9, డిసెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 760

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. పడగ విప్పిన నాగన్న పడగ జూచి
  భయము లేకుండ నుండెను బాలి క యట
  నవ్వు చుండెను పైగను నగము జూచి
  యెంత ధైర్య మో1 యామెకు నీ వ యసున .

  రబ్బరు పామై యుండును
  నబ్బా! ,యది లేని యెడల నటులుగ నగుచు
  న్నబ్బాలిక యుండునె మఱి ?
  యబ్బా యని యఱవకుండ హాయిగ నచట న్

  రిప్లయితొలగించండి
 2. పెదవుల్ విచ్చుచు నవ్వులన్ కురిసె నిర్భీతిన్ గనెన్ సర్పమున్
  మదిలో లేశపు మాత్ర శంకగన,మమ్మాయే నటించెన్ గదా
  ముదమున్ గూర్పగ చిత్రమందు నటి తా ముద్దార నప్పాత్రలో
  యొదిగెన్ చక్కగనంచు నెల్లరట నొహ్హోయంచు శ్లాఘింపగాన్.

  రిప్లయితొలగించండి
 3. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ మత్తేభవిక్రీడితం చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. నమ్మ వలదు తల్లీ అది నాగు పాము
  బేల వైదరి చేరగ భీతి లేక
  కాటు వేసి విషము నింత కక్క గలదు
  దుష్ట జీవులనెప్పుడూ దూర ముంచు

  కోర లన్నియు పీకగ కోడె త్రాచు
  నాద సుర వాదన ములకు నాట్య మాడు
  శబ్ధ గతిపోల్చి తిరుగాడు సర్ప జాతి
  పాము లకు జెవులుండవు పాట వినగ
  Snakes have no visible ear, so they don't hear sounds as we do. But it's not quite right to say that snakes are deaf. They have vestiges of the apparatus for hearing inside their heads, and that setup is attached to their jaw bones, so they feel vibrations very well and may hear low-frequency airborne sounds.
  Do Snakes Have Ears? - LiveScience
  www.livescience.com/32252-do-snakes-have-ears.html

  రిప్లయితొలగించండి
 5. చిఱునగవుల చిందించుచు చిత్రముగను
  పాప తానాడు చుండెను పాము తోడ
  పట్టెడన్నము గొనగను పొట్ట కొరకు
  కోటి విద్యలు నేర్చుట కూటి కొరకె

  రిప్లయితొలగించండి
 6. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యాలు, వివరణ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘ఎప్పుడూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘ఎప్పుడు/ ఎప్పుడున్’ అనండి.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. పడగెత్తిన నాగుంగన
  దడబుట్టును గుండె జారి తత్తర రేగన్!
  తడబడక నవ్వు మోమున
  పొడజూపెను! నాగ కన్య పూర్వపు జన్మా?

  రిప్లయితొలగించండి
 8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ఆగునుగద నెవరైనను
  నాగును జూడంగ బెదరి, నగుమోముననే
  బాగున భయమేలేకను
  సాగిలబడి ప్రక్కబండె సాహస బాలౌ !

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పాముని చూచుచు జడవక
  సేమముగా చెంతనుండె చిన్నది నగుచున్
  యేమా? ధీమా బాలా?
  గోముగ మరి నుండతగదు గోకర్ణముతో!!!

  రిప్లయితొలగించండి