28, డిసెంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 779

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

 1. చిట్టి చేతిలోన రొట్టె ముక్కను పట్టి
  బోసినవ్వు తోడ బుజ్జిబాబు
  కొంచెమయిన తినుము గోమాత నీవని
  రొట్టె గోవు నోట పెట్టుచుండె

  రిప్లయితొలగించండి
 2. ధేనువును సదా పూజించు దేశమందు
  నన్న మిడుచుండె బాలకు డాదరముగ
  చిన్న తనమునుండి పెరిగి యున్నతముగ
  మంచి మనిషిగ బుడుతడు మహిని వెల్గు

  రిప్లయితొలగించండి
 3. బాల్య మందు కలుగు భావమ్ము ముఖ్యమౌ
  పెంపు బట్టి ఒంపు సొంపు లొచ్చు
  పంచి ఇచ్చు గుణము పరమ పవిత్రమ్ము
  మూగ జీవి రక్ష మోక్ష మొసగు

  రిప్లయితొలగించండి
 4. సొంత లాభమ్ము స్వార్ధమ్ము కొంత మాని
  ప్రక్క వానికి కొంచము పంచ వలయు
  బాలు డైవీడు చేతతో పలికి నాడు
  మార్గ దర్శకులువలయు ! మాట లేల ?

  రిప్లయితొలగించండి
 5. నీయమ్మ పాల నిచ్చెను
  నాయమ్మయె నాకునీయ నాపాలాయెన్
  మాయమ్మ రొట్టెనిచ్చెను
  నీయాకలి దీర్చనిత్తు నీ పాలిదిగో !  రిప్లయితొలగించండి
 6. అమ్మవంటి ధేనువచట నాగి జూడనార్తిగన్
  కమ్మనైన రొట్టె బెట్టె కరుణ తోడ బాలుడే
  గుమ్మ పాలు బట్టె నాకు కోరికోరి నమ్మయే
  నెమ్మదించు నాకలింక నీకు కూడ నేస్తమా!!!

  రిప్లయితొలగించండి
 7. పాపరోట్టెముక్కపంచెడి-ప్రేమను
  గుర్తుబెట్టుకొనుముగోవునీవు
  నన్నచందమందునాబాలునేజూడ?
  చిన్నికృష్ణుడనుచుజెప్పవచ్చు|
  2కట్టేయనిగోవునిగని
  రొట్టేయగ,బాబువచ్చి,రోదనవిడిచే
  పట్టుగదినిపించుటలో
  నట్టిట్టుగఅమ్మకంటెనధికుడిజూడన్

  రిప్లయితొలగించండి
 8. 3రొట్టియుఅమ్మనాకొసగెరోదిలుచుండగ,నేనునీకునా
  రొట్టెనుబంచ?పాలిడుమురోషముమానెద,గోవుపూజనే
  నెట్టులొచేయలేను|గదనేస్తములాగుననేనునీకులో
  గుట్టుగనిచ్చెదన్తినుముగుర్తిడునీపసివాడి-ప్రేమయున్

  రిప్లయితొలగించండి
 9. పాలను ద్రావు ప్రాయమున వాకిట నిల్చిన యావు జూచుచున్
  బాలుడు రొట్టె నోటనిడి బాగుగ నాకలి దీర్చుచుండగా
  బేల తనమ్ముతో పశువు బిడ్డడు పెట్టిన రొట్టె నెంతయో
  మేలని నోటబెట్టుకొని మిక్కిలి ప్రేమగ మ్రింగుచుండెగా!

  రిప్లయితొలగించండి
 10. తాను దిను రొట్టెముక్కను
  దేనువు కతి ప్రీతి తోడ తినిపించెడి యా
  మానవ బాలుని నైజము
  గానగ మదిలోజనించు కరుణాంకురముల్

  రిప్లయితొలగించండి
 11. తాను దిను రొట్టెముక్కను
  ధేనువు కతి ప్రీతి తోడ తినిపించెడి యా
  మానవ బాలుని నైజము
  గానగ మదిలోజనించు కరుణాంకురముల్

  రిప్లయితొలగించండి
 12. పసితనమునందె యొరులనుఁ
  గసరుకొనక చేతిలోన గలదెల్ల నదో
  యొసగెడు బాలునిఁ గన్నన్
  ముసిముసి నగవులు విరిసెను మోములు గనుడీ!

  రిప్లయితొలగించండి
 13. పద్య రచన

  గోవుని మాతగా కొలిచి కూరిమి పెంచిన భారతావనిన్,
  ఆవున సర్వదేవతలు ఆదర మొప్ప వసింతు రన్న యీ
  భావన గల్గి నట్టి మన పావన దేశము నందు,పాపలున్ సేవలొనర్చి రొట్టియ భుజి౦పగ నిచ్చుట సాజమే గదా

  రిప్లయితొలగించండి
 14. చిన్ని బాలిక బ్రేమను నెన్న దరమె ?
  గోవు నోటికి రొట్టెను గోము గాను
  బెట్టు చుండెను, నాపాప చిట్టి మనసు
  నెంత గొప్పదో యూహించు మీ శు పుత్ర !

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులకు నమస్కారములు . గురువర్యులు శంకరయ్య గారు హైదరాబాదు వెళ్ళుట వలన ఈరోజు మిత్రుల పద్యాలను సమీక్షించలేక పోవుచున్నారు. దూరవాణి ద్వారా ఈ సందేశాన్ని తెలియచేయు చున్నారు

  రిప్లయితొలగించండి
 16. మమతలుమాయబోనిపరమాత్మలుబాలురుజూడముచ్చటే|
  తమతమబేధమెంచకనుతాత్వికవేత్తగబాలకుండు|తా
  శ్రమలనులెక్కజేయకనుసర్వులకాకలినొక్కటంచు,నా
  క్రమమునుగుర్తెరింగితమకమ్ముననావుకురొట్టెనిచ్చెగా

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు మన బ్లాగుమిత్రులు గన్నవరపు నరసింహ మూర్తి గారి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరబాద్ వెళ్ళి ఇప్పుడే తిరిగివచ్చాను. అక్కడ గన్నవరపువారి ఆతిథ్యం, చింతా రామకృష్ణారావు గారు, వసంత కిశోర్ గారలతో ఆత్మీయవాతావరణంలో గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రయాణపు టలసట (ముఖ్యంగా తిరుగుప్రయాణంలో రైల్లో మూడుగంటలు నిల్చుని ఉండడం) వల్ల మీ పూరణలను, పద్యాలను పరిశీలించలేకపోతున్నాను. మన్నించండి.
  ఈనాటి చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలను రచించిన మిత్రులు.....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి.
  శైలజ గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  లక్ష్మీదేవి గారికి
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి