7, డిసెంబర్ 2014, ఆదివారం

నిషిద్ధాక్షరి - 23

కవిమిత్రులారా,
అంశం- సూర్యోదయ వర్ణనము
నిషిద్ధాక్షరములు - ద్విత్వ సంయుక్తాక్షరములు.
ఛందస్సు - కందము.

23 కామెంట్‌లు:

 1. అరుణ కిరణము లు గనబడె
  నరయగ నుదయించె నిపుడు నా ఖగ పతియే
  విరజిల గాంతులు బాగుగ
  కరముగ వికసించు బూలు కాసార మునన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  తొలిసంధ్య :

  01)
  ____________________________________

  చలిదాయ కిరణ కలిలము
  నిలుపగ జగతిని నిరతము ♦ నిరపాయమునన్
  తొలిదెస తెలతెలవాఱిన
  తొలగును చీకటి తెరలవి ♦ దొరయగ వెలుగుల్ !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 3. రవి కిరణము ప్రస రించగ
  భువి పరవశ మొందె నంత పూవులు విరిసెన్
  కవి హృదయము పొంగి పొరలి
  కవనములే కురిసె నంట గణముల కలముల్

  రిప్లయితొలగించండి
 4. తెలతెల వారెను తూరుపు
  వెలుగులు ప్రసరింప జేసె వినుమానికమే!
  కలువలు మురిసెను సరసున
  పులకింతల పూలు విరిసె పుడమిని జూడన్!!!

  రిప్లయితొలగించండి
 5. మాస్టరుగారూ ! సూర్యనారాయణ గారి గృహప్రవేశం..తో పాటు ...సూర్యోదయ వర్ణన...కాకతాళీయమేనా ?

  రిప్లయితొలగించండి
 6. తూరుపు తలుపుల దోసుక
  నేరుగ చీకటిని జూడ నెరుపుగ, రవినే
  మీరిన భయమున వేడుచు
  బారగ నిశి, కమలములట పకపక మనియెన్.

  రిప్లయితొలగించండి
 7. అరుణుడుదయించె తూరుపు
  ధరమురిసి తలుపులు తెరచె ధన దేవతకున్
  తరుణులు తను శోధన చలి
  పి రయమునను పయనమైరి విధుని కొలువగన్

  రిప్లయితొలగించండి
 8. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విరజిలు’ అన్న శబ్దం లేదు. అక్కడ ‘మెరిసెడి కాంతులు...’ అనండి.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ప్ర’ అని సంయుక్తాక్షరాన్ని ప్రయోగించారు. అక్కడ ‘రవికిరణము కలగొనగా’ అనండి.
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీరు కూడా అక్కయ్యగారి చేసిన పొరపాటు చేశారు. ‘వెలుగులు దెసలందు నింపె...’ అనండి.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అది కాకతాళీయమే! అలా కలిసివచ్చింది ☺
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని అడిగింది కందపద్యం కదా!
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. వెలుగుల యెకిమీ డడుగో
  తొలిదెస నుదయించినాడు తోయజ పతియై
  కలువలు ముకుళించెను తమ
  చెలువుడు కనరామి నింగి చినవోయినవై.

  రిప్లయితొలగించండి
 10. మెరిసెను కొండను నినుడల
  నెరుపౌ పండుగ వెలుగగ,నింపయె జగతే,
  చిరుచెమట జేరె నొడళుల,
  విరివిగ పనులవి మొదలయె వేకువ యగుటన్

  రవి తూరుపందు నెరుపా
  ర,వరారోహణము సేయ,రమణంబిలనౌ
  నవె తామరలు,వెలిగెగా,
  భువి సేమంబందె వేడి పొందగ జీవుల్

  వెలిగెను నెరుపగు బింబము
  నలుపది తొలగియు జగతిని నలమెను తెలుపే
  పలు జీవులు మెలకువతో
  చెలగిరి,పనులవి మొదలయె జీవిక కొరకై

  రిప్లయితొలగించండి
 11. అరుణ కిరణ కాంతులొసగి
  నరుదించె ధరణి వరించ నాకము మురియన్
  తరులును కవులును మురియరె?
  విరివిగ పూవులు తరించి వికసించనిటన్

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  పద్యము:1.మంచు విడిపోవ తూరుపు
  ట౦చులలో నరుణ కాంతి యందము లొలుకన్
  పంచగ నానందము నిల
  వంచగ సోమరి తనమును భానుడు విరిసెన్
  2.తన పర భేదము జూడడు
  యినుడు జడము జీవమనుచు నె౦చడు జగమున్ తనకా౦తులతో నింపును
  ననవరతము చేతనమును న౦ది౦చు గనన్
  3.మనమున చీకటి బాపగ
  తనువుకు తళతళలు నీయ తనివోవు విధిన్
  దినదినమును ఉదయించును
  తనపనిలో విసుగు గాని తడయుట లేకన్

  డిసెంబర్ 07, 2014 1:46 PM

  రిప్లయితొలగించండి
 13. చీకటి మధుపము కరచిన
  ఆకాశకపోలము పయి నరుణిమ విహగా
  నీక మను నఖదళముతో
  గీకిన రేగిన కణితిగ కిరణుడు మొలచెన్ :D

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులందఱకు నమస్కారములు!

  తూరుపు దెస నరుణ కిరణ
  ధారణుఁడై చిఱునగవుల తపనుఁ డడుగిడన్
  ధారుణి పొంగుచు ఘన కా
  సార కమల వికచ హాస సౌరభము లిడెన్!

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘జగతి + ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘జగమే’ అనండి.
  రెండవ పూరణలో ‘రవి తూర్పునందు..’ అనండి.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  ఆదిత్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కెఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

  ప్రకటోదయ కాంతి పట౦
  బు కుళిందుడన రవి పరచె భూసతి పైనన్
  వికసితమగు నాజన హృద
  య కమలముల ప౦చు మాలి యనవిహరించెన్

  రిప్లయితొలగించండి
 17. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కె.ఈశ్వరప్పగారి పూరణ
  వెలుగుల రాయడు రాకచె
  నలుగుచు చీకటులు చలియు నగుపడ కెటులో
  తొలగుట గన వి౦తగులే
  విలువగు విధి మరువ డెపుడు వేలుపు రవియే

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చే’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వాడరాదు. అందుకని అక్కడ ‘వెలుగులరాయని రాకన్’ అనండి.

  రిప్లయితొలగించండి
 20. ఆచారి గారి పూరణలో మొదటే సంయుక్తం వాడేరు.

  రిప్లయితొలగించండి
 21. మిస్సన్న గారూ,
  నిజమే స్మీ! నేను గమనించలేదు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. వెలుగుల రాయని సభలో
  కలువలు శిలలై నిలువగ కలుముల పీఠం
  బులుగా విరిసిన కమలము
  లొలుకును వయ్యారములిల నోహో యనగా.

  రిప్లయితొలగించండి
 23. లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి