వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం (ఆంగ్లపదాన్ని ఉపయోగించినా) బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రాజేశ్వరి అక్కయ్యా, చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు. **** జిలేబీ గారూ, ☺ **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
హరిత చిత్రము :
01)
____________________________________
ఆకు పచ్చని గడ్డిపై - నందముగను
పసుపు చేమంతి పూలతో - వరుస బేర్చ
చిత్ర మెంతయొ కనువిందు - చేయుచుండె
చిందు చుండెను చిరునవ్వు - చిత్తమలర !
____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్మైలీ యాకారములో
రిప్లయితొలగించండిపూలను పూయించినారు పొందికగానా
నేలను పచ్చికలో నిం
పై లోచనములకు తోచె బంగరు బొమ్మై
కళ్ళు ముఖమును నోరును గలిగి యుండి
రిప్లయితొలగించండిచంద్ర బింబము బోలిన చంద మచట
పూయ చేమంతి పూవులు బ్రియము గలిగి
చూడ ముచ్చట గొలిపెను చూడు డా ర్య !
హేమంతము వచ్చె నదిగొ
రిప్లయితొలగించండిచేమంతులు విరిసె గనుడు చేడియ లారా
సీమంత మలది కుంకుమ
హైమవతిని గొలువరండు హర్షము తోడన్
సీమంతము = పాపట
పచ్చటాకు ల పైన పసుపు చేమంతీ ల
రిప్లయితొలగించండిస్మైలీ లు బెట్టి పద్యములు రాయమనే !
పంచ్ 'టాక్' ల కాల మాయే ఇది
పంచు పంచు కీ స్మైలీ లే ఇక జవాబులు !!
జిలేబి
(విత్ లవ్ మీ పంచు లచ్చి!)
హరిత వర్ణమ్ము చిందించు హర్షణమ్ము
రిప్లయితొలగించండిపసిడి కాంతులు సర్వత్ర పావనమ్ము
ధరణి పరిరక్షణ సుజన పరమ పథము
సస్య శ్యామల పూజయే సాధు సూక్తి
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం (ఆంగ్లపదాన్ని ఉపయోగించినా) బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
****
జిలేబీ గారూ,
☺
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ లీల పచ్చదనమును
రిప్లయితొలగించండిజాలీగా వృద్ధి జేయ సంతసమనుచున్
స్మైలీ సింబలు బెట్టెను
మేలగ చేమంతి తోడ మేదిని గనుడీ.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మేలగు/ మేలుగ’... టైపాటువల్ల ‘మేలగ’ అయింది.
మేలగు పచ్చిక పైనన్
రిప్లయితొలగించండిస్మైలీ ఫేసచట బేర్చె చామంతులతో
కాలం బేమైన నిలన్
జాలీగా నుండుడనుచు జనులకు చాటన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపద్య రచన :హరిత హేమంత సుందరి ఆననముగ
పసిడి రంగుల చేమంతి మిసిమి యేమొ!
ఉదయ భాస్కరు కరముల నుర్వి కాంత
కడగి నర్పింప బూనిన కాన్క యేమొ
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.
పచ్చ గడ్డి పైన పచ్చని చేమంతి
రిప్లయితొలగించండిపూలఁ బేర్చి నారు పొందికగను
చందమామవంటి యందమౌ మోములా
శోభ గూర్చె సుమ్మ చూపరులకు
మాస్టారు గారూ ! అవునండీ..టైపాటు...సరిచేసాను....ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఈ లీల పచ్చదనమును
జాలీగా వృద్ధి జేయ సంతసమనుచున్
స్మైలీ సింబలు బెట్టెను
మేలగు చేమంతి తోడ మేదిని గనుడీ.
చేమంతుల నవ్వులతో
రిప్లయితొలగించండిహేమంతపు కళలొకింత హెచ్చెను గనుడీ
శ్రీమంతుల తోట నిటుల
మోమంతయు నవ్వులలుమ ముచ్చట గొలిపెన్.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.