శైలజ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ఈ పద్యాన్ని చూసి ఎవరనగలరు?... మీరు మొన్నమొన్ననే పద్యాలు వ్రాయడం ప్రారంభించారని! **** పోచిరాజు సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ, మీ పునరాగమనం ఆనందదాయకం. పార్థసారథిని దైత్యనాశంకరుణ్ణి చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి.అభినందనలు. డుప్రత్యయం లేక కృష్ణ అంటే ద్రౌపది అనే అర్థం వస్తుంది. కనుక ‘చేతబట్టె హరియె’ అనండి.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, భక్తవశంకరుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, పాథసారథిని భక్తవశంకరుని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రశేఖరుండు జడముడి జంగము
రిప్లయితొలగించండిశంకరుడన, పార్థసారథిగద
పాంచజన్యధరుడు వసుదేవ తనయుడు
శ్యామసుందరునకు చాగిలింత
సత్యపథము లోన సతతము మసలుచు
రిప్లయితొలగించండినార్తి సేవ సలిపి యనవరతము
మోక్షపథము కోరు ముఖ్య భక్తులకు వ
శంకరుడన పార్థసారథి కద
వరము లొసగు నతడు భక్త కోటికినిల
రిప్లయితొలగించండిశంకరుడన , బా ర్ధ సారధి గద
కదన రంగ మందు గాండీవి కిని మఱి
రధము నడిపి నతడు రంజి లంగ
శైలజ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ పద్యాన్ని చూసి ఎవరనగలరు?... మీరు మొన్నమొన్ననే పద్యాలు వ్రాయడం ప్రారంభించారని!
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవిమిత్రులందఱకును నమస్కారములు! అనారోగ్యకారణముచే నేను మన బ్లాగునకుఁ గొంత కాలము దూరముకావలసివచ్చినది. మన్నింపుఁడు.
రిప్లయితొలగించండినా పూరణము:
వాసుదేవుఁడు హరి బకవైరి మురవైరి
కంసఘస్మరుండు కైటభారి
శ్యామసుందరుండు శకటారి దైత్య నా
శంకరుఁ డనఁ బార్థసారథి కద!
శంకరుడన?పార్థసారధిగద|మన
రిప్లయితొలగించండిరక్షగుర్చనెంచితక్షనంబె
శాంతిసౌఖ్యములను,సౌభాగ్యవిద్యను
నూత్నవత్సరాననొసగుగాక
శంకరుడు=శుభంకరుడు
2యుద్ధసమయమందుబద్దకమునుమాన్ప
అర్జునుండునమ్మినాయుధములు
చేతబట్టెకృష్ణచేయూతనిచ్చెడి
శంకరుడనబార్థసారధికద|
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పునరాగమనం ఆనందదాయకం.
పార్థసారథిని దైత్యనాశంకరుణ్ణి చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి.అభినందనలు.
డుప్రత్యయం లేక కృష్ణ అంటే ద్రౌపది అనే అర్థం వస్తుంది. కనుక ‘చేతబట్టె హరియె’ అనండి.
కొండ వలె మీరు సతతము నండనివ్వ
రిప్లయితొలగించండిసాగు చుండె పద్యరచన చక్కగాను
తమరి సూచనలఁగనని సమయమందు
తపన పడు చుందును వలయు తృప్తిలేక
యుద్ధ మందు జేరి బుద్ధి మరల్చఁగన్
రిప్లయితొలగించండిసందియముల దీర్చి శాంతి నొసఁగి
గీత బోధ జేసె పోత! యజ్ఙాన నా
శంకరుఁడన పార్థ సారధి కద
తనను శరణువేడ తా వచ్చి గజరాజు
రిప్లయితొలగించండిరక్షసేసె గాదె రయము,వాడె
కాచె చీరలిచ్చికమలాక్షి-భక్తవ
శంకరుడన పార్ధసారధికద!
భీమ బాణ తతిని భీష్ముడేయంగను
వాని చంపుదనెను,పార్ధు డడ్డు
పడగ,వీడెపట్టు,పాండవులను గాచు
శంకరుడన పార్ధసారధి గద!
(శంకరుడు=శుభము గూర్చువాడు)
రాయబారియౌచు రయము నా సభకేగి
రమ్య భాషణముల రాజరాజు
వినగతెల్పి,వినమి విశ్వరూపము జూపె
శంకరుడన పార్ధసారధి కద!
(శివాయ విష్ణురూపాయ)
శివుడు విష్ణువొకడె చింతింప మదిలోన
చిత్రమైనరీతి చెలగు విభుడు
నాది మధ్యమంత మరయంగ లేనట్టి
శంకరరుడన పార్ధసారధి కద!
ఈశు,డేశు,*నల్లని నిలలోన కొలువ *(అల్లాని)
వేరువేరు పేర్ల పిలుతురంతె
మతమదేది యైన మానవుడొక్కడే
శంకరుడన పార్ధసారధి కద!
విజయవాడ యన్న బెజవాడ యే గాదె!
రిప్లయితొలగించండిబందరౌను మచిలిపట్నమనగ!
భక్తులెందరైన పరమాత్మ యొక్కడే
శంకరుడన పార్ధసారధి కద!
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిసంతోషం! మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
చివరిపాదంలో యతి తప్పింది. ‘తృప్తి’ని ‘తనివి’ అంటే సరి!
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
అజ్ఞాన నాశంకరునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ సాస్త్రి గారూ,
మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
చివరిపద్యం మొదటి పాదంలో యతి తప్పింది.‘ఈశు నేసు నల్ల నిలలోన కొలువగా’ అనండి.
****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
‘ఏకం సత్, బహుధా వదన్తి విప్రాః’ అన్నభావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాచె గోకల నిడి కాంత పాంచాలిని
రిప్లయితొలగించండిఅటుకులనిడి కాచె నతని సఖుని
సామజమును గాచె జంపి నక్రంబును
శంకరుఁ డనఁ బార్థసారథి కద.
రిప్లయితొలగించండికదన రంగ మందు క్లైబ్యము కలిగిన
విజయునకును గీత విశద ముగను
బోధ పరచి శిష్యు బ్రోచిన భక్త వ
శంకరుడన పార్థ సారథి కద
కె యెస్ గురుమూర్తి ఆచారి పూరణ
రిప్లయితొలగించండిఅహము నెల్లవీడి ఆత్మశుద్ది గలిగి
దిక్కు నీవె యనుచు మ్రొక్కు లిడుచు
శరణు వేడ,బ్రోచు శౌరి యే;భక్త వ
శంకరుడన పార్థసారథి కద
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
భక్తవశంకరుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
పాథసారథిని భక్తవశంకరుని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బ్రహ్మ,విష్ణు,శివునిభాధ్యతలొక్కటే
రిప్లయితొలగించండిపేర్లువేరుగాని?పెదవినొకటె|
రాక-జేయగలరురాగలకష్టాలు
శంకరుడనబార్థసారథికద|
యద్ధరంగమందు యోధులను జయించ
రిప్లయితొలగించండిపాశుపతమునిడి యభయమునొసగి
హృదయ రధమునిలచి ఇంద్రసూను నడిపె
శంకరుడన బార్ధ సారధిగద
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
పార్థహృదయరథసారథిగా శంకరుణ్ణి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.