కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
హరహర శంభో శంకర !
రిప్లయితొలగించండికరి వరదుని సేవ సేయ గలుగు నిడుములే
గరముగ, ననుచును బలికిరి
సరియా ? మఱి జెప్పు సామి ! సరికా దనుచున్
వరములనిచ్చును భక్తిన్
రిప్లయితొలగించండికరివరదుని సేవ సేయఁ -గలుగు నిడుములే
మురియుచు సుఖభోగంబుల
పరమాత్ముని మరచినట్టి పాపాత్ములకున్
అరమరిక లేని దైవము
రిప్లయితొలగించండికరములు జోడించి గొలువ కరుణా మయుడౌ
నిరతిశయ భక్తి లేనిదె
కరివరదుని సేవ సేయ గలుగు నిడుములే
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది.అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెరవెనుకొక భాగవతము
రిప్లయితొలగించండితెరముందుకొటియు నడిపిన తేలును నిజమే
భరియించిన దుర్గుణముల్
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.
తొరలన్నియు దొలగించును
రిప్లయితొలగించండికరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
నిరతము భక్తిని గొల్వక
దురితమ్ములు సేయునట్టి దుర్మార్గులకున్!!!
మరి నేనే గొప్పనుచును
రిప్లయితొలగించండివిరివిగ పాపాలు భువిని - విజ్ఞత లేకన్
సరి వదలుచు హరి ! హరి ! హరి
కరివరదుని సేవ - సేయఁ గలుగు నిడుములే.
సురలోక ప్రాప్తి గలుగును
రిప్లయితొలగించండికరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే
హరిదూషణమ్ముఁ జేయుచు
పరిపరివిధముల పరులను వంచించినచో
నిరతము తననే గొలువగ
రిప్లయితొలగించండిపరీక్ష జేయంగ నెంచి పరిపరి విధముల్
గురిజేయగ కష్టములకు
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే!
కరుణాకరు సుర ,నర,ముని
రిప్లయితొలగించండికరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
సరవిన నున్న దొలగు శ్రీ
హరి నామము మరవ బోకు మయ్యా! మదిలో.
పరధనము దొంగిలించుచు
రిప్లయితొలగించండికరివదనుని సేవ సేయఁ గలుగు నిడుములే
నిరతము సత్యము పలుకుచు
సరసిజ గర్భుని గొలిచిన స్వర్గము కలుగున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలో మూడవపాదాన్ని ‘హరభక్తు లందు రిట్టుల’ అని మార్చితే అన్వయం కుదిరి ఇంకా బాగుంటుందని నా సలహా.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘గొప్పయనుచు’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఅరయగ నున్నతమగు నా
పరమ౦బును జేరునట్టి వాంఛ గలిగినన్
వరమగు నధిరోహిణియౌ
కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు
పరమ పద పటము నందున
వరుసగ నిచ్చెనలు యుండు పాములె యధిక
మ్మరయగమ్రింగును పాములు
కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిగురువు గారు పరీక్షలు ముగిసినవి కాస్త ఖాళీ సమయము దొరకినదండి. తప్పులు దొరలునన్న భయముతో ఇన్ని రోజులు క్షణమొక యుగము వలె గడచినదండి.
అందరికి వినమ్రవందనములతో..
==============*============
నరులు చెప్ప నలవి గాని సిరులు గురియు
చిత్తమున కరి వరదుని సేవ సేయ,
గలుగు నిడుములే నన్నిట ఖలుని జెంత
జేరి కాటి కాపరి వంటి సేవ జేయ!
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కందుల వరప్రసాద్ గారూ,
చాలా సంతోషం.
కందపాద సమస్యకు తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె ఈశ్వరప్పగారి పూరణ
రిప్లయితొలగించండిహరి భజనను విడనాడీ
తరుణమున౦ దీవు తండ్రి దండించు సుమా
గురువనె ప్రహ్లాదునితో
కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారు కందము లోని ప్రాస కన్న తేట గీతి లో త్వరగా వ్రాయగలనని పించింది అంతే
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరి వరదుని సేవ మఱచి
రిప్లయితొలగించండివరదుని బేకరిని జేర వరపుత్రుని తా
నరహరి తండ్రియనెను బే-
కరి వరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.
‘శీనా’ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది.అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో :
01)
________________________________
కరుణాత్ముడు శితికంఠుడు
కరిచర్మము గట్టువాడు ♦ గంగాధరుడే
కరుణించును ప్రార్థించిన !
కరివరదుని సేవ సేయఁ ♦ గలుగు నిడుములే !
________________________________
వరులౌ త్యాగయ పోతన
రిప్లయితొలగించండికరమౌ ప్రహ్లాదు డిలను కలిగిన భక్తిన్
కరమౌ కష్టము లందరె
కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
గరువము వీడిన యపుడే
శరణమ్మను వారి గాచు సర్వేశు డిలన్
కరిబల ముడుగన్ గాచెను
కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
హరి భక్తు లెలమి కోరరు
సిరులను,హరియే శరణని చెందగ నార్తిన్
హరి వారి గాచు కడకును
కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
నరులే కొలువగ హరినే
హరి వారి పరీక్ష జేసి,యంతము నందున్
వరదుడు గాచును కనగా
కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
నరులిల భక్తిని యాత్రల
కరమగు కష్టముల నంది కాంతురు హరినే
తిరముగ కాచును నపుడే
కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పరుగున వేంచేయు నతని
రిప్లయితొలగించండికరుణల నాశించువారి కాచెడు వానిన్
సిరిమా తల్లికి పతియౌ
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే?
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
రిప్లయితొలగించండినిరతము కడు భక్తి గలిగి
కరి వరదుని సేవజేయ కడతే రిడుముల్
మరి యెట్టుల నుడివెదరే
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే?
పరగడుపు పూజ చేయక
రిప్లయితొలగించండివిరివిగ దోశెలు తినుచును వినకయె కథలన్
పరిపరి గుంజీలిడకయె
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే
కరచుచు తల్లిని తండ్రిని
రిప్లయితొలగించండిబరువుగ పెండ్లాముకిడగ బంగరు గాజుల్
తరచుగ జేయుచు నప్పుల్
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే