కవిమిత్రులు గుండు మధుసూదన్ గారూ, ఈరోజు దత్తపది ఇచ్చాను కదా! పూరణలను పరిశీలించే సమయంలో నా దృష్టి అంతా దత్తపదాలను అన్యార్థంలో ఎలా ప్రయోగించారా అన్న విషయంపైనే ఉంటుంది. కనుక గణయతి దోషాలు నిర్లక్ష్యం చేయబడతాయి. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. దత్తపదం సిలువ అయితే మీరు సిలవ అన్నారు. ‘మదిలో భాసిలు వరపరమతసహనమురా’ అందాం. **** కె.ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్ని మారులు చర్చించ నేమి, దేవు
రిప్లయితొలగించండిననెద మేరీతి జూచిన నాతడొకడె
నరుడు గాసిలు వసుధను నమ్మకున్న
చూడ నమ్మిన వారికే సుఖము గలుగు.
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండిసమతయే సుఖశాంతులు మమత లొసఁగు
ననియ చర్చిలుౘు మతపెద్దలంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
(చర్చిలుౘు=చర్చింౘుౘు, రీఢ=అవమానము, తిరస్కారము)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వరను జూచి’ అర్థం కాలేదు. ‘వర’ ఏ అర్థంలో వాడారు? ‘..గురియు + ఏసుకొను = ..గురియు నేసుకొను’ అవుతుంది కదా.. అక్కడ ‘దయఁ గురియడె| యేసుకొను...’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రణామములు గురువుగారు...భూమి కి వర అనే పేరుందని వాడాను..మీ సూచన ననుసరించి సవరించాను..
రిప్లయితొలగించండిమతముగురియించి చర్చించి మనుజులంత
బాగు కనరాక గాసిలు వరను జూచి
దైవ మేరీతి గొలిచినా దయ గురియడె
యేసుకొనుటలు యెందుకో నెరుక లేదె!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది.
మిత్రులు కంది శంకరయ్యగారికి,
రిప్లయితొలగించండినా పూరణమందు రెండవపాదమున (నేరుగా టైపుచేయుటచే) గణభంగమైనది. నేను గమనింపకయే ప్రచురించితిని. దానిని ఈ దిగువరీతినిఁ బఠింపఁగలరని మనవి.
సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
ననియ చర్చిలు మతపెద్దలంద ఱిటులె
యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
(చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)
కవిమిత్రులు గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఈరోజు దత్తపది ఇచ్చాను కదా! పూరణలను పరిశీలించే సమయంలో నా దృష్టి అంతా దత్తపదాలను అన్యార్థంలో ఎలా ప్రయోగించారా అన్న విషయంపైనే ఉంటుంది. కనుక గణయతి దోషాలు నిర్లక్ష్యం చేయబడతాయి.
సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగతమేరీతి గడచె ఛ
ర్చిత మది మానుచు విలసిలు వర్తనముననే
మతసామరస్యమొదవును
హితమిదియే సుమ విలాతి వృద్ధినిజెందన్
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిచిత్తము గుణ సుగంధ ఛర్చితము గాక
భువి జనులుశాంత మేరీతి పొందగలరు
పరమత సహనభావనల్ భాసిలు వడి
యే సుమతమైనబోధించు నిదియె సుమ్మ
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది.అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏ సుగతి మార్గమైనను నింపుగాను
రిప్లయితొలగించండివేగ చర్చించి యన్నిట పెద్దగాను
మంచి మతమేరిన యపుడు మానవతయె
మాసిలు వచనాలను చెప్పు మతము మతమె?
ఏ సుగమమిడు బోధన నింపువినియు
నందు మేలును చర్చించి యందు మనిషి
ఏది గాసిలు వంతల దింపువిడిచి
సాధు మతమేరి కైనను చల్లనిదగు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పదరచు చర్చిలకన్యుల
రిప్లయితొలగించండిముదమేరీతి నొనగూడు మూర్ఖత్వముతో
మెదలిన? హృదియే సుమ గుడి
మదిలో భాసిలవలె పరమతసహనమురా
జాతిపురోభివృద్ధికిసజావుగచర్చిడిమంచిమార్గ,మే
రిప్లయితొలగించండిరేతిగబంచ?గాసిలు,వరించకమీమదిసమ్మతించునో
నీతిగ,యేసుశీలమునునిల్పెడిదే|మతమంచునెంతువో
మీతరమందుబంచుమనిమిమ్ములగోరెదశాంతచిత్తమున్
సతము చర్చించి యేసుమ్మ సర్వ మతము
రిప్లయితొలగించండిలనొక త్రాటిపై నడపుచు రమణ తోడ
సంఘ మేరీతి గానైన సాగవలయు
గాసిలు వచనముల తోడ కందు గలుగు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దత్తపదం సిలువ అయితే మీరు సిలవ అన్నారు. ‘మదిలో భాసిలు వరపరమతసహనమురా’ అందాం.
****
కె.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హిత-మేరీతిగబుట్టెను
రిప్లయితొలగించండిమతమునచర్చించిమనసుమరిమరిదెలిపే
స్మృతియేసుభదాయకమని
మతియే? గా సిలువకననుమానముమాన్పున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
‘శుభ’మును ‘సుభ’మన్నారు. ‘స్మృతియే సుఖదాయకమని’ అందామా?
ఏ మతమైనా తక్కువెలా అవుతుంది?
రిప్లయితొలగించండిదైవాన్ని గురించే అవన్నీ చర్చిస్తున్నపుడు!
ఏ సుప్రభాత మైనను
భాసిలు వర్ణాగమమ్ము ప్రాగ్దిశ వెలయన్
గీసర మేరీతిగనౌ
తాసించగ దైవ చర్చితములె మతములై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎంత చర్చిచ ఫలములు సుంత యైన
రిప్లయితొలగించండిగాన మేరీతి గావున కలిసి మెలిసి
యే సు ఖముగనుం డుకొరకు నిమ్ము నీదు
ఆశి సు లుమాకు గా సిలు వడయ కుండ
మానవత్వము చర్చించు మనుజ దరికి
రిప్లయితొలగించండిదానవత్వమే రీతిగ పూని చేరు
వాస్తవము సదా విలసిలు వసుధలోన
పాడియే సుప్రజా మత పరపు తగవు
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలు కీళ్ళను చర్చించి శీల మెంచి
రిప్లయితొలగించండిభాసిలు వదనమున జన వంద్యులగుచు
సుగుణ మేరీతియో దెల్పి ప్రగతి జూపి
ఇద్దియేసుకరముగ వర్తింప వలయు .
మద్దూరి రామమూర్తి.
కర్నూలు .
మేలు కీళ్ళను చర్చించి శీల మెంచి
రిప్లయితొలగించండిభాసిలు వదనమున జన వంద్యులగుచు
సుగుణ మేరీతియో దెల్పి ప్రగతి జూపి
ఇద్దియేసుకరముగ వర్తింప వలయు .
మద్దూరి రామమూర్తి.
కర్నూలు .
మద్దూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.