27, అక్టోబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 506 (ఏనుఁగు జన్మించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

34 కామెంట్‌లు:

  1. తపస్సును భంగము చేసిన ఒక ఏనుగునకు ముని శాపము నిచ్చుట...

    ఏనుగ! యెలుకగ పుట్టుము
    ఈనా శాపంబు దొలగ దెవ్విధి యనగా
    కానల తాపసి, యట్టులె
    ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

    రిప్లయితొలగించండి
  2. నానీ! మన పిల్లిది తె-
    ల్లేనుగు! జన్మించె నొక్క యెలుక కడుపునన్
    కూనలు పది పై మిద్దెను,
    కానిచ్చును పాలు పెరుగు కానదు వానిన్.

    రిప్లయితొలగించండి
  3. రానున గాలము నందున
    జాణలు జన్యువులుఁ జేర్చి జత గూర్చంగన్
    వీనుల వింతలు వినమటె
    ' ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !'

    రిప్లయితొలగించండి
  4. మా అన్నగారు శ్రీ నేమాని కోదండ రామారావు గారి పూరణ:
    ధీనిధి యుత్తరు డని నరి
    సేనను విక్రమమెలర్ప జెండాడె నహో
    వాని గని తలచె శల్యుం
    డేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్

    మా పూరణ:
    ఆనందరూప, శక్తి ని
    ధానము, ముల్లోకములకు దల్లి, గిరిజగా
    మేనక సుతయై యొప్పదె
    యేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  5. మ్రానయ్యెదిగెడు తరువును
    జానెడు బొన్సాయిజేయ జపనీయులు న
    ద్దానిని గనియనుకొంటిని
    ఏనుగు జన్మించెనొక్క యెలుక కడుపునన్

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  6. శ్రీనాథ! వినర కన్నా!
    యీ నీకథలను మరింత యింపుగఁజెపుమా!
    మా నాయన! "యెలుక"ది- "కా
    దేనుఁగు"; జన్మించె నొక్క యెలుక కడుపునన్.

    అమ్మ చెప్పిన కథలను బుల్లి శ్రీనాథుడు తాను చెప్ప ముచ్చట పడి చెప్పబూని ఒక ఎలుకకు ఏనుగు పుట్టిందనగా అమ్మసరి చేయుట.

    రిప్లయితొలగించండి
  7. నా పూరణ .....

    క్షీరసాగరమును ద్రచ్చ శ్వేతవర్ణ
    మొప్పు యేనుఁగు జన్మించె; నొక్క యెలుక
    కడుపునన్ బుట్టెగద శాబకములు పెక్కు
    తల్లిపోలికను నెలుకపిల్ల లనఁగ.

    రిప్లయితొలగించండి
  8. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    శాపగ్రస్తమైన ఏనుగు కథతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    పిల్లికి ‘తెల్లేనుగు’ ముద్దుపేరా? మీ పద్యం బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    జన్యువు మార్పిడితో జరుగుతున్న వింతలను ఇప్పటికే చూస్తున్నాము.
    చక్కని పూరణ. అభినందనలు.
    రానున్న ‘రానున’ కాదు కదా! అక్కడ ‘రానున్న కాలమందున’ అంటే సరి!
    **********************************************************************
    నేమాని కోదండ రామారావు గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సవినయంగా స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    బోన్సాయి ప్రస్తావనతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘మ్రానెయ్యెదిగెడు’ ... ఇక్కడ ఏమైనా టైపాటా?
    **********************************************************************
    మంచాకిని గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘ఎలుకది’ అన్నప్పుడు మీ ఉద్దేశంలో ‘ఎలుక + అది’ అయితే సవరించాలి. అక్కడ ‘ఎలుక యది’ అని యడాగమం రావాలి. ‘ఎలుకయె’ అంటే సరిపోతుందనుకుంటాను?
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  9. ఎప్పుడూ యున్నవీ లెనివీ వార్తలు మోసుకువచ్చి చెప్పే మిత్రుని ఉద్దేశించిమిత్రుడు ఈవిధంగా అన్నాడనినాభావన.

