పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో యతి తప్పింది. ‘కోరినన్ని’ని ‘వలసినన్ని’ అంటే సరి!
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మనసుతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. అక్కడ ‘నిలకడయె లేని మనమున’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** సుబ్బారావు గారూ, మీ సందేహానికి రేపు సమాధానం ఇస్తాను. మన్నించండి. సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మీరు చెప్పిన భావం గల దోహా చదివినట్టే గుర్తు... కాని గుర్తుకు రావడం లేదు.
పూజ మొదలిడి యాభామ బుద్ధి గాను
రిప్లయితొలగించండినీళ్ళు మఱు గుట మొదలుగా పాల వాని
పాలు పోయించు కొనుమని నీర జమ్మ
కు పుర మాయించ జూడగ కుమతి తోడ
చేయు చుండెను బూజను శివుని కచట
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
శ్రీహరి కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు :
01)
____________________________________
ఆత్మ శుద్ధి లేని - హరి పూజలను గాంచి
యచ్చెరువును బొందె - నచ్యుతుండు !
ఆత్మశుద్ధి తోడ - హరి పూజలను జేయు
వారి నాదు కొనును - వారిశుండు !
____________________________________
మెచ్చు కొంటిని నీ భక్తి నచ్చి నాకు
రిప్లయితొలగించండిపాలు నీళ్ళకు భయమేల బేల నీకు
వరము లిచ్చితి చక్రినై కోరి నన్ని
పూలు జల్లుము నాపైన జాలి తోడ
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. ‘కోరినన్ని’ని ‘వలసినన్ని’ అంటే సరి!
ఇంటి పని తోనె ఇల్లాలు ఈద లేదు
రిప్లయితొలగించండిప్రతిమ నుంచగ చాలునా వ్రతము కొరకు
పూజ సాగునా మనసు తో పూలు జల్లి
భక్తి నిగ్రహమ్ము వలయు ప్రతిమ లేల
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిత్తమచట లేని శివపూజలేలొకో
రిప్లయితొలగించండివేరె ధ్యాసలోన విష్ణుపూజ
లేల? మనము నిలుపలేని వేడుకలెన్ని
యున్నగాని ఫలితముండఁ బోదు.
నిలకడగ లేని మనసుతొ
రిప్లయితొలగించండినలవోకగ జేయవలదు హరితా ! పూజ
న్నిల జేయ ఫలిత ముండదు
చెలువుగ నిక భక్తి తోడ జేయుమ యిపుడున్
నామము జదువు, పెట్టకు నామమయ్యొ
రిప్లయితొలగించండిపూలు జల్లుము విడువుము పాల ధ్యాస
దేవులాటలు వదలుము దేవునికడ
నీసడింపులు మానుము నీశు దరిని.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మనసుతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. అక్కడ ‘నిలకడయె లేని మనమున’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తొల్లి తనను స్థుతించిన తొయ్యలిఁ గన
రిప్లయితొలగించండిధాత్రి కేతెంచి శౌరితా తనివి తోడ
విష్ణు జపమునుండి మరలి వివిధములగు
నిత్య కార్యమగ్నగ నుండ నివ్వరపడె
చిత్త శుద్ధి లేని శివ పూజ లేలను
రిప్లయితొలగించండిమదిని చొరని గొప్ప మంత్ర మేల
దృష్టి పెట్ట లేని దేవతార్చన లేల
నీమ మెరుగ నట్టి భామ నీకు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
5-12-4 నాటిపద్యరన:
రిప్లయితొలగించండికత్తి దీసిన తమ్ముని మెత్త బరచి
తండ్రి మాటను తలదాల్చి దవము నేగ
ననుమతిమ్మని కైకమ్మ నడుగ నెంచి
లోక కల్యాణ రాముడు మోక రిల్లె!
6-12-14నాటి పద్య రచన:
హరిత వనముల న్బెంచగ
ధరిత్రి తాపము శమించి తంకము వీడున్
పరవశమున ప్రకృతి మురియ
విరులాస్మైలీలఁబోలువిధముననవ్వున్!
7-12-14నాటి పద్య రచన :
సీతారాముల కృపతో
పోతనవలెపద్యరచనమోదమునీయన్!
నూతన గృహప్రవేశము
ప్రీతిగ నెరవేరి మీకు వేడుకలొసగున్!
నేటి పద్యరచన :
నామార్చన జేయుచు నా
భామామణి యానతీయ పనులను జేయన్
సామాన్యుని వలె హరియే
యేమరు పాటున దడబడె! నేమాపూజల్?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
విత్త సారమున్న విలువైన ఫలములు
రిప్లయితొలగించండిదక్కు చుండు గాదె ధరణి లోన
భక్తి విత్తు లేక పరమాత్మ నర్చించి
మొక్కు చుంటి వేల మూఢురాల !!!
మనసు కుదురు లేక మాధవునిగొలువ
ఫలిత మేమి గలుగు పంకజాక్షి
భక్తి లేని చోట భగవంతు డుండునా?
మంత్ర మేల నింక తంత్ర మేల ?
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండి"నాతు లెందరో యున్నను నాయవసర
ములను శ్రద్ధగా నొనరించు ముదిత లేదె!"
యనుచు విస్తు పోయెను కృష్ణు డతివ పతికి
వలయు సేవలు మరువక వ్రతము వేళ
గురువుగారికి నమ స్కా రములు.
రిప్లయితొలగించండిర -ల -ళ -డ -వ -ప ఫ బ భ మ లకు అభేద యతి అను
భావనతో 2,3 పా దాలు వ్రాసాను ,నా అభి ప్రాయము సరి యైనదొ కాదో తెలుప గోర్తాను
రిప్లయితొలగించండిsavarinchina padyamu
పూజ మొదలిడి యాభామ బుద్ధి గాను
నీళ్ళు మఱగెనొ జూడుము నేమర కగ
పాలు పోయుట కును వచ్చె బాల వాడు
ననుచు జేయుట పూజను నబ్బు రమ్ము
నోటికి మంత్రోచ్చారణ
రిప్లయితొలగించండిమాటికి పలు విషయములను మనసున నిల్ప
న్నేటికి పూజలు వ్రతములు
చేటగు పనిపాటలకును చిత్రము కనుడీ!
ఈ చిత్రం చూస్తుంటే హిందీ లో ఒక దోహా గుర్తొస్తోంది.
చేతిలో రుద్రాక్షమాల తిరగడం మనసు భౌతిక విషయాల పై తిరగడం వృధా అని దాని భావం.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
సుబ్బారావు గారూ,
మీ సందేహానికి రేపు సమాధానం ఇస్తాను. మన్నించండి.
సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మీరు చెప్పిన భావం గల దోహా చదివినట్టే గుర్తు... కాని గుర్తుకు రావడం లేదు.