13, డిసెంబర్ 2014, శనివారం

నిషిద్ధాక్షరి - 24

కవిమిత్రులారా,
అంశం- చలిబాధ.
నిషిద్ధాక్షరము - ల
ఛందస్సు - తేటగీతి.

24 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  చలిబాధ :

  01)
  __________________________________

  వేడి తగ్గుట వంకర, - వేళ్ళు తిరుగు !
  వేడి కొరకయి స్వెట్టరు - వేసుకొంద్రు !
  వేడి కొరకయి మంటను - వేయు చుంద్రు !
  వేడి కొరకయి హీటరు - వేసుకొంద్రు !

  వడయె తగ్గుట జగతియె - ముడుచు కొనును !
  జగము జగమంత మారును - జడము రీతి !
  ఎన్ని జేసిన తీరదీ - యివపు బాధ !
  సూర్యుడొక్కడె ఛేదించు - సుషిమ వెతను !
  __________________________________
  వడ = వేడి
  వేచు = కాల్చు
  చలి = ఇ(వ)(గ)ము, కులిరు, జడము, వలి, వలిపిరి, శీతము, సీతు, సు(షి)(షీ)మము.

  రిప్లయితొలగించండి
 2. శీత మిచ్చట దండిగా జేరు కతన
  శీత బాధను నోర్చుట చేత కాక
  నుష్ణ యంత్రము దగ్గరే యుండి నేను
  దీర్చు కొనుచుంటి బాధను దేజ ! యిచట

  రిప్లయితొలగించండి
 3. శీత బాధను వీడ్కొను చింతతోడ
  పడుచు జంట రయమునను వాద ముడిగి
  గాఢ పరిరంభమును తాము వీడ కుండ
  తన్మ యత్వము నొందెడు తరుణ మిదియె

  రిప్లయితొలగించండి
 4. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  సరసమైన మీ పూరణ అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. శీత ఋతువున తిరుగాడ స్వేచ్ఛ తగ్గు
  ఆరు బయట కాళ్ళ నడక ఆగు నింక
  చర్మ మంతబీటపడును చమురు తగ్గి
  వయసు మీరగ ప్రజకును వగయు పెరుగు

  రిప్లయితొలగించండి
 6. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
  కే*ఈశ్వరప్పపంపుసమస్యాపురాణం
  దొడ్డవారినివిసిగించుదుడుకుతనము
  వయసుమీరినవెంటాడిభయముగూర్చు
  అర్ధనగ్నతమాన్పించునధికశక్తి
  జంటనొంటిగగనుపించవెంటబడును

  రిప్లయితొలగించండి
 7. మా చిన్నాన్నగారు భైరవభట్ల శివరాం గారి పూరణ:
  హిమము కురియుచునుండగ నిట జనంబు
  గడగడ వణకి దుప్పటి గప్పుకొనుచు
  వేడి కోరుచు మంటను వేసికొనుచు
  హిమపుబాధను తరుముచు హితమునొందు!

  నా పూరణ:
  హిమశరనిపాతఘాత మహీధరమ్ము
  వణకసాగెను శిశిరము వచ్చినంత
  ప్రాణికోటికి ప్రాణము భారమయ్యె
  నింగిమాటున సూర్యుడు నిదురబోయె

  రిప్లయితొలగించండి
 8. ఎట్ట నెట్టనో శీతను తట్టు కొనగ
  బట్ట కొరవవ్వ బిక్షుకి బాధ పడుచు
  చుట్టె గోనె సంచినొకటి బట్ట జేసి
  తిట్టు కొనిననీ శీతము నెట్ట బడునె?

  రిప్లయితొలగించండి
 9. మంచు తెమ్మెర ధాటికి మానవాళి
  పర్య టించుట కష్టమై వణికిపోవ
  రక్ష ణీయగ స్వెట్టరు రగ్గు టోపి
  యినుడు వచ్చిన తీరదీ యివపు బాధ
  కోత బెట్టెను జగతిని శీత వేళ

  రిప్లయితొలగించండి
 10. ముదిమి వయసున కీళ్ళన్ని ముడుచు కొనియె
  సీత బాధకు చర్మమ్ము చిట్లు చుండె
  నుదయపు నడక మంచున కుదరదాయె
  ముదుక శ్రీమతి దరిఁ జేర మూతి ముడుచు
  బాధలను భరియించుచు భావి నందు
  మంచి సమయము కనగను మనుచు నుంటి

  రిప్లయితొలగించండి
 11. సూర్యభగవానునికి దిన చర్యఁ దప్పఁ
  జేయుచు విజృంభణముఁ జూపె శీత ఋతువు
  హిమగిరికి చెంత నున్నవారెంత బాధ
  పడుచునుండిరో నని మదిభారమయ్యె.

  రిప్లయితొలగించండి

 12. పూజ్యులు గురు దేవులు శంకరయ్య గారికి
  వందనములు

  వడవడ వణకి౦చెడి శీత వాత మొకట
  మంచు కురిసిన రేయిని మ౦దిర౦పు
  గట్టుపై శయనించు బికారి బ్రతుకు
  యెరుగు హేమంత శైత్యపు కరకు తనము

  రిప్లయితొలగించండి
 13. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘బట్ట కరువైన’ అనండి.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భైరవభట్ల శివరాం గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  ఆదిత్య గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సీతుబాధకు...’ అనండి.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కె యెస్ గుర్రుముర్తి ఆచారి గారి పూరణ
  ఉహుహు హూయని వణకిన నుర్విజనము
  పొద్దు పొడిచిన లేయక బుద్దిగాక
  దుప్పటి పయిన దుప్పటి కప్పు కొనియె
  నినుడు నెత్తిపై యుండిన ఎండ రాదు

  రిప్లయితొలగించండి
 15. కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నిప్పు చెంతను గాచక నెమ్మ దేది?
  దుప్పటైనను గప్పని తొంగుడెట్లు?
  కౌగిటి బిగియించక వేడి కాపుడెట్లు?
  చెప్పఁ దరమె? హేమంతపు తిప్పటన్న!

  రిప్లయితొలగించండి
 17. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పూజ్యులయినగురువర్యులయినకందిశంకరయ్యగారికివందనాలు
  కే*ఈశ్వరప్ప
  సూర్యతేజస్సుతగ్గించుసూటిగాను
  కార్యభారముబెంచుసౌకర్యముడుగు
  వయసుమీరినవారికిభయముబంచు
  శిశిరమందునమంచునేవిసిరికొట్టు

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. పెట్టు నందరకున్ టోపి గుట్టుగాను
  రాత్రి రగ్గున దూరిచి రంకెవేయు
  కనులకందక వణికించు గజగజమని
  శీత బారంగ పుట్టించు సెగను పొగను.

  రిప్లయితొలగించండి
 21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. శీతబాధకు నోర్వక భూతకోటి
  వివిధ పద్ధతి సాగగా విధము కనక
  సూర్య,చంద్రమ దాగెడు చోటువెదకి
  సంద్రమందున దాగెనో చక్క గాను

  (రాత్రి సూర్యుడు, పగలు చంద్రుడు ఎవరికీ కనపడకుండా పోవడానికి కారణం అదేనని ఊహ)

  రిప్లయితొలగించండి