    కానగ లేవా జగతిని ?
    మానగ లేవా యనృతపు మాటలు బల్కన్ ?
    యేనాడు? యెచట? నెట్టుల?
    యేనుగు జన్మించె నొక్క యెలుక కడుపునన్ !!!

    (గురువుగారు మన్నించాలి మరో విధంగా పూరించడం తెలియ లేదు).

    రిప్లయితొలగించండి
  10. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, అక్టోబర్ 27, 2011 12:53:00 PM

    దేని తల దాల్చె గణపతి ?
    పూనిక వాహన మగుటకు బుట్టిన దేదీ ?
    దేన గల వన్ని లోకము ?
    లేనుగు ,జన్మించె నొక్క యెలుక ,కడుపునన్

    రిప్లయితొలగించండి
  11. **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ సమర్థనీయమే. ఇదీ పూరణాపద్ధతుల్లో ఒకటి. గొప్పగొప్ప అవధానులు కూడా ఈ పద్ధతిని ఆశ్రయించారు మరో దారి లేనప్పుడు. చక్కగా ఉంది. అభినందనలు.
    ‘ఏనాడు + ఎచట’ అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘ఏనా డెచ్చట నెట్టుల’ అంటే సరి!
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశ్నోత్తరపద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  12. దీన వసుదేవ దేవకి
    ప్రాణమగుచు కృష్ణుఁడుద్భవంబయె కృపతో.
    జ్ఞానాశ్రయ! కంది వరా!
    ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్యగారూ
    నమస్తే

    మ్రానై + ఎదిగెడు అని అనడంకోసం మ్రానయ్యెదిగెడు అన్నాను. అలా అనటం తప్పుకాదేమో అనిపించింది. ఒకవేళ తప్పే ఐతే దానిని మ్రానై పెరిగెడు అని అనుకుందాం.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు,
    చక్కని సవరణ. ధన్యవాదాలు.

    మీరు తేటగీతిని చేసి బాగా పూరణ చేశారు.

    రిప్లయితొలగించండి
  15. మానితి నాదు ప్రయత్నము
    నీనాటికి, విఫలమైతి నిట్టి సమస్యన్
    నేనో పూరణ జేసిన
    నేనుగు జన్మించునొక్క యెలుకకడుపునన్.

    రిప్లయితొలగించండి
  16. ఏ నాడు గనని వింతలు
    శ్వా నమునకు బుట్టె నకట ! సన్యాసి యటన్ !
    ఈ నాటి కలియు గమ్మున
    ఏనుగు జన్మిం చె నొక్క యెలుక కడుపునన్ !

    రిప్లయితొలగించండి
  17. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, అక్టోబర్ 27, 2011 7:32:00 PM

    గురువుగారూ,

    మన్నించాలి. ఎంతగా ఆలోచించినా గానీ ఈ రోజు సమస్యను పూర్తిచేయలేక పోతున్నాను. ఏ పుణ్యపురుషుడి పుట్టుక గురించి వ్రాద్దామనుకొన్నా గానీ తోచడము లేదు.

    ఎలుకకు ఏనుగు ప్రసవము ఎంత కష్టమైనదో నాకూ ఈ పూరణ అంత కష్టముగా తోస్తున్నది. అందుకే పైవిధంగా పూర్తి చేసినాను.

    రిప్లయితొలగించండి
  18. ధేనుక ధారల శత్రులఁ
    దీనులుగ మలచిన ఖడ్గతిక్కన శూరున్
    కానగబ్రాహ్మణుడగుబో
    ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్.

    రిప్లయితొలగించండి
  19. **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    కామేశ్వర శర్మ గారూ,
    ‘మ్రానై + ఎదిగెడు’ అన్నప్పుడు తప్పనిసరి యడాగమం వస్తుందొ. అక్కడ ‘మ్రానై యెదిగెడు / మ్రానయి యెదిగెడు’ అని చెప్పవచ్చు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చేతకాదంటూనే చమత్కారంగా పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  20. **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమ:

    ఈనర గర్భము నందున
    ఆనారాయణుడు పుట్టె నాశ్చర్యముగాన్
    కానగ నిజమే నగుమరి
    ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్

    అంత పెద్ద దేవుడు యింత చిన్న మనిషికి జన్మించటమును సమస్యా భావంతో పోల్చినాను

    రిప్లయితొలగించండి
  22. net problem వలన
    నాలుగు రోజులనుండి మిత్రదర్శనానికి దూరమయ్యాను !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    ఈనాడొక వింత కబురు
    నానా చానళ్ళ యందు - నాట్యమ్మాడెన్ !
    నేనేమొ నమ్మ జాలను;
    "ఏనుఁగు జన్మించె నొక్క - యెలుక కడుపునన్" !
    _________________________________

    రిప్లయితొలగించండి
  23. ఎలుకపిల్ల తొండంతో పుట్టిందని వార్త !

    02)
    _________________________________

    ఆనాడు స్వామి చెప్పెను
    ఈనాడవి జరుగు చుండె - నేమి మహిమయో !!!
    పూనాలో వింత జరిగె
    "ఏనుఁగు జన్మించె నొక్క - యెలుక కడుపునన్" !
    _________________________________
    స్వామి = వీరబ్రహ్మేంద్ర స్వామి

    రిప్లయితొలగించండి
  24. పేపర్లో వార్త :

    03)
    _________________________________

    కూనలు ఎనిమిది కలిగిన
    ఏనుగు తొండంబు తోడ - యీనెను వానిన్
    ఓ నాలుగు కూనల నట
    "ఏనుఁగు జన్మించె నొక్క - యెలుక కడుపునన్" !
    _________________________________

    రిప్లయితొలగించండి
  25. 04)
    _________________________________

    ఏనుగు బొమ్మను కలుగున
    రాణీయే గాంచి చెప్పె - "రాతిరి వేళన్
    నేనొక వింతను గంటిని
    ఏనుఁగు జన్మించె నొక్క - యెలుక కడుపునన్" !
    _________________________________
    రాణీ = ఏడేళ్ళ పాప

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ ధన్యవాదాలు. ఇక్కడ ' తెల్లేనుగు' అంటే నా భావం పిల్లి తిని కూర్చోవడమే కానీ ఎలుకలను పట్టడం లేదు, తిండి దండుగ, ఇదో వైట్ ఎలిఫెంట్ లా తయారయ్యింది, అని.

    రిప్లయితొలగించండి
  27. **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    నాలుగు రోజులు కనపడనందున నాలుగు చక్కని పూరణలతో పరిహారం చెల్లించుకున్నారు. సంతోషం. అభినందనలు.
    మొదటి పూరణ అన్ని విధాలా బాగుంది.
    రెండవ పూరణలో ‘చెప్పెను / ఈనాడవి’ అనడం కంటే ‘చెప్పగ / నీనాడవి’ అంటే బాగుంటుందేమో?
    మూడవ పూరణలోను ‘కూనలు ఎనిమిది’ అన్నారు. అక్కడ సంధి నిత్యం. ‘కూన లెనిమిదియు గలిగిన’ అందాం.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    మీ ‘తెల్లేనుగు’ కాన్సెప్టును వెంటనే గ్రహింపలేని మూఢమతిని. ఇప్పుడు సంపూర్ణంగా అవగాహనకు వచ్చింది. ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ఆత్మనింద పనికిరాదని మీబోటి పెద్దలు సెలవిస్తూంటారు

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  30. కానగ వచ్చెను కలలో
    నేనుగ మాయకు శుభముగ నీరూపమునన్
    దీనదయాళువు బుద్ధుడు:
    "ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్"


    మాయ = మాయావతి

    "Legend has it that, on the night Siddhartha was conceived, Queen Maya dreamt that a white elephant with six white tusks entered her right side, and ten months laterSiddhartha was born."

    https://en.m.wikipedia.org/wiki/Gautama_Buddha

    రిప్లయితొలగించండి
  31. దీనపు మేరీ మాతకు
    కూనగ రోమునను బుట్టి గుప్పెడు గుడిసెన్
    కానగ సోనియ గాంధిని:
    "ఏనుఁగు జన్మించె నొక్క యెలుక కడుపునన్"

    రిప్లయితొలగించండి