12, డిసెంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 763

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

 1. భార్య వంటను దినుచును భర్త, యవియు
  దల్లి వంటక ములవలె దనర గాను
  దనదు తం డ్రి స న్యాసుల దరిని కలిసి
  పోవుటకు గల కారణం బునిదియె యనె

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  బాపు కార్టూను :

  01)
  __________________________________

  బాపు కార్టూను కితరము - పాటి గాదు !
  బాపు కార్టూను నవ్వుల - పాన్పు పరచు !
  బాపు కార్టూను గిలిగింత - పరచు నెదను !
  బాపు కార్టూనె కార్టూను - భళిర యనరె !
  __________________________________

  రిప్లయితొలగించండి
 3. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. నేటి భార్య చెప్పు జవాబు ........  భర్త లేల మాకు బాధ్యతన్నది లేక
  కరువు లేదు నేటి కన్నె కిపుడు
  సందు వెతకి నీవు సన్నెసింతుననగ
  నేను బ్రతిమ లాడు సీను లేదు

  రిప్లయితొలగించండి
 5. తల్లి చేతి వంట తరలించె తండ్రిని ,
  కట్టు గుడ్డ తోడ కాన వరకు !
  నీదు జేతి కూడు , నిజ మదియేనులే !
  సన్య సించి పోదు , సక్క గాను !

  డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

  రిప్లయితొలగించండి
 6. రుచుల వెదక బోను రుషి పుంగముడ యేను
  వెదక నేమి ఫలము వెర్రి దాన !
  ఎరువు కూడు లోన యేముండు రుచులన్న !
  కరవు పాశ మందు కటిక నిజము !

  డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

  రిప్లయితొలగించండి
 7. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘పోదుఁ జక్కగాను’ అనడం సా్ధువు. పోదు ద్రుతాంతమైన క్రియాపదం కనుక దాని తరువాతి పరుషం సరళం అవుతుంది, గసడదవాదేశం రాదు.
  ‘ఋషిపుంగవుడ నేను’ అనండి. ‘ఋషిపుంగవుడన్ + ఏను = ఋషిపుంగవుడ నేను’

  రిప్లయితొలగించండి

 8. పూజ్యులుగురుదేవులుశంకరయ్యగారికివందనములు

  పద్యరచన “అమ్మ చేతి వ౦ట అయ్యను సన్యాసి
  జేసె.నేడు నీదు చేతి వంట
  అమ్మను తలపింతు” ననిన భర్త జూచి
  “ఆనవాయితికద”యనెను భార్య

  రిప్లయితొలగించండి
 9. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గడన గల దినములలోన కరము ప్రేమఁ
  పంచి గడనుడిగిన వృద్ధ పతిని సతము
  చులకనగజేసి కూడిడు శూర్పణకను(చుప్పనాతి)
  వీడి పొయెను పెనిమిటి వేదనఁ బడి

  రిప్లయితొలగించండి
 11. పెళ్లై దశాబ్ద మాయెను
  పళ్ళికిలించుటయె గాని పట్టెడు కూడున్
  మళ్ళీ కోరెడు రీతిని
  పెళ్ళామా వండ లేవె పేచీ లేకన్?

  పెళ్లై పదేళ్ళు దాటెను
  పళ్ళను కొరుకుటలె గాని వంటలు నచ్చన్
  పెళ్ళామా భేషనకన్
  మళ్ళా యీ దెప్పిపొడుపు మాటలు పైగా.  రిప్లయితొలగించండి
 12. పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
  తిమ్మాజీ రావు గారి పద్యం మూడవ పాదంలో చివరి గణం సరిచేయాలనుకుంటాను.
  అమ్మను తలపింతు” ననిన భర్త జూచి (భర్తను జూసి)

  రిప్లయితొలగించండి
 13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  తిమ్మాజీ రావు గారి పద్యంలో మీరు చూపిన దోషం, దాని సవరణ రెండూ సరియైనవే. ధన్యవాదాలు.
  ****
  మిస్సన్న గారూ,
  ఉభయత్రా దెప్పిపొడుపులతో మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. తొలిసారి హాస్య చిత్రము
  గలిగింతలనిడి వినోద కేళిని గూర్చున్!
  మలిసారి బాపుఁ దలచుచు
  పులకించని దెలుగు వాడు పుడమిని గలడే!

  రిప్లయితొలగించండి
 15. సహదేవుడు గారూ,
  మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. చాపుజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
  కే*ఈశ్వరప్ప
  అమ్మనుతలపించెడిడై
  నమ్మకమునతినుటజరుగనాగతియంతే
  నమ్మకమందుకెనీవే
  సమ్మతిగానిడినచాలుసంతోషముతోన్

  రిప్లయితొలగించండి
 17. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  చమత్కారభరితంగా పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
  ‘యిట్లాంటి’ అన్నచోట గణదోషం. సవరించండి. ‘నాన్నకు యిటువంటి కూడు నచ్చక...’ అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 19. అతడు:సన్నాసుల్లో గలిసెను
  నాన్నే యిట్లాంటి కూడు నచ్చక నాడే!
  ఆమె: యిన్నాళ్లకు నా కడుపున
  సన్నాసివె గాన నీదు సంతతి లేదే!

  రిప్లయితొలగించండి
 20. సహదేవుడు గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం.
  ‘ఇట్లాంటి’ అని వ్యావహారికానికి బదులు ‘ఇటువంటి’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  అతడు:సన్నాసుల్లో గలిసెను
  నాన్నకు నిటువంటి కూడు నచ్చక నాడే!
  ఆమె: యిన్నాళ్లకు నా కడుపున
  సన్నాసివె గాన నీదు సంతతి లేదే!

  రిప్లయితొలగించండి
 22. అమ్మ చేతి వంట తినగ నయ్య సన్య సించెనే
  కొమ్మ నీదు వంట జూడ గుర్తు వచ్చెనమ్మయే
  నమ్మకాన్ని యుంచు నాధ నారి పైన నెప్పుడూ
  వమ్ము కాదు నాదు మాట వారి దారె నీదిగా!!!

  రిప్లయితొలగించండి