18, డిసెంబర్ 2014, గురువారం

పద్యరచన - 769 (కర్ణుఁడు లేని భారతము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచన శీర్షికకు అంశం 

‘కర్ణుఁడు లేని భారతము’

15 కామెంట్‌లు:

  1. భారతమందున కర్ణుడు
    ఘోరాన్యాయంబు నొందె కుంతికి సుతుడై
    కారణములెన్నియో గల
    వా రాధేయు మరణమునకవలోకించన్

    రిప్లయితొలగించండి
  2. రమ్య ! కర్ణుని లేనిభా రతము నాకు
    వినగ రాలేదు నెచ్చట వీను లకును
    చిత్ర మందున జూడుము చిత్ర ము వలె
    కర్ణు డచ్చోట నర్జును గాం చు చుండె

    రిప్లయితొలగించండి
  3. సూర్య పుత్రుడై యుండియు సూతు డనిరి
    కుంతి జేసిన పొరబాటు అంత మనక
    శక్తి యుక్తులు గలిగియు శాప ములవి
    కట్టి కుడిపెను వెన్నంటి కర్ణు నపుడు

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కర్ణుడే లేని భారతం - కాంచగలమె :

    01)
    ________________________________

    రారాజు :
    అస్త్ర విద్యను నర్జును - నడ్డు కతన
    నంగరాజును గావించి - నతని మెచ్చి
    సోదర సముడ వని రాజు - సూత పుత్రు
    గాఢముగ కౌగలిని కట్టి - గారవించె !

    కర్ణుడు :
    పరువు నిలిపిన రారాజ - ప్రాణమిత్తు
    నన్ను నమ్ముము నర్జును - నాజి యందు
    నాశ మొనరింతు తప్పక - నమ్ము చేత
    ననుచు కర్ణుడు రాజు నా - నంద పరచె !

    రాయబారము :
    కర్ణుడున్నాడు విజయుని - కడపు కొరకు
    యుద్ధమందున విజయమ్ము - సిద్ధమనుచు
    రాయబారపు కృష్ణు, ని - రాకరించి
    కయ్యమునకయి రారాజు - కాలుదువ్వె !

    యుద్ధము :
    కవచ కుండల లేమియు - కారణమవ
    పరశురాముని శాపపు - మరపు చేత
    పెక్కు భంగుల కలకలన్ - వీరుడయ్యు
    కాలధర్మము నొందెను - కర్ణుడంత !

    పాండవుల నాజి నెదిరింప - బలము లేక
    కర్ణు నండను గాదొకొ - కాలుదువ్వి
    కడకు నశియించె రారాజు - కదనమందు !
    లేదు యుద్ధము రవిజుడు - లేనియెడల
    కర్ణుడే లేక, భారత - కథయె లేదు !
    ________________________________

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    జయమగుకర్ణునిశౌర్యము
    నియమంబునభారతాననిలచినఫలమా
    మయసభదుర్యోధనుడిగ
    బయటికితనవంశమేదొపలుకగలేడే
    2తల్లికికర్ణునూహనొకతల్లడమైననుచెప్పలేదు-తా
    నెల్లనుగుర్తెరింగితననెవ్వరొచెప్పుటకొప్పలేదుతా
    చెల్లనివాడెకౌరవులచెంతనపొంతనలేనివాడుగా
    కల్లలుసర్దిజెప్పుటచెకర్ణుడుభారతమందుమాయయే

    రిప్లయితొలగించండి
  7. పెద్దలందరికి నమస్కారం. అనుమానం వచ్చి అడుగుతున్నా మన్నించాలి.

    "కర్ణుని లేని భారతం" అన్నారు, ఈ ప్రయోగం సరయినదేనా? డు,ము,వు, లు ప్రధమ కదా! అందు, న సప్రమి కదా! ఇక్కడ ప్రయోగం లో ప్రధమగా కర్ణుడు లేని భారతమనాలా కాదా? దయచేసి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  8. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    శర్మ గారూ,
    దోషాన్ని గమనించి తెలుయజేసినందుకు ధన్యవాదాలు.
    నిజానికి పద్యరచనకు మొదటి ఇచ్చిన శీర్షిక ‘కర్ణుని తల భారతం’ అని.. దానికంటే ‘కర్ణుఁడు లేని భారతం’ బాగుంటుందని తల తొలగించి లేని టైప్ చేశాను. ‘కర్ణుని’ని ‘కర్ణుఁడు’ గా మార్చడం మరిచిపోయాను. మన్నించండి.
    ఇప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సవరిస్తున్నాను. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  9. గురువులు శంకరయ్య గారికి మరొక సారి వందనం.

    ఇది ’తప్పని’ ఎత్తి చూపడం కాదండి. నాకు వచ్చిన అనుమానం తీర్చుకోడానికే అడిగాను. ఈ ప్రయోగానికి ఏదేని విశిష్ఠత ఉందేమో తెలుసుకోవానుకున్నానంతే. మరొక సారి మన్నింపు కోరుతున్నా. నా అనుమానం తీర్చినందుకు మరో సారి నమస్కారం.

    రిప్లయితొలగించండి
  10. కర్ణుడు లేని భారతము గల్గదు వచ్చెడు కల్పము నందు గూడ నే
    దుర్ణయముల్ ఘటించు నతిదుండగుడై కురురాజు చంద్రవంశదు
    గ్ధార్ణవమెండ వాని వెనుకన్ నిజకిల్బిషబుధ్ధివిహ్నిను
    త్కీర్ణుత కర్ణుడుండక యదెట్టుల ఘోరరణంబు బుట్టెడిన్?

    రిప్లయితొలగించండి
  11. శ్యామల రావు గారూ,
    కర్ణుని ప్రాముఖ్యతను తెలుపుతూ అద్భుతమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    మొదటి రెండు పాదాలు చదివి ఇదేదో విశేషవృత్త మనుకున్నాను. చివరి రెండు పాదాలను చూసి పై రెండు పాదాలలో ‘భగణం’ ఎక్కువైనట్లు గుర్తించాను. సవరించండి.

    రిప్లయితొలగించండి
  12. శంకరయ్యగారూ కొంచెంపరధ్యానంలో వ్రాసానండీ, అందుకే సరిగ చూసుకోలేదు. సరిజేసిన పద్యపాఠం:

    కర్ణుడు లేని భారతము గల్గదు కల్పశతంబునందు నే
    దుర్ణయముల్ ఘటించు నతిదుండగుడై కురురాజు వంశదు
    గ్ధార్ణవమెండ వాని వెనుకన్ నిజకిల్బిషబుధ్ధివహ్నిను
    త్కీర్ణుత కర్ణుడుండక యదెట్టుల ఘోరరణంబు బుట్టెడిన్?

    రిప్లయితొలగించండి
  13. శ్యామల రావు గారూ,
    ‘ప్రమాదో ధీమతామపి’ అని ఊరకే అన్నారా పెద్దలు?
    సవరించిన పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. అదె భారత మనదగునే?
    విధేయతనెడు చిరునామ వీడగ కథలో!
    అదె భారత మనదగునే?
    మధురిపు మురిపించు దాత మాన్యత మఱువన్!

    సంచితమాయెను పుడమిని
    యంచితముగ సర్వ ధర్మ పంతును దెలుపన్!
    తుంచగ నేమాత్రంబును
    పంచమ వేదమనలేని 'భార 'తమమరున్!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి