    మోసకారులచెంతనమోజునింపి
    నాశదోషానరోగాలనంటగట్టు

    రిప్లయితొలగించండి
  19. డబ్బునొనగూడుటేప్పుడో?జబ్బులెపుడో?
    తెలిసిరావయ్యలోకులతెలివియున్న
    యయవారముజేసెలక్షాదికారి
    ననగ?ప్రశ్నకుబదులేది?నాడునేడు

    రిప్లయితొలగించండి
  20. మాయమనసునజేరెడిమర్మమందు
    యాయవారముజేసెలక్షాధికారి?
    యనుటకెవ్వరికౌనిలమనుగడందు
    లక్ష్మికరుణించుసమయంబె-లాభమొందు

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
    1.లక్కయింటి మంటలనుండి లక్షణముగ
    బైటపడి యేక చక్రపు పల్లెలోన
    పాండుపుత్రులు తిరిపలై బ్రతుక లేదె
    యాయ వారముజెసె లక్షాధి కారి
    2.అర్జునునకునే యాపద యనిని గల్గ
    కుండగను కర్ణుని కవచకుండలముల
    యాయ వారముజెసె లక్షాధి కారి
    దేవరాజైన ఇంద్రుడు దేహి యనుచు
    3.చెంత లక్షల సిరులు౦డి చెల్లనపుడు
    దారి తెలియంగ రాని ఎడారి లో బి
    దారి నాపుచు యాకలి దీరుటకును
    యాయ వారముజెసె లక్షాధి కారి
    4,వండుకొను వాని కంటెను దండుకొనుచు
    తిండి తినుటయే మేలన, పండితుండు
    యాయవారముజేసె.లక్షాధికారి
    యైన యే మాత్రమౌ బిడియమ్ము లేక

    రిప్లయితొలగించండి
  22. శ్రీ కెంబాయి తిమ్మాజీరావు గారూ

    ఏక చక్రపు పల్లె అనే ప్రయోగం సబబేనంటారా??

    రిప్లయితొలగించండి
  23. కెయెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    వే౦కట పతి యప్పు గొనె కుబేరుని కడ
    కాని తీర్చ లేకయె వడ్డి కాసులైన
    వద్ద జేరిన భక్తుల వద్ద నాహ
    యాయవారముజేసె.లక్షాధికారి

    రిప్లయితొలగించండి
  24. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి రెండు పూరణలలో అన్వయం కుదరనట్టుంది.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో శ్రీఆదిభట్ల వారన్నట్లు ‘ఏకచక్రపల్లె’ అని సమాసం చేయడం దోషమే... ‘రక్షణము పొంది యేకచక్రపురమందు’ అనండి.
    ****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు. సవరణను సూచించాను.

    రిప్లయితొలగించండి
  25. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  26. చి.కామేశ్వర శర్మకు ఆశీస్సులు ప్రజకు.నీకు నాభావము అర్ధమైతే చాలు అర్ధము కాకపోతే ఆప్రయోగము నిరర్ధకము
    స్వస్తి తిమ్మాజీరావు

    రిప్లయితొలగించండి
  27. శ్రీ తిమ్మాజీ రావు గారు ఆగ్రహించినట్లుంది.

    అయ్యా ఆ ప్రయోగం సాధువుకాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప మరోటి కాదు. మీకు మనస్తాపం కలిగించియుంటే మన్నించాలి.అర్ధవంతంగా ఉంటూ సశాస్త్రీయంగా ఉన్నప్పుడే అది పద్యం, కానప్పుడు పదం అని నా అభిప్రాయం.మరి మనం ఇక్కడ చేస్తున్నది పద్యరచనే కాని పద రచన కాదు కదా.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులకు ప్రణామములు పాండవులు ఏకచక్రము అనినపురములొ నివసించారు ఇక్కడ ఏక చక్రము అనునది సంస్కృత పదము కాదు ఊరిపేరు పురము నకు బదులుగా పల్లెయని సూచించాను దీనిలో
    బేసబబు గాని దుష్ట సమాసము గానిలేదు గురువర్యులస్పందన సమంజసము కాడు

    రిప్లయితొలగించండి
  29. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కాశియాత్రగ-పెళ్లిలోకలుగజేయు
    తంతుగమనించ?తప్పేమి?చింతగాదు
    యాయవారముజేసెలక్షాధికారి
    జీవితానికిగుర్తింపుభావనంబు

    రిప్లయితొలగించండి
  30. తిమ్మాజీ రావు గారూ,
    మీ ప్రయోగం ‘బేసబబు, దుష్టసమాసం’ అని చెప్తున్నందుకు మన్నించాలి.
    ‘ఏకచక్రము’ అనేది కచ్చితంగా సంస్కృతపదమే. ‘ఏకచక్ర’ అని విభక్తిప్రత్యయం లేకుండా ‘పల్లె’ చేర్చి సమాసం చేయడం దోషమే. శ్రీఆదిభట్ల వారికి మీపై వ్యక్తిగతవైరమేమీ లేదు కదా! సంప్రదాయకవిత్వాన్ని ఇష్టపడేవారు. సహృదయంతో దోషాన్ని గుర్తించి తెలియజేశారు.

    రిప్లయితొలగించండి
  31. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ఈ బ్లాగులో పద్యాలు వ్రాస్తున్నవాళ్ళలో ఎక్కువమంది ఔత్సాహికులే. వాళ్ళ పద్యాలలో ఎన్నో ఛందోవ్యాకరణదోషాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరి పద్యాలలో అన్వయం ఉండదుకూడా. అయితే ఒక్కొక్కరి పద్యాలలోని అన్ని దోషాలనూ పేర్కొని, సవరణలు సూచించాలంటే నాకు కష్టమే. అలా సూచించినా ఇప్పుడు క్రమంతప్పకుండా పద్యాలు వ్రాస్తున్న వాళ్ళలో చాలామంది ఎప్పుడో ‘ఎందుకీ తలనొప్పి’ అనుకొని పద్యరచనావ్యాసంగాన్ని వదలివేసేవారు. అందుకని నేను కొన్ని దోషాలను చూసీ చూడనట్టు వదలివేస్తూ ఉంటాను. సలక్షణమైన ఛందోబద్ధకవిత్వంపై ఆసక్తి ఉన్న సాహితీప్రియులు దోషాలను గుర్తించి తెలియజేసినప్పుడు సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నారు. మొన్నటివరకు పండిత నేమాని వారు బ్లాగుకు పెద్దదిక్కుగా ఉండి, నేను గుర్తించని లేదా వదలివేసిన దోషాలను మిత్రులకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడుకూడా శ్యామలీయం గారు, శ్రీఆదిభట్ల వారు, ఏల్చూరి మురళీధర రావు గారు, డా. విష్ణునందన్ గారు, చింతా రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు అప్పుడప్పుడూ బ్లాగులోని పద్యాల గుణదోష విచారణ చేస్తున్నారు కూడా! వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పద్యరచనను కొనసాగించడం యుక్తం.
    స్వస్తి!

    రిప్లయితొలగించండి
  33. కవిమిత్రులకు మనవి.

    లక్షణయుక్తంగా పద్యరచన చేయటం కత్తిమీదిసాము కాదు గాని క్రమంగా అటువంటి పరిస్థితి వస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణాలు రెండు.

    మొదటిది లక్షణయుక్తమైన పద్యం అన్నదాంట్లో గ్రాంథికభాష వినియుక్తం అవుతుంది. వ్యావహారికభాషను మనం హెచ్చుగా అదరించటం తప్పులేదు కాని గ్రంథభాషను విద్యార్థులకు అతిస్వల్పంగా పరిచయం చేస్తూ చులకన చేయటం అనేది మొదలై కొన్ని తరాలు అవుతున్నది కాబట్టి ప్రస్తుతం విద్యార్థులకే కాదు కొందరు ఉపాధ్యాయులకూ గ్రంథభాషమీద తగిన పట్టులేని పరిస్థితి. అందుచేత తెలుగు గ్రంథభాషను సరిగా అభ్యసించటం తగ్గటమూ, తత్కారణంగా ప్రాచీనం ఐపోతున్న తెలుగుగ్రంథాలను పఠించటం నామర్దా అన్న స్థితి రావటమూ కారణంగా గ్రంథభాషమీద ప్రజలకు పట్టు సడలి అటువంటి భాషలో వ్రాయటమే దుష్కరం ఐపోయిన రోజులు. ఇంక గ్రంథభాషలో పద్యాలు వ్రాయటం ఎంతో కష్టం అవుతున్నదని వేరే చెప్పాలా?

    రెండవకారణం. అన్ని విద్యలలాగే పద్య విద్యకూడా నిరంతరం పఠనమూ అభ్యాసమూ అనే ప్రక్రియల వలననే రాణకు వస్తుంది. ఆధునికకాలంలో పద్యం వ్రాస్తే దానిముఖం చూసే వారే కరవు. ప్రాచీన గ్రంథాలలో భాషాప్రయోగాలు జనవ్యవహారంలో నుండి చాలావరకు తొలగిపోవటంతో ఆసక్తి కలవారికీ వ్యాఖ్యానం లేకుండా చదువగలిగే పరిస్థితిలేదు. ఒకవేళ పట్టుదలగా కృషిచేదామన్నా లౌకికవృత్తులలో ఉండే తీవ్రమైన పని ఒత్తిడుల మధ్య సమయం ఎక్కడ? అందుచేత ఔత్సాహికులకు ఎంత సరదా ఉన్నా పద్యాలు వ్రాయటం అభ్యసించటం చాలా శ్రమతో కూడిన విషయం అని అంగీకరించక తప్పదు.

    గ్రంథభాషపట్ల పట్టు చిక్కించుకుందుకు కూడా కవిమిత్రులు ప్రయత్నాలను ముమ్మరం చేసిన పక్షంలో పద్యరచనకు మరింత దోహదకారి అవుతుంది. అందరూ గమనించాలని కోరుతున్నాను. (ఈ మాట చెప్పటం సులువే కాని అదంత సులభం కాదని తెలుసును. నేను ఎమెస్కోవారి వద్దనుండి ప్రబంధసాహిత్యం సంపాదించాను కాని చదవటం కుదరటమే లేదు!)

    ఈ‌ ఇబ్బందుల్ని ఎదురుకొంటూ పద్యరచన చేస్తున్నందుకు ఔత్సాహికకవి మిత్రులందరికీ నా అభినందనలు. అప్పుడప్పుడు నేనూ ఈ బ్లాగులో పద్యాలను నా శక్తిమేరకు పరామర్శించటం చేస్తున్నాను. ఇంకా తరచుగా చేయగలిగితే సంతోషించే మొదటి వాడిని నేనే. మళ్ళీ నా వృత్తిజీవితమే అది దుస్సాధ్యం చేస్తున్నది!

    పద్యాలలోని లాక్షణికతపై గుణదోషవిచారణలు కేవలం మన ప్రయోజనానికే కాని ఎవరి అల్పజ్ఞతనూ అక్షేపించే ఉద్దేశం ఉండదు ఎవరికీ. నాకు ఎన్నడూ అలాంటి ఉద్దేశం ఉండదు. ఎందుకంటే, నిజానికి నేను చెప్పుకోదగ కవినేమీ కాదు. వయ్యాకరణిని అసలే కాదు. ఛందోలక్షణవేత్తనూ కాను. కొంతమందికన్న గ్రంథభాషపట్ల పఠనాభ్యాసాల కారణంగా అబ్బిన కొంచెం పరిజ్ఞానం కలవాడిని మాత్రమే. మరి శంకరయ్యగారు తెలుగుపండితులు. మన తప్పొప్పులను భరిస్తూ ప్రోత్సహిస్తున్న శంకరయ్యగారి సహాయంతో మనం కూడా మనదైన భాషాధ్యయనకృషిని ఎలాగో అలా కష్టపడి ఐనా సరే జోడిస్తే త్వరలోనే మరింత లక్షణయుక్తమైన పద్యరత్నాలను ఈ బ్లాగులో తప్పక చూస్తామని నాకు నమ్మకం ఉంది.

    రిప్లయితొలగించండి
  34. సుకవి మాన్యులు - శ్రీ శంకరయ్య గారికి , అభివాదములతో-
    ఈరోజు శంకరాభరణంలో జరిగిన ' ఏక చక్ర ' శబ్ద చర్చ గమనించిన తరువాత ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నాను. మొదట గా మీరు - శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారు తమ పద్యంలో ఏక చక్ర పల్లె అని వాడినారనుకుంటున్నారు కానీ , నిజానికి వారు తమ పద్యంలో ఏక చక్రపు పల్లె అని వాడినారు తప్ప - ' ఏక చక్ర పల్లె ' అనలేదు .
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి అభ్యంతరము కూడా - ఏక చక్రపు పల్లె అనవచ్చునా అని మాత్రమే ! గమనించగోరుతున్నాను . ఏక చక్రమనే పేరు గలిగిన పురం ఏక చక్రపురమయ్యింది . విసంధిగా మరియు అలుక్సమాసమైతే , ఏక చక్రము పురము , ఏక చక్రము పల్లె కూడా అవుతుందని మీకు తెలియనిది కాదు. కర్మధారయమునందు మువర్ణమునకు పుంపులగు కనుక ఏక చక్రపు పురమూ, అదే విధంగా ఏక చక్రపు పల్లె కూడా న్యాయమే ! సాధ్యమే ! సాధువే !
    సాధుత్వమొక యెత్తు , శ్రవణ సుభగత్వం మరొక యెత్తు . కొన్ని పదములు నిర్ద్వంద్వంగా సాధువులైనా , శ్రవణ సుభగత్వ దృష్టీ, తదనుగుణైచ్ఛిక శబ్ద ప్రయోగ నిర్ణయమూ కవి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం !
    ఈ విషయములో మీ తీర్పును పునస్సమీక్షించగలరని విన్నపం ...

    రిప్లయితొలగించండి
  35. తే.గీ. దైవకృపవల్లనొకరుడు దైన్యుడయ్యు
    కొడుకులందరి చదివించి గొప్ప జేయ
    వారలప్పుడు లక్షల బడసి యున్న
    యాయవారము జేసె లక్షాధికారి .

    రిప్లయితొలగించండి
  36. తే.గీ. ఏక చక్రపురమునందు యేవురటుల
    పాండుసుతులును భిక్షాన బాపనలయి
    గడిపి రావిధి దీనంబు గాగ నౌర
    యాయ వారము జేసె లక్షాధికారి .

    రిప్లయితొలగించండి
  37. తే.గీ. యాయవారము నెత్తుచు నవని విభుని
    దయను నొకరుడు రత్నాల దానమంది
    లక్షలాదిగ ధనమును రయమునందె
    యాయవారము జేసె లక్షాధికారి .

    రిప్లయితొలగించండి
  38. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సర్వాపరాధిని! చెంపలు వాయించుకుంటూ మీమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకో గాని మీరు మీ పద్యంలో ‘ఏకచక్రపల్లె’ అన్నారన్న భావం ముద్రించుకుపోయి, అలా వ్యాఖ్యానించాను. మరొక్కసారి మీ పద్యాన్ని పరిశీలించాలన్న ఆలోచనే రాలేదు. డా. విష్ణునందన్ గారి వ్యాఖ్య చూసిన తరువాతగాని నా తప్పు నాకు తెలియలేదు. ఈ విషయంలో నన్న క్షమించమని మరో వేడుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  39. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  40. కవిమిత్రులకు విన్నపం...
    ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఎవరూ ‘గురువుగారు’ అని సంబోధించకండి. గురువుగా కాక కేవలం మిత్రుడుగా భావించండి. నన్ను సంబోధించవలసి వచ్చినప్పుడు ‘శంకరయ్య గారూ, మిత్రులు శంకరయ్య గారికి’ అని మాత్రమే వ్రాయండి. గురుస్థానానికి నాకు అర్హత లేదు. అంతటి పాండిత్యం, అనుభవం నాకు లేవు.
    మీరు కేవలం పూరణలు, పద్యాలను మాత్రమే పోస్ట్ చేయండి. వాటిముందు “గురుదేవులు శంకరయ్య గారికి ప్రణామములు, కవిమిత్రుల పూరణలు అలరించుచున్నవి. కవిమిత్రులకు నమస్కారములు..’ ఇటువంటివి వ్రాయవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  41. అదుపులేనట్టి ఖర్చుతో నాస్తులన్ని
    తరిగి పోవగ రయమున దారి లేక
    యాయ వారముఁ జేసె లక్షాధికారి
    చేతలే మనిషికి కడు చేటు దెచ్చు

    రిప్లయితొలగించండి
  42. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  43. గురువు గారు, పొరబాటు అన్నది సహజం. అంతమాత్రానికే మీరు
    అంతగా బాధ పడవలసిన అవసరం లేదని నా భావన.

    రిప్లయితొలగించండి
  44. చిన్న చిన్న పద్యములు వ్రాయటానికి యెంతో కష్ట పడే నాచేత సమస్యా పూరణలు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, దత్తపది వ్రాయగలిగే స్పూర్తి కలిగించిన గురువర్యులు మీరు. మిత్రులు అని నేను సంభోదించలేను. నిత్యము మీ శిక్షణ లోనున్న విధ్యార్థినే నేను. ప్రయాణంలో ఉన్నా రైలు స్టేషను లోనున్నా, బస్ స్టాండు లో ఉన్నా నెట్ సెంటరులకు వెళ్ళి శంకరాభరణం బ్లాగు ను వీక్షీంచందే, పద్యములు పోస్టు చేయందే నాకు నిద్దుర పట్టదు. దయచేసి మాసంబోధనలపై నిషిద్ధము విధించ వద్దని మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి