15, డిసెంబర్ 2014, సోమవారం

న్యస్తాక్షరి - 19

అంశం- దాఁగుడుమూఁతలు.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘బా’
రెండవపాదం ఆఱవ అక్షరం ‘వే’
మూడవపాదం పదవ అక్షరం ‘దా’
నాలుగవపాదం పదునాఱవ అక్షరం ‘సం’

16 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  దాఁగుడుమూఁతలు - తక్కు క్రీడలు :

  01)
  __________________________________

  బాలురు బాలికల్ కలసి - బాల్యము నందున నాడు నాటలన్
  చాలన నట్టి వేడుకయె - చక్కని దాగుడు మూతలాటయే !
  తాలుగ మారిపోయె గద - దాగుడు మూతలు, తక్కు క్రీడలున్
  లోలురు కంప్యుటర్కిపుడు - లోకము నందలి సంతు వింతగన్ !
  __________________________________
  చాలన నట్టి వేడుకయె = తనివి తీరని సంతోషం
  తక్కు = తతిమ్మా , శేషము

  రిప్లయితొలగించండి
 2. కొత్త ప్రేమికులు :

  02)
  __________________________________

  బాగరి , కోడెకాడిలను - ప్రశ్రయ మందిన నూత్న వేళలన్
  సాగక, వింత వేదనను - చాటుగ క్లాసున, బస్సులోననో
  త్రాగుచు నుందు రొండొరుల - దాగుడు మూతల వాలు చూపులన్ !
  వేగుల బంపు కొందురిక - వేగము మీఱగ సంకటంబులన్ !
  __________________________________
  బాగరి = స్త్రీ
  కోడెకాడు = యువకుడు
  ప్రశ్రయము = ప్రేమ245

  రిప్లయితొలగించండి
 3. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతోపంపుపూరణం
  బాలలజీవితానమన-భాద్యతదాగుడుమూతలయ్యెయీ
  కాలముబంచువేదనలకామితమందుననాటపాటపం
  ద్యాలకుకాలమెక్కడిది.దానవతత్వముపెంపుచేతపో
  జాలదుప్రేమపెంపునకుజాగృతిలేదిట-సంతసంబుకున్

  రిప్లయితొలగించండి
 4. బాసనుఁజేసితీవనుచు భాగ్యమునాదని పొంగిపోతి, నీ
  కోసమె యెల్లవేళలను కోటివరమ్ముల కోరుకొంటి, నీ
  దాసిగసేవఁజేసితిని దాగుడుమూతలనాడుచుంటివే?
  నాసముఖమ్ముఁజేరవొకొ, నందకుమారుడ! సందెవేళలో?

  రిప్లయితొలగించండి
 5. సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలలో పాల్గొనడానికి వెళ్తున్న కారణంగా నేనీరోజు బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి కవిమిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  చక్రికి నేను బాబాయిని అవుతాను. చక్రి తల్లి మా ఆవిడకు అక్కయ్య (పెద్దమ్మ కూతురు).

  రిప్లయితొలగించండి
 6. బాలకు డొక్క డల్ల వ్రజవాటిక లందున నాడె నాట నా-
  భీలకరంబు వేదవనవీధుల దోచు విశుద్ధ లీల నే-
  త్రాలకు ముందువెన్కలను దాగుడు మూతల వింత క్రీడ ఆ-
  పీలికధాతకున్ హృదయపీఠిని గూర్చొని సంభ్రమంబుగా

  రిప్లయితొలగించండి
 7. "బా"లలు నెల్లరున్ వరుస బారును తీరియు నిల్చి యుండియున్
  లీలగ మూసి"వే"యుచును లెక్కగ కండ్లను నొక్క బాలకున్
  తాలిమిచెప్పు మంచు తను "దా"కినదెవ్వరొ యంచు ప్రశ్నిడన్
  బాలయె పేరుచెప్పుటది బంధుర మాటయు "సం"బరంబునౌ

  "బా"గగు నాటగా కనులు బాగుగ మూసియు తక్కువారలన్
  వేగమ తాకి "వే"యడుగ వెళ్ళిన దెవ్వరొ చెప్పుమన్నచో
  తా గురుతించి వారినటు "దా"కిన వారిపేరు తెల్పగా
  వేగమ పంట యందురది వెళ్ళును గెల్చిన "సం"బరంబునన్

  రిప్లయితొలగించండి
 8. బాలిమమందు నాడుదురు బాలలు కళ్ళను మూసివేయుచున్
  మేలగు జూడవేడుకిది ప్రీతిగ నాడగ సంగడీలతో
  తాలిమి తోడనెయ్యముగ దాగుడు మూతల నాటమేదినన్
  కాలపు ఛాయలోగలసె కందువ లుండెను సంతతమ్ముగన్!!!

  రిప్లయితొలగించండి
 9. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
  బాలికలన్ననిర్దయవివక్షతజూపగధర్మమేన-యే
  జాలినిజూపవేలమనజాలకవంశమువృద్ధిజెందునా
  తాలగునాడజాతియనదాగుడుమూతలజన్మలైనచో
  పాలునువీడికాఫిగొనుపద్ధతులుండగసంకటంబగున్

  రిప్లయితొలగించండి
 10. బాగగు నాకు నో చెలియ! భాగిని గా నువు నాకు చిక్కినన్
  రాగము పంచ వే యిటకు రమ్ముసుహాసిని మంజు భాషిణీ
  దాగుడు మూతలేల సఖి! దాచకు నీ హృదిలోని కోర్కెలన్
  సాగును జీవితమ్ము నువు సారధి వైనను సంతసమ్ముగన్

  రిప్లయితొలగించండి
 11. ​బాలురు బాలికల్ కలిసి బాల్యమునందున తన్మయమ్ముతో
  మే​​​లిమి కల్గ ​​​​​​వేడుకగ మిత్రత పొంగగ వారి గుండెలో
  దాలిచి కండ్ల గంతలను దాగుడు మూతల నాడుచుండుచున్
  కాలము వెళ్ళబుచ్చుదురు గంటలు గంటలు సంతసమ్మునన్!

  రిప్లయితొలగించండి
 12. sri chakri gariki ashru nayanalato.....

  చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
  జన్మ లేకుండ జేయను సమ్మతించి
  సకల శుభములు గలిగించు శంక రుండు
  నీదు నాత్మకు శాంతిని నించు గాక !

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా !
  చిన్న వయసులోనే చక్రి మరణం - చాలా బాధగా ఉంది !
  వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన !


  రిప్లయితొలగించండి
 14. వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  టైపాట్లు ఉండకుండా జాగ్రత్త పడండి. పదాలమధ్య వ్యవధానం ఉంచండి.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  ****
  ఆదిత్య గారూ,
  చక్కని పూరణ చేశారు. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణ మూడవ పాదంలో ‘వారి పేరు’ అన్నచోట గణదోషం. ‘వారల పేరు’ అంటే సరి!
  ****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి