26, డిసెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 777

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. నల్లని బట్టలు వేసిన
  తల్లీ నీభక్తి జూచి దైవము కరుణన్
  జల్లగ జూచును నీకే
  వల్లడి రాకుండ గాయు పరమేశుడికన్

  రిప్లయితొలగించండి
 2. కల్లా కపటము తెలియని
  తెల్లని యాపాప మనసు దీక్షను బూనెనన్
  చల్లని నీటను మునుగుచు
  వెల్లువ గాపొంగు భక్తి వేల్పున కనుచున్

  రిప్లయితొలగించండి
 3. స్వామి యయ్యప్ప దీక్షలో సదరు పాప
  చూడ ముచ్చట గొలిపెను జూడు డా ర్య !
  భక్తి భావము గలుగుట పాపకరయ
  పూర్వ జన్మపు సుకృతము పొందె నేమొ ?

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది.అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘సదరు’ తెలుగు పదం కాదు. అక్కడ ‘చంటిపాప’ అందామా?

  రిప్లయితొలగించండి
 5. శరణముదేవదేవయనిశాంతి-ప్రదాతనుబాలికెంచగా
  వరములవంటిజీవితమువన్నెలుగూర్చకనుండబోడు|తా
  కరుణయెజీవితాంతసుఖకారకమౌనుగ?డైవదీవెనల్
  మరచినమానవాళికిది.మంగళమేగదదీక్షదక్షతల్|
  2మకర-జ్యోతినిగనగల్గుమంకుపట్టు
  భక్తిభావంబుగలిగించుశక్తియుక్తి
  శరణమనగానె?నయ్యప్పశాంతమిచ్చి
  దీక్షగలిగించె|బాలికాదీప్తిబెంచ|

  రిప్లయితొలగించండి
 6. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘బాలిక + ఎంచగా’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘బాల యెంచగా’ అనండి.
  రెండవ పద్యంలో ‘మకరజ్యోతి’లో ‘ర’ గురువై గణభంగం. ‘మకరశోభను’ అనండి.

  రిప్లయితొలగించండి
 7. ఏమీ తెలియని వయసున
  స్వామీ! చిన్నారి తపన స్వార్ధ రహితమే!
  హామీ అయ్యప్పే మరి !
  నోముల మొక్కుల ఇరుముడి నొప్పులు తనకే!!

  రిప్లయితొలగించండి
 8. అల్లరి వయసున పాపా !
  నల్లని దుస్తులను దాల్చి నావుగ దీక్షన్
  నల్లని తెల్లని దేవుల
  చల్లని సుతుడేమొ నిన్ను చక్కగ జూచున్.

  రిప్లయితొలగించండి
 9. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ఏమియు’ అనండి.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. భక్తి భావము తోడను పసిడి పాప
  దీక్షగొనె హరిహర సుతు రక్షఁగోరి
  యెట్టి కోర్కెలఁగోరెనో చిట్టితల్లి
  కామితములిచ్చి యయ్యప్ప కాచు గాత

  రిప్లయితొలగించండి
 11. సిసిరమందునచలిగిలిచెదిరిపోయె
  నల్లదుస్తులుమనసునుతెల్లబరచె
  దలచనిరుముడిభక్తినితలపుకుంచె
  స్వామినయ్యప్ప-బాలికాసంబరంబు

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి