27, డిసెంబర్ 2014, శనివారం

పద్యరచన - 778

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. ఛాయను బట్టుక రాక్షసి
  మాయగ సంద్రమ్ములోకి మారుతి నీడ్చన్
  మూయక ముందే నోటిని
  కోయగ జీల్చెనుహనుమయె క్రోధము మించన్.

  రిప్లయితొలగించండి
 2. లంకనుచేరబూనుటకులౌఖ్యమునందునవెళ్లుచుండగా
  బింకమునందునన్ముసలిపీడగనిల్వగ?అంజనీసుతున్
  డంకమువంటిదౌడనిడ,డాంబికమంతయుచీల్చివేసిగో
  రంకెనలెక్కజేయకనురయ్యనవెళ్ళగనిచ్చబెంచెగా
  2రాక్షస-కృత్యముముసలిది
  దాక్షిణ్యతమానిచీల్చదౌడనుహనుమే
  నాక్షణమందునసవ్వడి
  పాక్షికమే|ప్రాణమణచెపావనసుతుడే

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  చిట్టచివర ‘పవనసుతుండే’ అనండి.

  రిప్లయితొలగించండి
 4. నింగి నెగెరెడు హనుమని నీడ బట్టి
  మింగ బోయిన "సింహిక" మీద కొరగి
  సాగ రమ్మున రక్కసిన్ సంహ రించి
  సేతు దాటెనా ధీరుడు సీత జూడ

  రిప్లయితొలగించండి
 5. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. కామరూపిణి సింహిక కాంచి హనుమ
  మంచి యాహారము దొరికె నంచు నెంచి
  వెంబడించెనాతని చాయ వెంట వేగ
  మ్రింగబోవుచు రక్కసి రేగ పైకి
  కడుపులోనికి వేచని గాలి పట్టి
  చీల్చి వేసెను తనువును శీఘ్రముగను

  రిప్లయితొలగించండి
 7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. కం. భీకర మర్కట యోధుడు
  ఆకరముననామకరము యాగడమాపన్
  సాగరమధ్యంబునుడువె
  రాకిక నాదారినడుమ రాక్షసభాతిన్.

  రిప్లయితొలగించండి

 9. హనుమంతుని కబళి౦చ౦
  గను నోటిని పెంచె సింహికపుదు కపివరు౦
  డణు రూపిగ మారుచు నో
  టను జొచ్చుచు చీల్చె నామె నాయువు పట్టున్

  రిప్లయితొలగించండి
 10. నేల పట్టిని వెదకుచు గాలిచూలి
  నింగి పైనుండి యెగరగా నీడ బట్టి
  మింగ బోయెడి సింహికన్ క్రుంగ దీసి
  సంహరించెను హనుమయె సాగరమున!!

  రిప్లయితొలగించండి
 11. హనుమ|నెదురించసాధ్యమా?నధమమైన
  ముసలిదౌడనుచీల్చెనుమోదమందు
  బలముదెలియనిడైచచ్చిబడెనుచూడ
  చిత్రసేమగనిలచెవిచిత్రమట్లు

  రిప్లయితొలగించండి
 12. పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘యోధుం| డాకరమున...’ అనండి. పద్య/ వాక్య ప్రారంభంలో తప్ప మధ్యలో అచ్చులు రాకపోవడం మన సంప్రదాయం.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వ్రరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మాస్టారు ! పిరాట్ల ప్రసాద్ గారి పద్యము మూడవపాడం లో ప్రాస తప్పినట్లున్నది

  రిప్లయితొలగించండి
 14. కం. భీకర మర్కట యోదుం
  డాకరముననామకరము యాగడమాపన్
  నాకడ లినడుమ ననుడువె
  రాకిక నాదారినడుమ రాక్షసభాతిన్.

  శంకరయ్య గారు మరియు చంద్రమౌళి సూర్యనారాయణ గారు ఇప్పుడు ఓకేనా ?

  రిప్లయితొలగించండి