కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘భస్మాసురునిచె’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘భస్మాసురునకు’ అనండి. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
రిప్లయితొలగించండిమోహినిభస్మాసురునిచె
మోహంబునుపెంపుజేసిమోసముజేయన్
సాహసిగనిలచెనక్కడ
ఆహాయనుచున్ననతనినాకర్షణతో
భవుడు మెచ్చి భస్మాసురు ప్రార్థనలకు
రిప్లయితొలగించండినిచ్చె కోరిన వరముల నిచ్చ తోడ
నెవరితలపైన రక్కసుండిడిన కుడి
చేయి రయమున భస్మంబు చెందు నటుల
వరపు గర్వము తోవాడు హరుని పైన
చేయి పెట్టెదనంచును చెంత చేర
భయము తోడను శంభుండు పాఱు చుండ
కాంచి విష్ణువు శంకరున్ కావ నెంచి
మోహినిగ మారి యసురుతో ముచ్చటించె
పెండ్లి యాడు మనుచు వాడు వెంట పడగ
నాట్య మొనరించి నాభంగి నన్ను గెలువ
నిన్ను చేపట్టెదనటంచు నియతిఁ బెట్టె
కామమడరగ దైత్యుడు కాంత తోడ
నృత్య మొనరించె నత్యంత నేర్పు తోడ
నామె తలపైన చేయిడ ననుసరించి
భస్మ మయ్యెనా యసురుండు విస్మయముగ
వాడు దీసిన గోతిలో వాడె పడెను
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భస్మాసురునిచె’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘భస్మాసురునకు’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతివకు ప్రేమను బంచిన
రిప్లయితొలగించండిచితికైనను తోడు రాగ సిద్ధముఁ గాదే?
మితిమీర దానవత్వము
పతనముఁ జేయక వదలెనె భస్మాసురునిన్?
వేసిననుచ్చులోబడినపెద్దపులట్లుగగాకనేత-నో
రిప్లయితొలగించండిదాసునివోలెదండనకుదగ్గరజేరెనుమోజుచేత-భ
స్మాసురుదొట్టిమూర్ఖుడనిమైమరుపందునమోహినీకడన్
వసుకివోలెత్రిప్పతలభంధమెభస్మముజేసెచూడగా
దీని వలన
రిప్లయితొలగించండికం.తప్పుడు వరములు తమకే
ముప్పును కలిగించుననెడు ముత్తెపు పలుకే
యెప్పటికైనను నది కను
విప్పును కలిగించు ననుట విశదంబగుగా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పశుప తిగురిచి తపమును భస్ము డనెడు
రిప్లయితొలగించండినసురు జేయగ సంతసిం చిశివు డతని
కీయ వరమును , భస్మము జేయ దలచ
విష్ణు డంతట మోహిని వేషమునన
వచ్చి యసురుని గావించె భస్మ మటుల
భస్మాసురాఖ్యుడు భక్తితో మెప్పించి
రిప్లయితొలగించండిప్రసన్ను గావించి పరమ శివుని
తన జేయి నెవ్వరి తలపైన నుంచిన
భస్మమగునటుల వరముబొందె
వరపుమహిమజూడ పరమేశ్వరుని పైన
తా బ్రయోగింపగ దలచెనతడు
శివునిరక్షింపగ శేషశయనుడెంచి
మోహినిగ నసురు మోహపరచె
దరికి జేరు ముందు తలస్నాన మునుజేయు
మంచు పంపె భామ యసురు నదికి
తలను జేయి నిడుచు తలనంట బోవగ
భస్మ మయ్యె నతడు వరమువలన