30, డిసెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 781

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. నింగిని యా సూర్యుండును
    క్రుంగెను శ్రీఘ్రమె సరంగు గూటికి జనుమా
    కంగారు పడుచు నీసతి
    బెంగగ యాతీరమందు వేచును గదరా

    రిప్లయితొలగించండి
  2. పడమట సంధ్యా రాగము
    కడలిని కవ్వించి నంత కలవర పడగన్
    పడవయె తీరము సాగిన
    గుడిసెను జేరంగ వచ్చు గువ్వల చెన్నా

    రిప్లయితొలగించండి
  3. తెల్ల వారక ముందరే తెప్ప వేసి
    కడలి తల్లికి మ్రోక్కుచు సడలు యతడు
    ఆటు పోటుల కష్టము పూట పూట
    పట్టె డన్నము కోసమే పాటు లన్ని

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పద్మ భంధుడు క్రుంగగ పశ్చమాద్రి
    కాంత దిన వెచ్చముకొరకు కాచు కొనగ
    వేటమాని కలము త్రిప్పి బెస్త వాడు
    నెలవు చేరుచు నుండెను జలము వీడి

    రిప్లయితొలగించండి
  6. మత్చకారులబ్రతుకులుమలుపులేక
    సాంద్రమందునపడవలాసాగుటెంత
    కష్టనష్టమొ|గమనించుకాలమున్న?
    సృష్టినాభరణాల-నదృష్టపుష్టి

    రిప్లయితొలగించండి
  7. ఎంత మనోజ్ఞము! చిత్తరు
    వంతయు పాకినది పసిడి వర్ణము! వడిగా
    కాంతనుఁ జేరగ పడవను
    సుంత రయముగఁ జను బెస్తు జోరును గనుమా!

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శిరసును దించెను భానుడు
    కరగే వెలుగంతదెసల కమ్మెను తమమే
    మరకాడు పడవ నడుపుచు
    దరి జేరగ రేవువైపు తరలుచు నుండెన్!!!

    రిప్లయితొలగించండి
  10. మడమటి కొండల చాటుకు
    కడు వడిగా నరుగుచుండె కమలాప్తుండున్
    తడవేల తమము మూగును
    కడలి తటమ్ము నకు జేర్చు పడవ సరంగా !

    రిప్లయితొలగించండి
  11. పడవలవంటిజీవనముభాధ్యతచేతనుముందుకెల్ల|నీ
    నడవడికందుమార్పులిడ?నాణ్యతదగ్గ?తుపానురీతిగా
    గడుపుటకష్టమైన?తమగమ్యముజేరగసూర్యకాంతియే
    వడివడినింటికెళ్లేనుసవాసమువీడినివాసమెళ్లుమా

    రిప్లయితొలగించండి
  12. కె యెస్ గురు మూర్తి ఆచారి గారి పద్యము
    జలపుష్పమ్ముల బట్ట బెస్త నదిలో సాయంత్రమున్ దాక ని

    ష్ఫలమౌ యత్నమ్మొనర్చి వేసరి నిటుల్ భావించె దుఃఖమ్మునన్
    మలపన్ మంచిది నావ నింటి కయినన్ మర్నాడు పూటెట్టులో
    తలపన్ గుండె గుభిల్ల్లనున్ కనవె మా దౌర్భాగ్యమున్ గంగమా

    రిప్లయితొలగించండి
  13. 2వెలుగులవేడుకల్దరిగెవిశ్వముసాకెడిలోకభందువే
    నలిగినరీతివెళ్లుటచె\నాశయసిద్దియుసన్నగిల్లగా
    మెలికలుమత్స్యకారునికిమిక్కిలినష్టముతెడ్లువేయుచున్
    పిలువకెనింటికెల్లమనిపేదకుదెల్పినరీతిచిత్రమే|

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి