చల్లా రామలింగ శర్మ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవపాదంలో, మూడవ పాదంలో ‘వేడ్క’ అన్నచోట కవర్గాక్షరముల ప్రయోగించడం వలన నిషిద్ధాక్షరి నియమోల్లంఘన జరిగింది. సవరించండి. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
Guruvu garu mee blog chaalaa chaalaa bagundi. Mee blog choosi anandamu vesindi.
Guruvu garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.
Guruvu garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.
డొక్కా శ్రీనివాస్ గారూ, మీ బ్లాగు వీక్షించాను. మీ కృషి ప్రశంసనీయం. మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారములు నిన్న వ్యస్తాక్షరిలో పాల్గొని - నిబంధనలు సరిగా గమనించక ఒక పద్యం పోస్ట్ చేశాను. అందుమీద మీరు స్పందించారు కూడా. నాకు ఈ బ్లాగుల్లో పొస్ట్ చేయడం కొత్త కావడం వల్లనో యేమో, ఆ పద్యం తీసివేసినట్లున్నాను. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసిన పద్యమే! ********* నేడు నరరూప రాక్షస నేత లగుచు కరకు గుండెల కినిసి నిష్కారణముగ నిరప రాధుల వేడ్క వధించి చంపు ఉగ్రవాదుల నిరసింతు రూరు వాడ *********
మానవత్వము మదిలోన మరచిపోయి
రిప్లయితొలగించండిపిచ్చి సిద్ధాంత ములతోడ రెచ్చిపోయి
మృత్యు దేవత దూతల మించినావు
తీరు యెపుడైన మారునా తీవ్రవాది
తీవ్ర వాదము ధ్యేయమై తీవ్ర వాదు
రిప్లయితొలగించండిలుర్వి బ్రజలను హింసించు టొప్పటంచు
చంపు చున్నారు దయలేమి సామి ! వారు
ప్రభుత మీదున్న రోషా న ప్రబలి పోయి
మనిషి మనిషిని చంపెడు మమత లేని
రిప్లయితొలగించండిపదవు లుండిన చాలును యెదను మెండు
తీవ్ర వాదులు నిండిన తేరు పైన
సాహ సంబున పయనించి సమసి పోవ
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
పాకిస్థాన్ లో ఉగ్రవాద చర్యకు బలైన చిన్నారులకు ఆత్మశాంతి కలుగు గాక !
ఉగ్రవాదము - ఉగ్రవాదులు :
01)
_________________________________
మారణాయుధము లనిన - మమత తోడ
హింస చేయుట యందదె - హితము హెచ్చి
బేలలైనట్టి వారల - వేటలాడి
యముని భటులను తలపించు - నట్టివారు
తీవ్రవాదులమను పేర - తిరుగుచుంద్రు !
పట్టి నిలబెట్టి తల తీయ - వలెను వారి
శాంతి భువిపైన స్థాపించ - సత్వరంబు
_________________________________
ఆరువిధముల బలమైన యరులపాలి
రిప్లయితొలగించండిబడినవారౌచు జనులను బాధవెట్టి
బడయుసంపదలవియెల్ల పాపమంచు
నేర్వలేని తనమ్మున నిపుణులయ్యొ!
మానవత్వము నశియించి మతియె దప్పి
రిప్లయితొలగించండిదానవత్వము ప్రబలెను ధరణి లోన
మమత దయలను బూయించి మట్టి మీద
తీవ్రవాదము సమయించు తిరుమలేశ!!!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండి1విలువలుంచెడివలువలువలదటంచు
విడచినడచెడిరీతిగా'విద్యయుండి
తీవ్రవాదంబునెంచెడితీరుజూడ
సప్త-వ్యసనాలవంటిదేసాధనంబు
2మానవాళియుతెలివంతమయమేన
అడవులందుననివశించునదురుయేల
పడవులుండియులంచాలుబట్టినపుడె
వాదనాదంబుబుట్టునుపాపమదియె
చల్లా రామలింగ శర్మ గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో, మూడవ పాదంలో ‘వేడ్క’ అన్నచోట కవర్గాక్షరముల ప్రయోగించడం వలన నిషిద్ధాక్షరి నియమోల్లంఘన జరిగింది. సవరించండి.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అసుర నాధుని సైన్యమ్ము లనెడు రీతి
రిప్లయితొలగించండిమంచి మర్యాద లన్నింటి మరచి నేడు
నిరప రాధుల తరిమి వధించు చున్న
తీవ్ర వాదుల నిర్జించు ధీరు డెవడొ
చల్లా రామకృష్ణ శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
గురుమూర్తి ఆచారి గారి పూరణలో ఒక పాదం తప్పిపోయింది.
మట్టిలో మానవత్వము మట్టుపెట్టి
రిప్లయితొలగించండిహీన హింసా ప్రవృత్తిని పూనినట్టి
తీవ్రవాదుల అభిలాష తీరదెపుడు
మెచ్చ డల్లాహె వారల తుచ్చ చర్య.
మతపు మత్తులో తూలుచున్ మదము తోడ
రిప్లయితొలగించండిబుడతలను సైతము తునుము మూడ జనుల
విశ్వ మందలి జనులంత విధి యటంచు
నంత మొందించ వలయును చింత తోడ
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిభీష్మవాదులుమతముపై పిచ్చ తోడ
లేద,ధనముపై పిచ్చతో రెచ్చిపోయి
రుధిర పాతమ్మొనర్చెద రధము లౌచు
మేలు చేయలేరెన్నడు మేలు పడరు
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికివందనములు
రిప్లయితొలగించండితీవ్ర వాదమ్ము నశియింప తేవలయును,
“పేద శ్రీమంతుల నడుమ భేదములను
మరచి, ప్రజల రక్షణ ధ్యేయమ[ తనరుచు ”
చట్టముల్, జేయ నవ సమాజమ్ము బడయు
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘మరచి జనరక్షణమె ధ్యేయమై తనరుచు’ అనండి.
తీవ్రవాదుల చర్యలు తీవ్రమయ్యె
రిప్లయితొలగించండిమానవత్వమును మరచి మానవులను
సంహరించుట నాపగ సింహములయి
ఉద్యమించుడు భారత యోధులార!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Kandi Sankarayya Guruvu gariki namaskaramu.
రిప్లయితొలగించండిMonna pakistanlo amayakulaina letha vayasu mukku pachchalaarani chinna pillalani chaalaa dharunamugaa champaaru. Chaala bhadakaramaina vishayamu. Paapamu chinna pillalu emi chesaaru.
Guruvu garu mee blog chaalaa chaalaa bagundi. Mee blog choosi anandamu vesindi.
Guruvu garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.
http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html
Guruvu garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.
తోటి జీవుల జంపెడు దురితమేల?
రిప్లయితొలగించండిజనలు లేని శ్మశాన నిశ్శబ్ద మందు
పొంద వలసిన దేమీటో బోధ పడునె?
చేరి మరుభూమిఁ జూచిన సిసలుఁ దెలియు!
డొక్కా శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిమీ బ్లాగు వీక్షించాను. మీ కృషి ప్రశంసనీయం. మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారములు
రిప్లయితొలగించండినిన్న వ్యస్తాక్షరిలో పాల్గొని - నిబంధనలు సరిగా గమనించక ఒక పద్యం పోస్ట్ చేశాను. అందుమీద మీరు స్పందించారు కూడా.
నాకు ఈ బ్లాగుల్లో పొస్ట్ చేయడం కొత్త కావడం వల్లనో యేమో, ఆ పద్యం తీసివేసినట్లున్నాను. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసిన పద్యమే!
*********
నేడు నరరూప రాక్షస నేత లగుచు
కరకు గుండెల కినిసి నిష్కారణముగ
నిరప రాధుల వేడ్క వధించి చంపు
ఉగ్రవాదుల నిరసింతు రూరు వాడ
*********