మయసభలో సుయోధనుడు : 01) _______________________________________
హృదయము దోచు కొన్నదిది ♦ యేవిధి వీరికి జిక్కెనో గదా !!! (మయసభ సౌందర్యం) పదిలము గాదు నా కిచట ♦ పాండవ ధూర్తు లదేమి పన్నిరో ? (అంతలోనే అనుమానం ) పదుగురిలో పరాభవము ♦ పాతకి ద్రౌపది సేయ, వాడి బా (వెంటనే అవమానంతో) కదె బిగి గుండెలో దిగుచు ♦ గాయము సేసిన యట్లు వేచగన్ ! (గుండెకు గాయం)
నే నీ చోటును వీడి పో యెదను, కా ♦ నీ, శాంతి నెట్లుండెదన్ ? నే నెట్లీ యవమానభారమును పో ♦ నీ యంచుపేక్షించెదన్ ? నే నే తీరున పాండవాగ్రజుని దు ♦ ర్నీతున్నిబంధించెదన్ ? నే నే రీతిని మాఱుసేత గని సా ♦ ని న్వేగ శిక్షించెదన్ ? _______________________________________ దుర్నీతుడు---(ధర్మరాజు- సుయోధనుని యోచనలో) సాని---(ద్రౌపది- సుయోధనుని యోచనలో)
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీరు మూడు పొరపాట్లు చేశారు. మొదటిది ఛందస్సు మార్చడం, రెండవది న్యస్తాక్షరాల వరుస మార్చడం, మూడవది కందంలో రెండు పాదాలను లఘువులతో, రెండు పాదాలను గురువులతో ప్రారంభించడం. మీ ద్వితీయ ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నాను. స్వస్తి! **** వసంత కిశోర్ గారూ, కొసరు శార్దూలపద్యంతో సహా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మదమున నేను పాండవుల మాయ సభాస్థలి కేగుదెంచితిన్ మది మరగెన్ పరాభావపు మంటల తాకిడి కీ దినమ్ము నా నుదుటను బ్రహ్మ ద్రౌపది వినోదపు ముట్టుగ నన్ను వ్రాసెనో అదె నిజమౌను కాక యకటా కురురాజుకు బన్న ముండునే.
మదమున పాండవాధములమానుషరీతి సృజించి నేఁడు మా
రిప్లయితొలగించండిమదినిదె కృంగఁజేసి యభిమానధురంధరుఁడైన నన్నునా
యదుకుల సింహుఁజేరిపరిహాసమొనర్చెడుతీరుగాంచనో
పదె మది దివ్యకాంతిమయ వౌభవమెన్నగ శక్యమౌనటే.
హృదయమునందు భగ్గుమనె నిమ్మహిమాన్విత మైన కట్టడం
రిప్లయితొలగించండిబిదివరకెన్నడున్ గలదె యీయిలలోనని యస్సుయోధనుం
డెదురుగ యున్న వన్ని తన కేమియు గానక లేనివన్ని తా
నదె గని విస్మయంబుగొనె యమ్మయు మాయకునస్సభాస్థలిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
మయసభలో సుయోధనుడు :
01)
_______________________________________
హృదయము దోచు కొన్నదిది ♦ యేవిధి వీరికి జిక్కెనో గదా !!! (మయసభ సౌందర్యం)
పదిలము గాదు నా కిచట ♦ పాండవ ధూర్తు లదేమి పన్నిరో ? (అంతలోనే అనుమానం )
పదుగురిలో పరాభవము ♦ పాతకి ద్రౌపది సేయ, వాడి బా (వెంటనే అవమానంతో)
కదె బిగి గుండెలో దిగుచు ♦ గాయము సేసిన యట్లు వేచగన్ ! (గుండెకు గాయం)
నే నీ చోటును వీడి పో యెదను, కా ♦ నీ, శాంతి నెట్లుండెదన్ ?
నే నెట్లీ యవమానభారమును పో ♦ నీ యంచుపేక్షించెదన్ ?
నే నే తీరున పాండవాగ్రజుని దు ♦ ర్నీతున్నిబంధించెదన్ ?
నే నే రీతిని మాఱుసేత గని సా ♦ ని న్వేగ శిక్షించెదన్ ?
_______________________________________
దుర్నీతుడు---(ధర్మరాజు- సుయోధనుని యోచనలో)
సాని---(ద్రౌపది- సుయోధనుని యోచనలో)
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీరు మూడు పొరపాట్లు చేశారు. మొదటిది ఛందస్సు మార్చడం, రెండవది న్యస్తాక్షరాల వరుస మార్చడం, మూడవది కందంలో రెండు పాదాలను లఘువులతో, రెండు పాదాలను గురువులతో ప్రారంభించడం.
మీ ద్వితీయ ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తున్నాను. స్వస్తి!
****
వసంత కిశోర్ గారూ,
కొసరు శార్దూలపద్యంతో సహా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సదనములోని దృశ్యములు సంతసమున్ కలిగించుచుండగా
రిప్లయితొలగించండిమదిని దహించె ద్రౌపది యమానిష చయ్దము నాకు పట్టునే
నిదుర గృహంబు నందునను నిత్యము బంధకి చేష్ట భారమ
వ్వ దెసను కాంచ కుంటి కడు వంచన మ్రింగి వశింప శక్యమే!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అమానుష చెయ్దము’ అని సమాసం చేయరాదు. ‘అమానుష కార్యము’ అనండి.
