22, డిసెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 773

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. ఒకదెస చంద్రోదయమిం
    కొకదెస సూర్యాస్తమయము లొక్కట నొనగూ
    డి కనుల కింపు గొలుపు నా
    ప్రకృతి సొగసు జూసి మనము పరవశమొందున్

    రిప్లయితొలగించండి
  2. ప్రకృతి యందము జూడుము ప్రా గ్ది శాన
    తనదు బింబము నీటిలో తళుకు లీన
    భాను డు దయించు చుండెను బ్రభలు తోడ
    నదిరె యందము చంద్రుని నస్త మయము

    రిప్లయితొలగించండి
  3. ప్రకృతి యందము జూడుము ప్రా గ్ది శాన
    తనదు బింబము నీటిలో తళుకు లీన
    భాను నస్త మ యంబును బ్రభలు లేమి
    యదిరె యందము చంద్రుని నుదయ మచట

    రిప్లయితొలగించండి
  4. సేద దీరిన భానుడు మోద మలర
    పశ్చి మాద్రిని క్రుంగెను నిశ్చయముగ
    వెంట నంటిన చంద్రుడు మింట వెలసె
    నడుమ నిలచిన సంధ్యకు తోడు యనుచు

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నిద్ర లోనికి జారంగ నద్రిరాజు
    నస్తమించుచు నుండెతానలసిపోయి
    విధిగ నరుదెంచె నెలవంక విన్నుపైన
    కమలములు ముకుళించగ కల్వలలరె!!!

    రిప్లయితొలగించండి
  7. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    పగటినిబంచుబాంధవుడు,పక్కుననవ్వెడిచందమామయున్
    మగతగకొబ్బరాకులును,మౌనపుదీక్షగసంధ్యవెల్గులున్
    సగమునవెల్గుచీకటులుచక్కగగన్పడునర్దనారిఫై
    గగనమునిండియుండెగద-గాంచగదృశ్యముశంకరాకృతే

    రిప్లయితొలగించండి
  9. చిన్న సందేహం.
    శ్రీ సుబ్బారావు గారి పద్యంలో ప్రాగ్దిశాన అని "శ" కి దీర్ఘం వేయవచ్చునా??

    శ్రీమతి శైలజగారి పద్యంలో అద్రి రాజు + అస్తమించుచు లో నుగాగమం జరుగవచ్చునా??

    శ్రీ శంకరయ్యగారు దయచేసి నివృత్తి చెయ్యండి

    రిప్లయితొలగించండి
  10. 2సంధ్యసమయానఆకాశసంపదందు
    వెలుగులేసూర్య,చంద్రులువిడిదిజేయ?
    ప్రకృతందునపందిళ్ళుబరచినట్లు
    చెట్లయాకులుకనిపించెచెరగనట్లు

    రిప్లయితొలగించండి
  11. పారణములు వీడ్కోలిడ భాను డంత
    పశ్చిమాద్రిని గ్రుంకగ నిశ్శయించె!
    కొబ్బ రాకుల వీవెన కొలను వార
    స్వాగతించగ జాబిల్లి చంద్రికాయె!

    రిప్లయితొలగించండి
  12. అది అద్రిరాజున అస్తమించు అనుకుంటే అన్వయక్లేశం అయిందేమో అనిపించింది మరి.

    రిప్లయితొలగించండి
  13. 3శుక్లవిధియను-క్రీగంటజూడ-చంద్ర
    పడమటంచునసూర్యుండుపయనమాయె
    ఆకులూపుచుకొబ్బరిహాయిదెలుప
    వెలుగు\చీకట్లమాటునవెళ్ళజొచ్చె\

    రిప్లయితొలగించండి
  14. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యంలో ‘సంపద + అందు, ప్రకృతి + అందున’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. ‘సంధ్యాసమయము’ అని సమాసం చేయవలసి ఉంటుంది. మీ పద్యానికి నా సవరణలు..
    సందె వేళకు ఆకాశమందు జూడ
    వెలుగులేసూర్య,చంద్రులువిడిదిజేయ?
    ప్రకృతిలో యేవొ పందిళ్ళు బరచినట్లు
    చెట్లయాకులు కనిపించె చెరగనట్లు
    ****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ‘ప్రాగ్దిశాన’ అనడం దోషమే. ‘ప్రాగ్దిశన్ ప్రకృతి యందాల ప్రభలఁ గనుఁడు’ అన్న సవరణను సూచిస్తున్నాను.
    శైలజ గారి పద్యంలోను నుగాగమం దోషమే. ‘అద్రిరాజె/ యస్తమించుచు...’ అని నా సవరణ.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడవ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పడమటి + అంచున’ అన్నప్పుడు సంధి లేదు.యడాగమం వస్తుంది. ‘క్రీగంట జూడ శశియు| పశ్చిమంబున...’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. సాయం సంధ్యకు తానే
    సాయంగా వచ్చెనేమొ శంభుడు కనులన్
    మూయక కొంచెము తెరచిన
    మాయగ రవిచంద్రులిచట మనకిటు తోచెన్.

    రిప్లయితొలగించండి
  17. భాస్కరుండస్తమించెను పశ్చిమాద్రి
    కమలములు తేజు గోల్పోయి కమిలి పోయె
    కలువలు మురిసె నెలవంక వెలుగు సోకి
    సుందరమగు దృశ్యము కడు సొంపు గూర్చె

    రిప్లయితొలగించండి