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికదలెను రాజరాజు సభ గాంచెను తామరపూలు నొక్కచో
పదిలముగా జలాశయ మను భ్రా౦తిని జెందుచు పంచె
నెత్తగా
బెదురుయొకింత లేక నగె పెద్దగ ద్రౌపది.హాసమున్ విన౦
గదె యవమానమ౦చు నత డగ్ని ప్రవేశము జేతునంచనె న్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జలాశయమను’ అన్నచోట గణదోషం. ‘జలాశయపు భ్రాంతిని...’ అనండి.
సదనముఁ జూడ భవ్యమగు, చాల విచిత్రములున్నవిచ్చటన్
రిప్లయితొలగించండిమది పలు మాఱులుల్కిపడు మాయలు పెక్కులునుండె, వీరి కే
కొదువయు లేదునెంచగను కూర్మినిఁ గూడి జయించిరెల్ల; నె
ట్టి దెసకొ యంపి కష్టమిడుటే మిగిలెన్ గద, రాజరాజుకున్?
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుర్యోధనుని స్వగతమే నేను వ్రాసినది. దుర్యోధనుడు తనను తానే రాజరాజు అని సంబోధించుకోవడం అతని అహంకారానికి గుర్తు.
రిప్లయితొలగించండిగురువుగారు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికె.ఈశ్వరప్పగారిపూరణ
రిప్లయితొలగించండికదలని దైన మాయసభ గాంచగ వింతల కల్పితాలతో
మదిగది నిండి పోయెనని మత్సర మందున రాజరాజు తా
కుదురుగ నుండ లేననుచు కూర్పున నేర్పునమందిరమ్ము రూ
పదె మనసందు జేరగనె పక్కుననవ్వెను నూహనట్టియున్
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
సవరించిన పద్యము
కదలెను రాజరాజు సభ గాంచెను తామరపూలు నొక్కచో
పదిలముగా జలాశయపు భ్రా౦తిని జెందుచు పంచె
నెత్తగా
బెదురుయొకింత లేక నగె పెద్దగ ద్రౌపది.హాసమున్ విన౦
గదె యవమానమ౦చు నత డగ్ని ప్రవేశము జేతునంచనె న్
సదమల రాజసూయమున చక్కని దాయల శోభ గాంచియున్,
రిప్లయితొలగించండిమదినటులా సభం గనిన మాయల నామయు కల్పనంబుకున్
కుదురది తగ్గి,ద్రోవదియె ,కొవ్వున నవ్వె నటంచు నీసునన్
నదె తనుఁ జూచి నవ్వెనని,యాత్మను కుందెను రాజరాజు తా!
మదమున నా సభాంతరము మాయల గాంచియు నీసునంది తా
హృదినటు గోప్యమౌ గతిని నేడ్చుచు నుండగ,పాండు పత్నియే
కుదురుగ నవ్వె నంచనుచు కోపము నందియు,దాయ నాశమున్
మదెరుగ, రాజరాజు వెస మంతన మాడె చతుష్టయంబుతో
సదరు సభాస్థలమ్మునను సాదర స్వాగత మీయనేల? మా
రిప్లయితొలగించండిమదికట లేనిపోని మహిమాన్విత దృశ్యము లంటనేల? తాఁ
బదుగురి లోన నన్నుగని పాతకి యంతగనవ్వ నేల? న
న్నదె పరిమార్చునో? రయమె యైదుగురంతము జూడగాదగున్!
కదలనిబొమ్మలున్ కదలు కాగనయ్యెను చిత్రచిత్రముల్
రిప్లయితొలగించండిఇది గన నాకులేదు మదినెట్టులనోపుదు వీరివృద్ధినిన్
ముదురగ పట్టలేము మరి ముందరె వేటును వేయగావలెన్
అదెగద చక్కనౌ కొలను హాయిని బొందెద విశ్రమించెదన్.
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండిహృదయమునందు నీర్ష్య జనియింప సుయోధనుఁ డాసభాంతర
మ్మెదిరి మహోన్నతిం దెలుప నెన్నియొ రీతుల భంగమందుౘున్
గుదురుగ నిల్వలేక యటఁ గొందలమందుౘునుండ మేడ నొ
క్క దెసను యాజ్ఞసేని చెలికత్తెలు నవ్వఁగ నొందె ఖేదమున్!
మదమున నేను పాండవుల మాయ సభాస్థలి కేగుదెంచితిన్
రిప్లయితొలగించండిమది మరగెన్ పరాభావపు మంటల తాకిడి కీ దినమ్ము నా
నుదుటను బ్రహ్మ ద్రౌపది వినోదపు ముట్టుగ నన్ను వ్రాసెనో
అదె నిజమౌను కాక యకటా కురురాజుకు బన్న ముండునే.
దరువులు సాగు చున్నవటు తారలు నాట్యము చేయు చిత్ర మం
రిప్లయితొలగించండిదిరమున ,రాజరాజు కడు దీక్షగ వీక్షణ సేయు చుండగన్ ,
దురదుర నవ్వులా టలటు తోచగ దూరెను కృష్ణ శీలమున్
దెరలెను పాండు వైభవము దీక్షను బూనుచు కక్ష సేయుచున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
గురువు గారికి పాదాభి వందనం
రిప్లయితొలగించండిపొరపాటు మన్నించ గలరు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఊహ నట్టియున్’ అన్వయం కుదరలేదని అనిపిస్తున్నది.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
పాద ప్రాసాక్షరానికి బదులు, ప్రథమాక్షరంగా పొరబడ్డారు. అయినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.